భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో తన '2022 టుసాన్' (2022 Tucson) ను ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీని ఎప్పుడు విడుదల చేస్తుంది అనే సమాచారం ఆవిష్కరణ సమయంలో వెల్లడించలేదు. అయితే ఇప్పుడు కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం 2022 హ్యుందాయ్ టుసాన్ ఆగష్టు 10 న విడుదలకానుంది. విడుదల సమయంలోనే ఈ కొత్త మోడల్ ధరలు కూడా వెల్లడవుతాయి.

2022 హ్యుందాయ్ టుసాన్ రెండు వేయియంట్స్ లో రానున్నట్లు సమాచారం. అవి ప్లాటినం మరియు సిగ్నేచర్ వేరియంట్స్. ఇది మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ SUV ఇప్పుడు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

2022 హ్యుందాయ్ టూసాన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. కావున దీని ముందు భాగంలో కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో అద్భుతంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకూండా ఈ SUV ముందు భాగంలో, పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్‌ ఉంటుంది. హెడ్‌లైట్‌లు నిలువుగా పేర్చబడి గ్రిల్‌కి ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో సెంట్రల్ ఎయిర్ డ్యామ్ మరియు సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ చూడవచ్చు. రియర్ ఫ్రొఫైల్ లో ఎస్‌యూవీ వెడల్పు అంతటా ఉండే టెయిల్‌లైట్‌ ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

2022 హ్యుందాయ్ టూసాన్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింది భాగంలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం కంట్రోల్స్ మరియు ఓ టచ్-ఆధారిత ప్యానెల్ కూడా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

ఇందులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వెనుకవైపు రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు ఉంటాయి. అన్ని సీట్లు లెథెరెట్ అప్‌హోలెస్ట్రీలో ఉంటాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ మరియు మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్.

ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. అదే సమయంలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 184 బిహెచ్‌పి పవర్ మరియు 417 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

2022 హ్యుందాయ్ టూసాన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఎబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో 2022 హ్యుందాయ్ టుసాన్ లాంచ్ ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హ్యుందాయ్ కంపెనీ తన 2022 టూసాన్ ను ఆగష్టు 04 న విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందే తెలిపింది. కానీ ఇప్పుడు అది కాస్త ఆగష్టు 10 చేరుకుంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త SUV ని ఆగష్టు 10 న విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది మునుపటి మోడల్ కంటే ఆధునికంగా ఉంటుంది. అయితే ఈ SUV మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New hyundai tucson india launch on 10th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X