వచ్చే నెలకల్లా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న '2022 జీప్ గ్రాండ్ చెరోకీ'.. ఇదే: చూడండి
భారతీయ మార్కెట్లో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన 'జీప్ ఇండియా' (Jeep India) వచ్చే నెలలో (2022 నవంబర్) ఒక కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఒక టీజర్ కూడా విడుదల చేసింది. కంపెనీ విడుదలలు చేయనున్న కొత్త SUV పేరు '2022 జీప్ గ్రాండ్ చెరోకీ'. ఈ కొత్త SUV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త 'గ్రాండ్ చెరోకీ' అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందనుంది. ఈ SUV రాంగ్లర్ , కంపాస్ మరియు మెరిడియన్ స్థానికంగా అసెంబుల్ చేయబడిన మోడల్.

2022 గ్రాండ్ చెరోకీ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త గ్రిల్ మరియు హెడ్‌లైట్ వంటి ఉన్నాయి. ఇది కొత్త టీజర్‌లో చూడవచ్చు.LED టైల్‌లైట్ కూడా వెనుక భాగంలో కనిపిస్తుంది. అంతే కాకూండా వెనుక బ్రాండ్ లోగో వంటివి కూడా గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పవచ్చు.

2022 జీప్ గ్రాండ్ చెరోకీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్ ముందు మరో డెడికేటెడ్ టచ్‌స్క్రీన్ వంటి డిస్‌ప్లేలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి కూడా లభిస్తాయి.

ఇంటీరియర్ లో గ్రాండ్ చెరోకీ సౌకర్యవంతమైన సీట్లను కూడా పొందుతుంది. అదే సమయంలో బ్రౌన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ డోర్‌లపై ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ ఇంటీరియర్‌కి ప్రీమియం లుక్‌ని అందిస్తాయి. టీజర్ లో గేర్ నాబ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తమ్ మీద ఇది ఆధునిక కాలంలో ఆధునిక టెక్నాలజీతో విడుదల కానున్న ఆధునిక కారు అవుతుంది.

కొత్త గ్రాండ్ చెరోకీ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. కావున మంచి పనితీరుని అందిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

2022 జీప్ గ్రాండ్ చెరోకీ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ మాత్రమే కాకుండా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇవన్నీ తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

జీప్ ఇండియా త్వరలో విడుదల కానున్న కొత్త గ్రాండ్ చెరోకీ ధరలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. కానీ ఇది సుమారు రూ. 85 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. కాగా ఈ SUV దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత డిసెంబర్ లో డెలివరీలు ప్రారభమయ్యే అవకాశం ఉంటుంది. కావున రాబోయే సంక్రాంతికల్లా మీరు ఈ కొత్త SUV ని డ్రైవ్ చేయవచ్చు.
2022 గ్రాండ్ చెరోకీ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క జిఎల్ఈ, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఈ SUV మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందా.. లేదా అనేది ఈ సంవత్సరం చివరికల్లా తెలిసిపోతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
జీప్ కంపెనీ యొక్క వాహనాలు ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో జీప్ ఇండియా మరో SUV ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది జీప్ ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. అయితే ఈ SUV గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు ఎప్పటికప్పుడు కొత్త కార్లు & బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








