కొత్త 'గ్రాండ్ చెరోకీ' కోసం బుకింగ్స్ ప్రారభించిన జీప్: అయితే డెలివరీలు అప్పుడే..
జీప్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'గ్రాండ్ చెరోకీ' (Grand Cherokee) ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసందే, ఇప్పటికే కంపెనీ ఈ SUV యొక్క లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది, కాగా అంతకంటే ముందే కంపెనీ ఈ SUV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

జీప్ కంపెనీ ఇప్పటికే తన ఐదవ తరం గ్రాండ్ చెరోకీని ఈ నెల 11 న లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. కావున జీప్ కొత్త SUV దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి ఇంక ఎన్నో రోజులు లేదు. కావున కంపెనీ కూడా రంజన్‌గావ్‌లోని దాని ఫెసిలిటీలో గ్రాండ్ చెరోకీని అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. కాగా ఇప్పుడు బుక్ చేసుకున్నవారికి నవంబర్ చివరినాటికి డెలివరీలు జరుగుతాయి.

దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ మంచి డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ SUV లో 7 స్లాట్ గ్రిల్ కలిగి ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో స్లిమ్ హెడ్‌లైట్ చూడవచ్చు.

అంతే కాకుండా ఇందులోని D-పిల్లర్ వద్ద ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్, రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ చూడవచ్చు. ఇప్పటికే కంపెనీ ఈ కొత్త SUV యొక్క టీజర్ కూడా అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వంటివాటిని చూడవచ్చు.

కొత్త గ్రాండ్ చెరోకీ ఇప్పటికే గ్లోబెల్ మార్కెట్లో 5 సీటర్ మరియు 7 సీటర్ మోడల్స్ లో విక్రయిస్తోంది. కాగా భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ మోడల్ కేవలం 5 సీటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే 7 సీటర్ మన దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు. రానున్న రోజుల్లో వస్తుందా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు.

కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ లో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. కావున ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంజిన్ యొక్క పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడికాలేదు. అయితే ఈ కొత్త SUV డీజిల్ ఇంజిన్ ఆప్సన్ పొందే అవకాశం లేదు.

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్ ముందు మరో డెడికేటెడ్ టచ్‌స్క్రీన్ వంటి డిస్‌ప్లేలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి లభిస్తాయి.

ఇందులో చాలా వరకు సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి, లోపలి భాగంలో ఎక్కువగా బ్రౌన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ చూడవచ్చు. ఇవన్నీ ఇంటీరియర్ ని మరింత అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అపోల్స్ట్రే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

2022 జీప్ గ్రాండ్ చెరోకీ మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇవన్నీ తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

కంపెనీ విడుదల చేయనున్న జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే దీని ధరలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఇది రూ. 75 లక్షల నుంచి రూ. 80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV మార్కెట్లో మెర్సిడెస్ జిఎల్ఈ, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








