నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ కంపెనీ 'జీప్' (Jeep) దేశీయ విఫణిలో మరో కొత్త SUV ని విడుదల చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే, అయితే ఈ కొత్త SUV వచ్చే నెల 11 న (2022 నవంబర్ 11) విడుదల కానున్నట్లు కంపెనీ తెలిపింది. జీప్ కొత్త SUV గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV పేరు 'గ్రాండ్ చెరోకీ'. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రాంగ్లర్ , కంపాస్ మరియు మెరిడియన్ తరువాత విడుదల కానున్న నాలుగవ మోడల్ కానుంది. కొత్త 'గ్రాండ్ చెరోకీ' అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందనుంది.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ SUV 7 స్లాట్ గ్రిల్‌ కలిగి ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో స్లిమ్ హెడ్‌లైట్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని D-పిల్లర్ వద్ద ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్ చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ చూడవచ్చు. ఇప్పటికే కంపెనీ ఈ కొత్త SUV యొక్క టీజర్ కూడా అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వంటివాటిని చూడవచ్చు.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

కొత్త గ్రాండ్ చెరోకీ ఇప్పటికే గ్లోబెల్ మార్కెట్లో 5 సీటర్ మరియు 7 సీటర్ మోడల్స్ లో విక్రయిస్తోంది. కాగా భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ మోడల్ కేవలం 5 సీటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే 7 సీటర్ మన దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చు.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ మరియు కో-డ్రైవర్ ముందు మరో డెడికేటెడ్ టచ్‌స్క్రీన్‌ వంటి డిస్‌ప్లేలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు పవర్డ్ టెయిల్‌గేట్‌ వంటివి లభిస్తాయి.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

అంతే కాకూండా.. ఇంటీరియర్ లో సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి, లోపలి భాగంలో ఎక్కువగా బ్రౌన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ చూడవచ్చు. ఇవన్నీ ఇంటీరియర్ ని మరింత అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ వచ్చే అవకాశం లేదు. కావున ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంజిన్ యొక్క పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడికాలేదు.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

2022 జీప్ గ్రాండ్ చెరోకీ మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇవన్నీ తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

నవంబర్ 11 న జీప్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV: వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. బుకింగ్స్ మరియు డెలివరీలను గురించి కూడా కంపెనీ అప్పుడే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV మార్కెట్లో మెర్సిడెస్ జిఎల్ఈ, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2022, 14:54 [IST]
English summary
New jeep grand cherokee to debut in india on 11th november
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+