2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

2022 జనవరి నెల కూడా ముగియనుంది. అయితే ఈ 2022 జనవరి నెలలో భారతీయ మార్కెట్లో చాలా ఆధునిక మోడల్స్ విడుదలయ్యాయి. ఇందులో బీఎండబ్ల్యూ ఎక్స్3, టాటా టియాగో CNG & టాటా టిగోర్ CNG, టాటా సఫారీ డార్క్ ఎడిషన్, స్కోడా కొడియాక్ మరియు పోర్షే కయెన్ స్పెషల్ ఎడిషన్ వంటివి విడుదలయ్యాయి. వీటిని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

బీఎండబ్ల్యూ ఎక్స్3 (BMW X3):

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారతీయ మార్కెట్లో తన ఎక్స్3 (X3) SUV నిఅధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త లగ్జరీ కార్ ప్రారంభ ధర రూ. 59.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ కొత్త X3 యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

BMW X3 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి X3 xDrive30i SportX Plus కాగా మరొకటి X3 xDrive30i M Sport. వీటి ధరలు వరుసగా రూ. 59.90 లక్షలు మరియు రూ. 65.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ కారు భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడుతోంది మరియు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

BMW X3 SUV యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందుబటులో ఉంది. ఈ ఇంజన్ 252 bhp శక్తిని మరియు 350 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ SUV కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అయితే ఇందులో డీజిల్ మోడల్‌ మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

టాటా టియాగో మరియు టిగోర్ సిఎన్‌జి (Tata Tiago & Tigor CNG):

భారతీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన టియాగో (Tiago) మరియు టిగోర్ (Tigor) యొక్క CNG మోడల్‌లను అధికారికంగా విడుదల చేసింది. Tiago మరియు Tigor యొక్క CNG వెర్షన్ యొక్క ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.09 లక్షలు మరియు రూ. 7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో CNG వేరియంట్లు 4 ట్రిమ్స్ లో అందుబటులో ఉంటాయి. అవి XE, XM, XT మరియు XT+ వేరియంట్స్. అదే సమయంలో కొత్త టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్లు 2 ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉన్నాయి. అవి XZ, మరియు XZ+ వేరియంట్స్.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

టాటా టియాగో మరియు టాటా టిగోర్ రెండూ కూడా ఒకే 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో శక్తిని పొందుతున్నాయి. అయితే, ఈ పవర్‌ట్రెయిన్‌కు CNGతో అమలు చేయడానికి కొన్ని మార్పులు చేయబడతాయి. స్టాండర్డ్ వెర్షన్ 84.82 bhp మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగా, దాని CNG వేరియంట్ ఇంజిన్ మాత్రం 72 bhp ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా తక్కువ పవర్ అందిస్తుంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

ప్రస్తుతం, టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క పెట్రోల్-ఆధారిత వెర్షన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తున్నాయి. అయితే CNG వెర్షన్‌లు కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబటులో ఉంటాయి.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

టాటా సఫారి డార్క్ ఎడిషన్ (Tata Safari Dark Edition):

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త 'టాటా సఫారి డార్క్ ఎడిషన్' (Tata Safari Dark Edition) విడుదల చేసింది. దేశీయ విఫణిలో అడుగు పెట్టిన ఈ కారు ధర రూ. 19.05 లక్షలు. ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త టాటా సఫారి డార్క్ ఎడిషన్ XT+/XTA+ మరియు XZ+/XZA+ ట్రిమ్‌లలో ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త కారు ఒబెరాన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

టాటా సఫారి డార్క్ ఎడిషన్ 18 ఇంచెస్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్ మరియు దాని ఇంటీరియర్‌లో ప్రీమియం బ్లాక్‌స్టోన్ డార్క్ థీమ్ ఇవ్వబడింది. దీనిలో డాష్‌బోర్డ్ స్పెషల్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌లో ఉంచబడింది. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉటుంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

2022 స్కోడా కొడియాక్(Skoda Kodiaq):

భారతీయ మార్కెట్లో స్కోడా (Skoda) కంపెనీ యొక్క 'స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్' (Skoda Kodiaq Facelift) ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఈ కొత్త SUV యొక్క ప్రారంభ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 37.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

కొత్త 2022 స్కోడా కొడియాక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొడియాక్ యొక్క బేస్ వేరియంట్ స్కోడా స్టైల్ ధర రూ. రూ. 34.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ అయినా స్కోడా లారెన్ & క్లెమెంట్ (Skoda Lauren & Klement) ధర రూ. 37.49 లక్షలు.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి.ఈ కారు కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

పోర్స్చే కయెన్ స్పెషల్ ఎడిషన్ (Porsche Cayenne Special Edition):

ప్రముఖ లగ్జరీ కార్ పోర్షే దేశీయ మార్కెట్లో కయెన్ మరియు కయెన్ కూపే SUV ల యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్‌ విడుదల చేసింది. ఈ కొత్త పోర్స్చే కయెన్ ప్లాటినం ఎడిషన్ ధరలు రూ. 1.47 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అదే సమయంలో పోర్షే కయెన్ ఇ-హైబ్రిడ్ కూపే ప్లాటినం ఎడిషన్ ధర రూ. 1.88 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

2022 జనవరిలో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వివరాలు

ఇది దాని స్టాండర్డ్ 3.0-లీటర్ టర్బో పెట్రోల్ వి6 ఇంజన్ 330 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇందులోని e-హైబ్రిడ్ వి6 ఇంజన్ 17.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 449 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది మొత్తానికి మంచి పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 31, 2022, 14:05 [IST]
English summary
New launched cars january 2022 tiago cng safari dark bmw x3 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+