Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త వాహనాలకు మరియు అప్డేటెడ్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేయడం కానీ, లేదా అప్డేటెడ్ వాహనాలను విడుదల చేయడం గానీ చేస్తున్నాయి. ఈ విధానంలో పుట్టుకొచ్చిన చాలా వాహనాలను గురించి ఇప్పటికే చాలా కథనాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు లెక్సస్ కంపెనీ విడుదల చేసిన అప్డేటెడ్ 'ఈఎస్ 300హెచ్' (ES 300h) గురించి తెలుసుకుందాం.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన లెక్సస్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన అప్డేటెడ్ 'ఈఎస్ 300హెచ్' (ES 300h) సెడాన్ విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ ప్రారంభ ధర రూ. 59.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్తగా ప్రారంభించబడిన ఈ హైబ్రిడ్ లగ్జరీ సెడాన్ రెండు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి ఎక్స్‌క్విజిట్ మరియు లగ్జరీ ట్రిమ్స్.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

ఈ సెడాన్ అప్డేట్ అయిన తరువాత ధరలు కూడా పెరిగాయి. కావున ఇప్పుడు బేస్ వేరియంట్ ధరలు రూ. 21,000 మరియు టాప్ వేరియంట్ అయిన లగ్జరీ ట్రిమ్ రూ. 31,000 పెరుగుదలను పొందింది. కావున ఇప్పుడు టాప్ వేరియంట్ ధరలు రూ. 65.81 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరాయి.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

నిజానికి లెక్సస్ ES 300h అక్టోబర్ 2021 లో ప్రారంభమైంది, ఆ తరువాత ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన ఒక సంవత్సర కాలానికి అప్డేట్ చేయబడింది. లెక్సస్ ES300h సెడాన్ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు టెయిల్‌గేట్‌పై కొత్త లెక్సస్ లోగో వంటి వాటిని పొందుతుంది.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

ఈ కొత్త సెడాన్ ఇప్పుడు అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో సెంటర్ కన్సోల్ చుట్టూ మెరుగైన స్టోరేజ్ స్పేస్‌, లెక్సస్ డైనమిక్ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్, హ్యాండ్స్-ఫ్రీ బూట్ మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త అప్‌గ్రేడ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ వంటివి ఇందులో అప్డేట్ చేయబడ్డాయి.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

అంతే కాకుండా ఇందులో, మునుపటి మోడల్ లో మాదిరిగానే హెడ్స్-అప్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ రిక్లైన్ రియర్ సీట్లు, హ్యాండ్స్ ఫ్రీ బూట్ లిడ్ ఓపెనింగ్ మరియు 17 స్పీకర్ మార్క్ లెవిన్‌సన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

కొత్త అప్డేటెడ్ లెక్సస్ సెడాన్ లాంచ్ సందర్భంగా.. లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నవీన్ సోనీ మాట్లాడుతూ.. మా కస్టమర్లకు కావాల్సిన సౌకర్యాలను ఎప్పటికప్పుడు అందించడానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాము. ఇందులో భాగంగానే ఆధునిక కాలంలో ఈ సెడాన్ లో అప్డేటెడ్ ఫీచర్స్ అందించడం జరిగిందని అన్నారు. ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు ఆకర్షిస్తుందన్నారు.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ.. ఇంజిన్ లో మాత్రం ఎటువంటి మార్పులు లేదు. కావున ఇందులో 2.5-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 176 బిహెచ్‌పి పవర్ మరియు 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులో 118 బిహెచ్‌పి పవర్ మరియు 202 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా కలిగి ఉంటుంది.

Lexus ES300h మరింత అందంగా మారిపోయింది.. ధరలు ఇలా ఉన్నాయి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న లెక్సస్ ES 300h సెడాన్ ఇప్పుడు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందటంతో మరింత మంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది, కావున కంపెనీ మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సెడాన్ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ ఈ క్లాస్, బిఎండబ్ల్యు 5 సిరీస్, ఆడి ఏ6 , వోల్వో ఎస్90 మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 12, 2022, 9:51 [IST]
English summary
New lexus es300h launched in india at rs 59 71 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+