కొత్త స్కార్పియో క్లాసిక్ ధరలు వెల్లడించిన మహీంద్రా - పూర్తి వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో తన 'స్కార్పియో క్లాసిక్' (Scorpio Classic) లాంఛ్ చేసింది. కంపెనీ ఈ SUV ని రెండు వేరియంట్స్ లో తీసుకువచ్చింది. అవి ఎస్ మరియు ఎస్11 వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Recommended Video
మహీంద్రా విడుదల చేసిన ఈ కొత్త అప్డేటెడ్ SUV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నిజానికి భారతీయ మార్కెట్లో ఆగష్టు 12 న మహీంద్రా యొక్క కొత్త స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించబడింది. ఆ సమయంలో కంపెనీ దీని డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ డీటైల్స్ వెల్లడించింది. అయితే నిన్న ధరలను వెల్లడించింది.

కంపెనీ ఈ కొత్త SUV ని దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా హుందాగా తాయారు చేసింది. కావున ఇది చూడగానే కస్టమర్లను ఆకర్శించే విధంగా ఉంది. ఇది ఇప్పుడు 'పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే' అనే ఐదు కలర్స్ లో అందుబాటులో ఉంది. కావున కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ విషయానికి వస్తే ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ మార్పులు కూడా గమనించవచ్చు. ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ , ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, అప్‌డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఇరువైపులా డ్యూయల్-టోన్ క్లాడింగ్ మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

పరిమాణం పరంగా కూడా కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ దాని ప్రీవియస్ మోడల్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కావున ఇది 4,456 మిమీ పొడవు, 1,820 మిమీ వెడల్పు, 1,995 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2,680 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు విశాలమైన క్యాబిన్ లభిస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.ఇంటీరియర్ 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి.

రెండవ వరుస ప్యాసింజర్ ల కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్ ఉంటుంది. 9 సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి.

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్ తో వస్తుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ స్కార్పియో క్లాసిక్‌లో రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఇవ్వబడుతుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడదు. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

2022 మహీంద్రా స్కార్పియో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ భవిష్యత్తులో కొత్త నిబంధనలకు అనుగుణంగా మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ అందించే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మహీంద్రా తన కొత్త స్కార్పియో క్లాసిక్ యొక్క ధరలను అధికారికంగా వెల్లడించింది. అయితే ఇక కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. భారతీయ మార్కెట్లో మహీంద్రా స్కార్పియో క్లాసిక్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలబడాల్సి వస్తుంది.


Click it and Unblock the Notifications








