ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ తన 2022 మారుతి బాలెనో (2022 Maruti Baleno) విడుదల చేసింది. ఈ కొత్త బాలెనో ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇందులోని టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

కొత్త మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అద్భుతమైన డిజైన్‌ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉన్నాయి. 2022 మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, డెల్టా (AMT), జీటా, జీటా (AMT), ఆల్ఫా, మరియు ఆల్ఫా (AMT) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Baleno Manual AGS
Sigma ₹6,35,000
Delta ₹7,19,000 ₹7,69,000
Zeta ₹8,09,000 ₹8,59,000
Alpha ₹8,99,000 ₹9,49,000
ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

కొత్త మారుతి సుజుకి బాలెనో సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన కూడా అందుబాటులో ఉంది, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు కేవలం నెలకు రూ. 13,999 నుండి ప్రారంభమవుతాయి. కావున కొనుగోలుదారులు దీనిని సులభంగా కొనుగోలుచేయవచ్చు.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

2022 బాలెనొ కలర్ ఆప్సన్స్:

  • నెక్సా బ్లూ
  • స్ప్లెండిడ్ సిల్వర్
  • గ్రాండియర్ గ్రే
  • లుక్స్ బీజ్ (Luxe Beige)
  • ఓపులంట్ రెడ్
  • పెర్ల్ ఆర్కిటిక్ వైట్
  • ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    కొత్త బాలెనొ మంచి డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్ పెద్దదిగా ఉంటుంది, దాని హెడ్‌లైట్లు మునుపటి కంటే పల్చగా ఉంటాయి, కావున ఇది బోల్డ్ లుక్‌ని ఇస్తుంది. దీని బంపర్‌కు కొత్త డిజైన్ కూడా ఇవ్వబడింది. కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు వెనుక వైపున ఇవ్వబడతాయి. అయితే ఇందులోని కొత్త అల్లాయ్ వీల్స్ దీని డిజైన్ మరింత మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

    ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    ఇది అప్డేటెడ్ ఇంటీరియర్ డిజైన్ కూడా పొందుతుంది. దీని క్యాబిన్‌లోని కొత్త డ్యాష్‌బోర్డ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉపయోగించబడింది. మీరు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్‌ను కూడా పొందుతారు. అంతే కాకుండా 360-డిగ్రీ కెమెరా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ భారీ 9-ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్ నాబ్ రీడిజైన్ చేయబడింది మరియు స్టీరింగ్ వీల్ డిజైర్ నుండి తీసుకోబడింది.

    ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    దీనితో పాటు, ఇది హెడ్స్ అప్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆర్క్‌మిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి కూడా ఉంటాయి.

    ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    మారుతి బాలెనో ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మరో వైపు ఇందులో 90 బిహెచ్‌పి పవర్ అందించే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

    ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మాన్యువల్‌తో 22.35 కిమీ మరియు ఆటోమాటిక్ తో 22.94 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ బరువు ఇప్పుడు 70 కిలోలు పెరిగింది, కావున బాలెనొ బరువు ఇప్పుడు 1,410 కేజీల వరకు ఉంటుంది.

    ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2022 Maruti Baleno: ధర & వివరాలు

    భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న బాలెనొ ఇప్పుడు అప్డేట్ మోడల్ గా విడుదలైంది. అయితే ఇప్పుడు ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది. ఈ 2022 బాలెనొ దేశీయ విఫణిలో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, హోండా జాజ్, మరియు అప్‌డేట్ కానున్న టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2022, 13:34 [IST]
English summary
New maruti baleno launched in india price 6 35 lakh features engine mileage details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+