2022 మారుతి బ్రెజ్జా హవా.. ఇప్పటికే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

మారుతి సుజుకి ఇటీవల దేశీయ మార్కెట్లో తన '2022 బ్రెజ్జా' (2022 Brezza) విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ ఎస్‌యువిని రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ ఎస్‌యువి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికే దాదాపు ఆశించిన స్థాయికంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

2022 మారుతి బ్రెజ్జా దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది అరుదైన రికార్డ్ బద్దలుకొట్టింది. ఇందులో బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే (జూన్ 21) 4,500 బుకింగ్స్ రాగా, అధికారికంగా విడుదలయ్యే నాటికి మొత్తం బుకింగ్స్ 45,000 యూనిట్లకి చేరాయి. తరువాత బుకింగ్స్ మరింత వేగవంతం అయ్యాయి.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

కొత్త 'మారుతి బ్రెజ్జా' బుక్ చేసుకోవాలనుకే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అదే సమయంలో ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

బుకింగ్స్ గురించి మారుతి సుజుకి డైరెక్టర్ 'శశాంక్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. ఇప్పటికే మునుపటి మారుతి బ్రెజ్జా బుకింగ్స్ 20,000 వరకు పెండింగ్ లో ఉన్నాయి. అయితే కస్టమర్లు కోరుకుంటే కొత్త 2022 బ్రెజ్జా డెలివరీ చేస్తామని తెలిపారు. అయితే కొత్త బ్రెజ్జా కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త బ్రెజ్జా దాని పాత మోడల్ కంటే కొంత ఎక్కువ ధర కలిగి ఉంది కాబట్టి. దీనిని కస్టమర్లు తప్పకుండా గమనించాలి.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

కంపెనీ తన కస్టమర్ల కోసం డెలివరీలను మరింత వేగవంతం చేయనుంది. దీని కోసం మారుతి సుజుకి సగటున నెలకు 10,000 యూనిట్లు బ్రెజ్జాలను ఉత్పత్తి చేయనుంది. అయితే కొత్త కస్టమర్‌లు బ్రెజ్జా డెలివరీ పొందటానికి కనీసం 6 నుంచి 7 నెలల వరకు తప్పకుండా వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే కంపెనీ ఈ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి తగిన సన్నాహాలు జరపాలి, లేకుంటే కస్టమర్లు కొంత ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యువి నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి LXi, VXi, ZXi మరియు ZXi+. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి. 2022 మారుతి బ్రెజ్జా దాని మునుపటి అదే గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌పై ఉంటుంది. కానీ కొత్త బాడీ ప్యానల్ మరియు కొత్త ఇంటీరియర్ పొందుతుంది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

2022 బ్రెజ్జా ముందు భాగంలో ఫ్లాట్-లుకింగ్ క్లామ్‌షెల్ బానెట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు గన్‌మెటల్ షేడ్‌లో పూర్తి చేసిన గ్రిల్‌ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో టెయిల్‌గేట్ డిజైన్ కూడా కొంత అప్డేట్ చేయబడింది. కావున హారిజాంటల్ టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది. మొత్తం మీద 2022 మారుతి బ్రెజ్జా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

మారుతి బ్రెజ్జా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఏసీ వెంట్స్, వాయిస్ కమాండ్ సపోర్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, USB టైప్-సి రియర్ ఛార్జింగ్ పోర్ట్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి వాటిని పొందుతుంది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

2022 మారుతి బ్రెజ్జాలో కొత్త 1.5-లీటర్, కె15సి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, బ్రెజ్జా మ్యాన్యువల్ వెర్షన్స్ ఒక లీటరుకు గరిష్టంగా 20.15 కిలోమీటర్ల మైలేజ్ మరియు ఆటోమేటిక్ వెర్షన్స్ లీటరుకు 19.80 కిమీ మైలేజ్ అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది.

2022 మారుతి బ్రెజ్జా హవా.. విడుదలైన నెలకే 70,000 బుకింగ్స్: ఇంకా పెరిగే ఛాన్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి యొక్క బ్రెజ్జాకి ఇంతకు ముందు నుంచే మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్స్ తో 2022 బ్రెజ్జా విడుదల చేయడం వల్ల మరింత ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలిగింది. ఈ కారణంగానే ఇంత ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. కంపెనీ రానున్న రోజుల్లో బ్రెజ్జా CNG వెర్షన్‌ ని విడుదల చేసే అవకాశం ఉంది.

Article Published On: Friday, July 29, 2022, 13:45 [IST]
English summary
New maruti brezza 70000 orders pending booking waiting period details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+