2022 వితారా బ్రెజ్జా బుకింగ్స్ ప్రారంభించిన 'మారుతి సుజుకి': పూర్తి వివరాలు
మారుతి సుజుకి (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటి. ఈ కంపనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ.. ఎప్పటికప్పుడు తన ఫోర్డ్ ఫోలియోలోని వాహనాలను అప్డేట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు కొత్త 'మారుతి సుజుకి వితారా బ్రెజ్జా' (Maruti Suzuki Vitara Brezza) ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ లాంచ్ డేట్ కూడా వెల్లడించింది. అయితే ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్ లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా యొక్క కొన్ని వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కావున దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మంచి డిజైన్ కలిగి చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జాలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు టెయిల్ సెక్షన్ ఇవ్వబడ్డాయి. మారుతి బ్రెజ్జా యొక్క ప్రస్తుత మోడల్‌లో ముందు భాగంలో క్రోమ్ గ్రిల్ ఉంది. హెడ్‌లైట్ ఇప్పుడు స్లిమ్ డిజైన్‌తో ఫ్రెష్ లుక్ ఇవ్వబడింది. ఇది డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్సన్ కూడా పొందుతుందని ఇటీవల వెల్లడైన చిత్రాల ప్రకారం తెలిసింది.

2022 మారుతి సుజుకి బ్రెజ్జా ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అందించబడ్డాయి. ముందు భాగంలో సుజుకి యొక్క పెద్ద లోగో ఫ్రంట్ గ్రిల్‌లో ఇవ్వబడింది. కార్ యొక్క టెయిల్ సెక్షన్ యారో డిజైన్‌లో ఫాగ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. వీటితో పాటు కంపెనీ ఇందులో కొత్త 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనుంది. ఇవి డ్యూయల్ టోన్ కలర్‌లో ఉన్నాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్-డిస్ప్లే, ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.

2022 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 103 బిహెచ్‌పి పవర్ మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది.

కొత్త మారుతి బ్రెజ్జా దాని మునుపటి మోడల్ లో కంటే కూడా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రెజ్జా గ్లోబల్ NCAP టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. కావున త్వరలో విడుదల కానున్న కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ గ్లోబల్ NCAP టెస్టింగ్ లో 5 స్టార్ట్ రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల 2022 మే నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఇందులో కంపెనీ మొత్తం 1,61,413 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. అమ్మకాల పరంగా మారుతి సుజుకి క్రమంగా ముందుకు సాగుతోంది.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2022 మే నెలలో, దేశీయ అమ్మకాలు ఏకంగా 1,34,222 యూనిట్లు పెరిగాయి. ఇది కంపెనీ సాధించిన గొప్ప విజయం. అదే విధంగా 2021 మే నెలలో కంపెనీ అమ్మకాలు కేవలం 35,293 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. 2021 మే నెల అమ్మకాలు తగ్గడానికి కరోనా మహమ్మారి ప్రధాన కారణంగా మారింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మారుతి సుజుకి కంపెనీ యొక్క బ్రెజ్జాకి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే కంపెనీ మరింత మంచి అమాంకాలను పొందటానికి మరియు కస్టమర్లకు అప్డేటెడ్ ఫీచర్స్ అందించడానికి ఈ 2022 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. అయితే దీనికోసం కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ధర కూడా త్వరలోనే వెల్లడవుతుంది.


Click it and Unblock the Notifications








