అమ్మకాల్లో అదరగొడుతున్న మారుతి సుజుకి సెలెరియో.. కారణం ఏంటో తెలుసా?
భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ విఫణిలో ఇప్పటికే కొత్త సెలెరియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కారు కంపెనీకి ఇప్పుడు మంచి అమ్మకాలను తీసుకురావడంలో గొప్ప పాత్రను పోషిస్తోంది. మారుతి సుజుకి సెలెరియో యొక్క అమ్మకాలు గురించి మరియు ఇది కంపెనీకి ఏ విధమైన పురోగతిని తీసుకువచ్చింది అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి మారుతి సుజుకి యొక్క పాత మోడల్ కంపెనీకి ఆశించిన స్థాయిలో అమ్మకాలను తీసుకురాలేకపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని అప్డేట్ చేయడం జరిగింది. కంపెనీ అప్డేట్ చేసిన తరువాత అమ్మకాల్లో మంచి జోరు అందుకుంది. కంపెనీ యొక్క ఈ అప్డేటెడ్ సెలెరియో 2022 జూన్ నెలలో ఏకంగా 8,683 యూనిట్ల అమ్మకాలను పొందింది. అయితే 2021 జూన్ నెలలో సెలెరియో అమ్మకాలు కేవలం 752 యూనిట్లు మాత్రమే. దీనిని బట్టి చూస్తే కంపెనీ యొక్క అప్డేటెడ్ మోడల్ ఏ విధమైన అమ్మకాలను సాధిస్తోందో స్పష్టంగా అర్థమవుతోంది.

సెలెరియో 2021 జూన్ అమ్మకాల కంటే 2022 జూన్ అమ్మకాలు 1,055 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప పురోగతి అనే చెప్పాలి. సెలెరియో కంపెనీ యొక్క హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.25 లక్షలు (ఎక్స్-షోరూమ్).

అప్డేటెడ్ మారుతి సెలెరియో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. ఇది ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కొత్త ఫాగ్ లైట్స్ పొందుతుంది. ఇంటీరియర్స్‌లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కాల్ మరియు మ్యూజిక్ అసిస్ట్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సర్క్యులర్ డిజిటల్ స్క్రీన్ ఉన్నాయి. హెడ్ లైట్ డిజైన్ మునుపటికంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. అంతే కాకుండా బాడీ డిజైన్ కూడా అనేక అప్డేట్స్ పొందుతుంది. కావున ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త సెలెరియోలో 15 ఇంచెస్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు ORVMలలో టర్న్ ఇండికేటర్ వంటి వాటిని పొందుతుంది.

మారుతి సెలెరియోలో 1.0-లీటర్ K10C సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్ మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది. కొత్త సెలెరియో 26.68 kmpl మైలేజీని అందించగలదని మారుతి సుజుకి పేర్కొంది.

కొత్త మారుతి సెలెరియో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్టివిటీతో స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక కొత్త మరియు అప్‌డేట్ చేయబడిన ఫీచర్లను పొందుతుంది. ఇది కాకుండా, ఈ కారులో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో పాటు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు, ఇప్పుడు కొత్త సెలెరియోలో డోర్ రిక్వెస్ట్ స్విచ్ కూడా అందుకుంటుంది. కొత్త మారుతి సెలెరియోలో బూట్ స్పేస్ ఇప్పుడు 313 లీటర్లకు పెరిగింది.

కొత్త మారుతి సెలెరియో యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రియర్ డోర్ వద్ద వద్ద చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

కొత్త తరం మారుతి సెలెరియో ప్రస్తుతం మంచి పనితీరుని అందించడమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, కొత్త మారుతి సెలెరియో మెరుగైన మైలేజ్ కారణంగా వినియోగదారుల దృష్టిని తప్పకుండా ఆకర్షించగలదు. మారుతి సుజుకి అనేక మైలేజ్ CNG కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త డిజైన్ మరియు మెరుగైన మైలేజీ కారణంగా, కస్టమర్లు సెలెరియోను కొనుగోలు చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి మంచి అమ్మకాలను పొందుతుంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు తమ వాహనాలను అప్డేట్ చేయడమే. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సెలెరియో టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.


Click it and Unblock the Notifications








