భారత విఫణిలో విడుదలైన Maruti Suzuki WagonR: ధర & పూర్తి వివరాలు
మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ భారతీయ మార్కెట్లో తన కొత్త 2022 వ్యాగన్ఆర్ (WagonR) హ్యాచ్‌బ్యాక్ విడుదల చేసింది. 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్' (Maruti Suzuki WagonR) బేస్ వేరియంట్ అయిన 'ఎల్‌ఎక్స్‌ఐ' ధర రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇందులోని టాప్-ఎండ్ మోడల్ 'జెడ్‌ఎక్స్‌ఐ+' వేరియంట్ ధర రూ. 7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్' (Maruti Suzuki WagonR) ఇప్పుడు మరింత అద్భుతమైన మరియు సమర్థవంతమైన 1.0-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను పొందుతుంది. అంతే కాకూండా ఇందులోని CNG అనేక రకాల వేరియంట్‌లలో అందించబడుతుంది, ఆటోమేటిక్స్ అదనపు భద్రతా ఫీచర్‌లను కూడా పొందుతాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ లో వస్తుంది, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి బాలెనో వలె, ఈ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కూడా 2022 అప్డేటెడ్ మోడల్.

ఈ కొత్త 2022 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దాదాపుగా బాహ్య కొలతల పరంగా మునుపటి వెర్షన్‌తో సమానంగా ఉంటుంది. కావున దీని పొడవు 3655 మి.మీ, వెడల్పు 1620 మి.మీ, ఎత్తు 1675 మిమీ మరియు వీల్‌బేస్ 2435 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2022 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 1.0 లీటర్ ధరలు:
- ఎల్ఎక్స్ఐ రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- ఎల్ఎక్స్ఐ టూర్ H3 రూ. 5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- ఎల్ఎక్స్ఐ ఎస్-CNG రూ. 6.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- ఎల్ఎక్స్ఐ ఎస్-CNG TourH3 రూ. 6.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- విఎక్స్ఐ రూ. 5.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- విఎక్స్ఐ ఏజిఎస్ రూ. 6.36 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- విఎక్స్ఐ ఎస్-CNG రూ. 6.81 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ MT రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ AGS రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ+ MT రూ. 6.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ+ AGS రూ. 6.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ+ MT డ్యూయల్ టోన్ (ఆప్సనల్) రూ. 6.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
- జెడ్ఎక్స్ఐ+ AGS డ్యూయల్ టోన్ (ఆప్సనల్) రూ. 7.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)

2022 మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ 1.2 లీటర్ ధరలు:

2022 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. అవి గాలంట్ రెడ్ మరియు మాగ్మా గ్రే. అంతే కాకూండా ఇది బ్లాక్-అవుట్ రూఫ్, ORVMలు మరియు పిల్లర్‌లను పొందుతుంది. ఇందులో డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్ కూడా ఉంటుంది. కొత్త మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 7-ఇంచెస్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 4-స్పీకర్లు మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి వాటిని పొందుతాయి.

2022 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు వేర్వేరు ఇంజన్లతో కాన్ఫిగర్ చేయబడవచ్చు, రెండూ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT మరియు ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. బేస్ ఇంజన్ 66.6 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.0-లీటర్ కె10సి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా విఎక్స్ఐ వేరియంట్ AMT గేర్‌బాక్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇందులోని 1.0-లీటర్ ఇంజన్‌ని ఎల్ఎక్స్ఐ మరియు విఎక్స్ఐ ట్రిమ్ లెవెల్స్ లో అమర్చిన CNG కిట్‌తో రావచ్చు.

ఇక ఇందులోని 1.2-లీటర్ కె12ఎన్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 79.86 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ+ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇవి రెండూ కూడా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారతదేశపు అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ 1999 లో వ్యాగన్ఆర్ అమ్మకాలను తిరిగి ప్రారంభించింది. అయితే ప్రస్తుతం భారతీయ మార్కెట్లో విడుదలైన వ్యాగన్ఆర్ దాని మునుపటి మోడల్ కంటే చాలా అప్డేటెడ్ గా ఉంటుంది.
మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ ని భారతీయ మార్కెట్లో విడుదల చేసిన రోజు నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీ మరిన్ని అప్డేట్స్ తో తీసుకురావడం వల్ల మరిన్ని అమ్మకాలతో ముందుకు సాగుతుందని తప్పకుండా ఆశిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








