Maruti నుంచి రానున్న కొత్త WagonR Facelift.. TVC షూటింగ్
మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క కొత్త కొత్త 'మారుతి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్' (Maruti WagonR Facelift) త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో విడుదల కాకముందే TVC షూట్ సమయంలో కనిపించింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. త్వరలో రానున్న ఈ కొత్త మోడల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

TVC షూట్ సమయంలో గుర్తించబడిన మారుతి 'వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్' చాలా వరకు కొత్త అప్డేట్స్ అందుకుంది. దీని డిజైన్ లో చాలా వరకు మార్పులను గుర్తించవచ్చు. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ యొక్క ముందు భాగంలో కొత్త మరియు చిన్న గ్రిల్ డిజైన్, కొత్త ఫాగ్ లైట్లు, అదేవిధంగా కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనిని చాలా ఆకర్షణీయంగా చేస్తాయి.

మారుతి వ్యాగన్ఆర్ 2019 లో దేశీయ మార్కెట్లో ప్రారంభించినప్పటి నుంచి కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ ఏమి పొందలేదు. అయితే ఇప్పుడు రానున్న కొత్త మారుతి వ్యాగన్ఆర్ మాత్రం ఆశించిన అప్డేట్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇందులోని బంపర్‌లో కూడా అప్డేట్స్ జరిగాయి. అంతే కూండా ఇది కొత్త-తరం మారుతి సెలెరియో వంటి టాప్-వేరియంట్‌ల నుండి 15-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఇది కొత్త అపోల్స్ట్రే వంటి వాటిని కూడా పొందుతుంది. కానీ ఇందులోని డ్యాష్‌బోర్డ్‌లో ఎటువంటి మార్పులు జరగలేదు.

కొత్త మారుతి వ్యాగన్ఆర్ AMT వేరియంట్‌లతో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ఇంజన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్‌ను అదనపు ఫీచర్లుగా పొందే అవకాశం ఉంది. వ్యాగన్-ఆర్ 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ మరియు పవర్-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి వాటిని పొందుతుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ మరియు సెక్యూరిటీ అలారం వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఈ కొత్త వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందినప్పటికీ, కంపెనీ దీని పరిమాణంలో ఎటువంటి మార్పును చేయలేదు. కావున ఏది పరిమాణం పరంగా మునుపటి మాదిరిగానే ఉంటుంది. అంతే కాకూండా ఇందులోని పవర్‌ట్రైన్ విభాగంలో కూడా ఎటువంటి మార్పులు లేదని తెలుస్తుంది.

2022 వ్యాగన్-ఆర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం 1-లీటర్ మరియు 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ తో విక్రయించబడుతోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోడల్ యొక్క బేస్ స్పెక్ అయిన ఎల్ఎక్స్ఐ మోడల్ CNG ఇంజిన్ ఆప్సన్ కూడా పొందుతుంది.

వ్యాగన్-ఆర్ అనేది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటిగా ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఫేస్‌లిఫ్ట్ విడుదలతో మరింతమంది కొత్త కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదలైతే తప్పకుండా అమ్మకాలు మెరుగుపడే ఆవకాశం ఉంటుంది.

కొత్త మారుతి వ్యాగన్ఆర్ త్వరలో భారత మార్కెట్లో విడుదలవుతుంది, కావున త్వరలోనే బూకిగ్స్ కూడా ప్రారంభిచబడే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ కొత్త పేస్ లిఫ్ట్ యొక్క ధర వాటి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి. అయితే ఇది దేశీయ మార్కెట్లో ఎలాటి ఆదరణ పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.
Image Courtesy: Mantram 𝕊 𝕊𝕙𝕖𝕥𝕥𝕪


Click it and Unblock the Notifications