మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes-Benz) దేశీయ మార్కెట్లో త్వరలో 'సి-క్లాస్' లగ్జరీ కారుని విడుదల చేయనుంది. అయితే కంపెనీ అంతకంటే ముందు ఇప్పుడు ఈ సెడాన్ యొక్క ప్రొడక్షన్ ప్రారభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

నివేదికల ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) సి-క్లాస్ సెడాన్ ఉత్పత్తిని పూణే ప్లాంట్ లో ప్రారంభించబడింది. కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు ఈ సెడాన్ కోసం ముందుగా రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది 2022 మే 10 న దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త సి-క్లాస్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. అవి సి200, సి220డి మరియు సి300డి వేరియంట్స్. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త తరం సి-క్లాస్ సెడాన్‌లో అధునాతన టెక్నాలజీ కూడా ఉపయోగించబడింది. కావున ఇందులోని ఇంటీరియర్ మొత్తం చాలా వరకు కొత్త పద్ధతిలో డిజైన్ చేయబడింది. సి-క్లాస్ సెడాన్‌ దాని ఎస్-క్లాస్ సెడాన్‌ను పోలి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ అద్భుతమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. ఇందులో 12.3-ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లేతో స్ప్లిట్ డిస్‌ప్లే సిస్టమ్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన 11.9-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌లో టచ్-కెపాసిటివ్ స్విచ్‌లు, సీమ్‌లెస్ సెంటర్ కన్సోల్‌లు, కొత్త ఎయిర్-కాన్వెంట్‌లు, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

త్వరలో విడుదల కానున్న సి-క్లాస్ సెడాన్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్లన్నీ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. భారతీయ మార్కెట్లో, కంపెనీ కొత్త సెడాన్‌ను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో మాత్రమే అందుబాటులో ఉంచుతుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

మొదటిగా సి200 మోడల్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 201.5 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా సి200డి మోడల్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ యూనిట్‌ను పొందుతుంది. ఇది 198 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇక చివరగా సి300డి మోడల్ అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 262 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,793 మిమీ, వెడల్పు 2,033 మిమీ, ఎత్తు 1,446 మిమీ మరియు వీల్‌బేస్ 2,865 మిమీ వరకు ఉంటుంది. కొలతల పరంగా కొత్త సి-క్లాస్ దాని మునుపటి మోడల్ కంటే కూడా 65 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు మరియు వీల్‌బేస్ 25 మిమీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దీని బూట్ స్పేస్ కూడా దాదాపు 30 లీటర్లు పెరిగింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో అత్యధికంగా విక్రయించబడుతున్న లగ్జరీ కార్లలో మెర్సిడెస్ సి-క్లాస్ కూడా ఒకటిగా ఉంది. ఇది 2001 లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ ఇప్పటికి 37,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ సెడాన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. కావున కొత్త విడుదల కానున్న కొత్త అప్డేటెడ్ మోడల్ కూడా మరింత మంచి అమ్మకాలకు దోహదపడే అవకాశం ఉంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

కొత్తగా విడుదలకానున్న కొత్త తరం సి-క్లాస్ సెడాన్ కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, అప్‌డేటెడ్ బానెట్ మరియు రివైజ్డ్ లైట్ క్లస్టర్‌లతో చాలా ఆధునికంగా తయారవుతుంది. అంతే కాకుండా దీని ముందు మరియు వెనుక భాగంలో కూడా చిన్న ఓవర్‌హాంగ్‌లను పొందుతుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త సెడాన్ ని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రొడక్షన్ స్టార్ట్ - ఇక లాంచ్ ఎప్పుడంటే?

సి-క్లాస్ సెడాన్ లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. భారతీయ మార్కెట్లో కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ విడుదలైన తరువాత బిఎండబ్ల్యు 3 సిరీస్, ఆడి ఏ4, జాగ్వార్ ఎక్స్ఈ మరియు వోల్వో ఎస్60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Article Published On: Thursday, April 28, 2022, 14:39 [IST]
English summary
New mercedes benz c class production starts launch soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+