ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

స్కోడా (Skoda) కంపెనీ ఇటీవల కాలంలోనే భారతీయ మార్కెట్లో కొత్త 'కొడియాక్ ఫేస్‌లిఫ్ట్' (Kodiaq Facelift) SUV ని విడుదల చేసింది. అయితే ఈ SUV విడుదలైన అతి తక్కువ కాలంలోనే దాని ధరను ఏకంగా ఇప్పుడు రూ. 1 లక్ష పెంచింది. పెరిగిన ఈ ధర ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే అంతకు ముందు 'స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్' ప్రారంభ ధరకే అందుబాటులో ఉంటుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇవి స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు లారిన్ & క్లెమెంట్ వేరియంట్స్. ఇందులోని బేస్ వేరియంట్ అయిన స్టైల్ వేరియంట్ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు రూ. 1 లక్ష పెరిగింది కావున దీని ధర ఏప్రిల్ 2022 నుంచి రూ. 35.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

అదే సమయంలో ఇందులోని మిడ్-స్పెక్ వేరియంట్ అయిన స్పోర్ట్‌లైన్ ధర రూ. 35.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, రూ. 1 లక్ష పెరుగుదల తరువాత దీని ధర రూ. 36.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంటుంది. ఇక టాప్-స్పెక్ వేరియంట్ అయిన లారిన్ & క్లెమెంట్ వేరియంట్ విషయానికి వస్తే, దీని ధర రూ. 37.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ధర పెరిగిన తరువాత రూ. 38.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ప్రకారం, స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క మొదటి బ్యాచ్ విడుదలైన కేవలం 24 గంటల్లోపే అమ్ముడైందని, దాని వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఐదు నెలల వరకు ఉంది. అయితే కంపెనీ నెలకు 100 యూనిట్లను డెలివరీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన పరిధిని 140 నగరాలకు విస్తరించబోతోంది, ప్రస్తుతం కంపెనీ 117 నగరాల్లో ఉంది. ఇది దాని టచ్‌పాయింట్‌ను ఇప్పుడు 175 నుండి 225 కి పెంచబోతోంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?
Kodiaq Price (Upto March) New Price (Effective From April) Difference
Style ₹34.99 Lakh ₹35.99 Lakh +₹1 Lakh
Sportline ₹35.99 Lakh ₹36.99 Lakh +₹1 Lakh
Laurin & Klement ₹37.49 Lakh ₹38.49 Lakh +₹1 Lakh
ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ కారు కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

స్కోడా కంపెనీ యొక్క కొత్త స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు నిటారుగా ఉన్న గ్రిల్, ఎలివేటెడ్ బానెట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, రివైజ్ చేయబడిన హెడ్‌లైట్లు మరియు ట్వీక్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

అంతే కాకుండా.. ఇందులో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది. దీనితో పాటు వెనుకవైపు టెయిల్‌లైట్‌లు మరియు బంపర్ కొద్దిగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ SUV ని చాలా అద్బుతమగా కనిపించే విధంగా చేస్తాయి. అయితే ఈ అప్డేట్స్ కాకుండా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

2022 స్కోడా కొడియాక్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. అంతే కాకూండా స్కోడా యొక్క కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇందులో కూడా ఉంది. ఇందులో మూడు వరుసల సీటింగ్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

స్కోడా కొడియాక్ SUV యొక్క టాప్-స్పెక్ ట్రిమ్‌లో అప్‌డేట్ చేయబడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివాటిని పొందుతుంది.

ఏకంగా రూ. 1 లక్ష పెరిగిన 'Skoda Kodiaq Facelift' ధరలు: ఇక అప్పటినుంచే అమలు?

కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇక కొత్త స్కోడా కొడియాక్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మి.మీ వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 3, 2022, 17:16 [IST]
English summary
New skoda kodiaq facelift price hiked by rs 1 lakh details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+