2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా (Skoda) ఇటీవల కాలంలోనే దేశీయ విఫణిలో కొత్త కొడియాక్ (Kodiaq) SUV ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ SUV మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ కారణంగానే బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో పొందగలిగింది. కంపెనీ ఈ SUV ని జనవరి 10 న మార్కెట్లో విడుదల చేసింది. అయితే కేవలం 20 రోజుల్లోనే దాదాపు అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. ఈ సమాచారాన్ని కంపెనీ డైరెక్టర్ జాక్ హోలిస్ ట్విట్టర్ పోస్ట్‌లో అధికారికంగా తెలిపారు.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, స్కోడా తన కొడియాక్ SUV ని ఇప్పటికి 1,200 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 37.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా భారతదేశానికి తీసుకువస్తున్నారు. కొత్త కొడియాక్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో అమ్మకానికి ఉంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇవి స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు లారిన్ & క్లెమెంట్ వేరియంట్స్. కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ 7-సీటర్ SUV ఇప్పుడు అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకూండా అప్డేటెడ్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్ కూడా పొందుతుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

భారతీయ మార్కెట్లో బిఎస్ 6 ప్రమాణాల అమలు తరువాత దీనిని నిలిపివేయడం జరిగింది. అయితే, ఇప్పుడు కంపెనీ బిఎస్-6 ఇంజిన్‌లో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది.

2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ కారు కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

స్కోడా కంపెనీ యొక్క కొత్త స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు వర్టికల్ గ్రిల్, ఎలివేటెడ్ బానెట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, రివైజ్ చేయబడిన హెడ్‌లైట్లు మరియు ట్వీక్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

ఈ కొత్త SUV వెనుకవైపు టెయిల్‌లైట్‌లు మరియు బంపర్ కొద్దిగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ SUV ని చాలా అద్బుతమగా కనిపించే విధంగా చేస్తాయి. అయితే ఈ అప్డేట్స్ కాకుండా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

2022 స్కోడా కొడియాక్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. అంతే కాకూండా స్కోడా యొక్క కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇందులో కూడా ఉంది. ఇందులో మూడు వరుసల సీటింగ్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

స్కోడా కొడియాక్ SUV యొక్క టాప్-స్పెక్ ట్రిమ్‌లో అప్‌డేట్ చేయబడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివాటిని పొందుతుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇక కొత్త స్కోడా కొడియాక్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మి.మీ వరకు ఉంటుంది.

2022 Skoda Kodiaq కావాలంటే వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే.. ఎందుకంటే?

ఇదిలా ఉంటే కంపెనీ ఈ కొత్త SUV ధరను ఇప్పుడు ఏకంగా రూ. 1 లక్ష పెంచినట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల తరువాత స్టైల్ వేరియంట్ ధర రూ. 35.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్పోర్ట్‌లైన్ ధర రూ. 36.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్). లారిన్ & క్లెమెంట్ వేరియంట్ విషయానికి వస్తే, దీని ధర రూ. 38.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఈ ధరలు ఏప్రిల్ 2022 నుంచి అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 4, 2022, 14:52 [IST]
English summary
New skoda kodiaq sold completely for 2022 details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+