Just In
- 48 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 2 hrs ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 4 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి (Tiago NRG XT) వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న టియాగో ఎన్ఆర్‌జి (Tiago NRG) లో ఇప్పుడు ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి (Tata Tiago NRG XT) పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ధర రూ. 6.42 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా ఉంది. ఈ కొత్త వేరియంట్ రాకతో టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఇప్పుడు రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి: టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి (Tiago NRG XT) మరియు టియాగో ఎన్ఆర్‌జి ఎక్స్‌జెడ్ (Tiago NRG XZ).

ఈ ప్రత్యేకమైన టియాగో ఎన్‌ఆర్‌జి మోడల్ అమ్మకాలు, టియాగో పెట్రోల్ మోడల్ అమ్మకాలలో 15 శాతం వరకూ ఉంటున్నాయి. ఈ అమ్మకాల గణాంకాలను చూస్తుంటే, కస్టమర్లు ఈ మోడల్ ను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది. టియాగో ఎన్‌ఆర్‌జి వేరియంట్ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో ఓ సరసమైన వేరియంట్ ను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ను విడుదల చేసింది. స్టాండర్డ్ టియాగోతో పోల్చుకుంటే, ఈ కొత్త వేరియంట్ మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి (Tiago NRG XT) వేరియంట్ లో కొత్త 14 ఇంచ్ హైపర్‌స్టైల్ వీల్స్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్, 3.5 ఇంచ్ హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్స్ తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ మరియు మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు క్రాష్ సెన్సార్‌లు మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్తగా వచ్చిన టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ను ఈ లైనప్ లో XZ మరియు XZA AMT వేరియంట్‌ల దిగువ అందించబడుతుంది మరియు ఈ కారుకు క్రాస్ఓవర్ రూపాన్ని అందించడానికి దీని చుట్టూ ఆల్-రౌండ్ బ్లాక్ క్లాడింగ్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ టాటా టియాగో ఎక్స్‌టితో పోలిస్తే, టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ 10 మిమీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్ లతో కూడిన బ్లాక్డ్ అవుట్ రూఫ్, చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ డీఫాగర్, రియర్ వాషర్ మరియు వైపర్‌లు మొదలైన అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఈ కొత్త వేరియంట్ లో ఎలాంటి మార్పులు లేవు. ఇది స్టాండర్డ్ టియాగోలో లభిస్తున్న అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇందులోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

టాటా మోటార్స్ 2016లో తమ టియాగో లైనప్ లో NRG మోడల్‌ను పరిచయం చేసింది. కంపెనీ కస్టమర్‌లను ఆకర్షించడానికి మరియు మరింత యూత్‌ఫుల్‌గా మరియు రగ్గడ్‌గా కనిపించే టియాగో కారును కోరుకునే వారి కోసం టాటా మోటార్స్ ఈ ఎన్‌ఆర్‌జి ఎడిషన్ రగ్గడ్ స్టైలింగ్‌తో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఎన్ఆర్‌జి లైనప్ ను విస్తరిస్తూ, కొత్తగా పరిచయం చేయబడిన XT వేరియంట్ కస్టమర్లకు ధరకు తగిన విలువ ప్రతిపాదనను అందిస్తుంది.

టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్ బ్లాక్-అవుట్ రూఫ్ రైల్స్, బాడీ చుట్టూ బ్లాక్ క్లాడింగ్, మజిక్యులర్ బానెట్, సొగసైన ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ హెడ్‌లైట్‌లు మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లతో కఠినమైన రూపాన్ని కలిగి ఉంటుంది. కారు వెనుక వైపు ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్‌లు, బూట్ లిడ్ పై నలుపు రంగు క్లాడింగ్, విండో వైపర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వండి డిజైన్ ఎలిమెంట్స్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మార్కెట్లో టాటా టియాగో ఎన్ఆర్‌జి యొక్క ఎంట్రీ-లెవల్ XT వేరియంట్ ధర రూ. 6.42 లక్షలు కాగా, ఇందులో రేంజ్-టాపింగ్ XZA AMT వేరియంట్ ధర 7.38 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ఈ సందర్భంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, సేల్స్, మార్కెటింగ్ మరియు కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా మాట్లాడుతూ.. ఆకర్షణీయమైన ధరతో, ఈ వేరియంట్ చక్కగా ప్యాక్ చేశామని, ఉత్తమమైన డ్రైవింగ్ అనుభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కొత్త వేరియంట్ ను తీర్చిదిద్దామని చెప్పారు. టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ రిచ్‌గా ఉంటుందని, ఈ కొత్త వేరియంట్ NRG మరియు మొత్తం Tiago పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుందని, తద్వారా దాని అమ్మకాల పనితీరును ముందుకు నడిపిస్తుందని తాము విశ్వసిస్తున్నామని అన్నారు.