టయోటా నుంచి 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) వచ్చేసింది: ఫీచర్స్ & మైలేజ్ ఇలా ఉన్నాయి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'ఇన్నోవా హైక్రాస్' ను టయోటా కంపెనీ ఎట్టకేలకు అధికారికంగా భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. కాగా ధరలు 2023 జనవరి నాటికి వెల్లడవుతాయి, విక్రయాలు కూడా ఆ సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

టయోటా కంపెనీ ఆవిష్కరించిన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' (Innova Hycross) ఇటీవల జెనిక్స్ పేరుతో ఇండోనేషియన్ మార్కెట్లో కూడా ఆవిష్కరించబడింది. ఈ MPV కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడి ఉంటుంది. కావున ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కొత్త హైక్రాస్ MPV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) వచ్చేసింది

నిజానికి టయోటా ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా కొత్త మోడల్, ఇది మోనోకోక్ నిర్మాణంపై ఆధారపడిన మొదటి ఇన్నోవా కూడా. ఇది చూడటానికి దాదాపు ఇటీవల ఇండోనేషియా మార్కెట్లో అడుగుపెట్టిన 'ఇన్నోవా జెనిక్స్' మాదిరిగా ఉంటుంది. కాగా హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో పొందుతుంది. ఇది క్రోమ్ తో ఫినిష్ అయి ఉంటుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్‌ మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.

టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) వచ్చేసింది

ఇంటీరిర్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. కావున ఇది ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో ఇందులో ఉన్న సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది.

టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) వచ్చేసింది

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో పెట్రోల్ లేదా పెట్రోల్ హైబ్రిడ్ ఆప్సన్స్ ఉంటాయి. కానీ ఇది డీజిల్ ఇంజిన్ పొందే అవకాశం లేదు. కావున ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 172 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్‌ 150 బిహెచ్‌పి మరియు 187 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది.

అయితే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 111 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, పీక్ సిస్టమ్ పవర్ అవుట్‌పుట్ 184 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంది. కావున డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టయోటా హైక్రాస్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ కొత్త MPV ఒక ఫుల్ ట్యాంక్ తో ఏకంగా 1097 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది మార్కెట్లో మహీంద్రా XUV700 మరియు టాటా సఫారి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 25, 2022, 13:01 [IST]
English summary
New toyota innova hycross debuts in india deliveries in january
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+