Just In
- 17 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 2 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- News
vastu tips: భార్యాభర్తల ప్రేమ బలపడాలంటే బెడ్ రూమ్ లో మీరు చెయ్యాల్సింది ఇదే!!
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
తప్పకుండా చూడాల్సిన కొత్త టయోటా హైక్రాస్ TVC.. ఓ లుక్కేసుకోండి
టయోటా కంపెనీ ఇటీవలే దేశీయ మార్కెట్లో కొత్త 'ఇన్నోవా హైక్రాస్' ఎమ్‌పివి ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ ఎమ్‌పివిని అధికారికంగా భారతదేశంలో విడుదల చేయకముందే TVC (టెలివిజన్ కమర్షియల్) విడుదల్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కంపెనీ విడుదల చేసిన ఈ TVC లో హైక్రాస్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ వంటి వాటిని చూడవచ్చు. దీనిని బట్టి చూస్తే కొత్త 'హైక్రాస్' ఇన్నోవా కంటే కూడా చాలా అధునాతనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులోని సీటింగ్ మరియు పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ వంటివి కూడా చూడవచ్చు. మొత్తంమీద ఈ MPV చూడగానే ఆకర్శించే విధంగా ఉందని వీడియో చూస్తే తప్పకుండా మీకే అర్థమవుతుంది.

టయోటా కంపెనీ ఆవిష్కరించిన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ధరలు మరియు డెలివరీలు 2023 జనవరి నాటికి వెల్లడవుతాయి. ఈ MPV కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడి ఉంటుంది. కావున ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. టయోటా కంపెనీ ఆవిష్కరించిన కొత్త 'ఇన్నోవా హైక్రాస్' ఇటీవల 'జెనిక్స్' పేరుతో ఇండోనేషియన్ మార్కెట్లో కూడా ఆవిష్కరించబడింది.
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన టయోటా ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా కొత్త మోడల్, ఇది మోనోకోక్ నిర్మాణంపై ఆధారపడిన మొదటి MPV. హైక్రాస్ హెక్సా గోనల్ గ్రిల్ కలిగి దాని మధ్యలో బ్రాండ్ లోగో పొందుతుంది. ఇది క్రోమ్ ఫినిష్ పొందటం వల్ల చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడా ఉన్నాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
అంతే కాకుండా.. ఇందులో మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ వేరియంట్స్ అన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ సివిటి గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్న రెగ్యులర్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 172 బిహెచ్‌పి మరియు 197 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇందులోని 2.0-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి మరియు 187 బిహెచ్‌పి అందిస్తుంది. ఇది 9.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు 'ఏడిఏఎస్' (ADAS) టెక్నాలజీ అందుబాటులో ఉంది. కావున డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.