Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

ప్రముఖ జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) భారతదేశంలో తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (Volkswagen Tiguan) ను రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర వద్ద విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే డెలివరీలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం ఇప్పటికే 2022 మొదటి త్రైమాసికానికి కావాల్సిన అన్ని యూనిట్లు విక్రయించబడిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త మోడల్ కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ డెలివరీలు ప్రారంభమైన సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ బ్రాండ్ డైరెక్టర్ 'ఆశిష్ గుప్తా' మాట్లాడుతూ.. కంపెనీ ఈ కొత్త మోడల్ ఐ ప్రవేశపెట్టిన కేవలం ఒక నెల కాలంలోనే మంచి ఆదరణ పొడగలిగింది, అయితే ఇప్పుడు కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభమయ్యిందని ఆయన అన్నారు.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ దేశవ్యాప్తంగా 150 సేల్స్ టచ్ పాయింట్‌లను కలిగి ఉంది. ఈ కొత్త మోడల్ యొక్క టెస్ట్ డ్రైవ్ డిసెంబర్ 10 నుండి ప్రారంభించబడింది. దీనితో పాటు రూ.31,499 ధరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మొత్తం 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో నైట్‌షేడ్ బ్లూ, ప్యూర్ వైట్, డీప్ బ్లాక్, ఓరెక్స్ వైట్, డాల్ఫిన్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కింగ్స్ రెడ్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటు అప్‌డేట్ చేయబడిన బంపర్ హౌసింగ్ మరియు త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్‌లతో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది. ఈ కొత్త కారు యొక్క ముందు మరియు వెనుక భాగంలో LED లైటింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

ఇక దీని సైడ్ ప్రొఫైల్ భాగంలో షార్ప్ లైన్స్ ఉంటాయి. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇందులో అవసరమైనంత బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. కావున కావాల్సిన లగేజ్ తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త టిగువాన్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో వర్చువల్ కాక్‌పిట్, లెదర్ సీట్లు, 30 షేడ్స్ ఆఫ్ యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ గేర్ నాబ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

అంతే కాకుండా మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్-సైడ్ ఎలక్ట్రిక్ సీట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందించబడ్డాయి. వీటితోపాటు ఇందులో కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఇందులో ఇవ్వబడింది. దీని సహాయంతో డ్రైవర్ కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందుతాడు. దీంతో పాటు జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను కూడా ఇందులో ఇచ్చారు.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది TSI టెక్నాలజీ 2.0 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 7 స్పీడ్ DSG గేర్‌బాక్స్ మరియు 4MOTION టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ కెమెరా మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

Tiguan డెలివరీలు షురూ చేసిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ (Volkswagen Tiguan) భారతీయ మార్కెట్లో రాబోయే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ (Jeep Compass Facelift), హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson) మరియు సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ (Citroen C5 Aircross) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 24, 2022, 15:32 [IST]
English summary
New volkswagen tiguan delivery starts today details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+