వర్టస్ (Virtus) ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కంపెనీ నుంచి కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' (Volkswagen Virtus) త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలకానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సెడాన్ ఇటీవల కాలంలోనే ఆవిష్కరించబడింది. అయితే కంపెనీ ఇప్పుడు తన చకాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి కూడా షురూ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' కంపెనీ యొక్క ఫోక్స్‌వ్యాగన్ వెంటో స్థానంలో రానుంది. ఇప్పటికే కంపెనీ 'స్కోడా ర్యాపిడ్' స్థానంలో సరికొత్త 'స్కోడా స్లావియా' ను తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అవి డైనమిక్ లైన్ మరియు జిటి లైన్ వేరియంట్స్. కంపెనీ వీటిని MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనుంది. ఇది కంపెనీ యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద విడుదలకానున్న నాల్గవ మోడల్. కావున ఇందులోని ఫీచర్లు మరియు పరికరాలు స్కోడా స్లావియా నుండి ప్రేరణ పొందాయి.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కంపెనీ దీనిని మొత్తం 6 కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) యొక్క ముందు భాగంలో డ్యూయల్-స్లాట్ గ్రిల్‌తో పాటు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో రెండు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకూండా దీని ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు హాలోజన్ హెడ్‌లైట్లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

సైడ్ ప్రొఫైల్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటాయి. ఇది షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ORVM వంటివి ఉన్నాయి. దీని వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా ఇవ్వబడ్డాయి. మొత్తం మీద వెనుక భాగం నుంచి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్' మోడల్ 10-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ వంటి వాటిని పొందుతుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ 'ఆశిష్ గుప్తా' దీని గురించి మాట్లాడుతూ.. కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అనేది ప్రీమియమ్ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో తీసుకురానున్న ప్రత్యేకమైన కారు. వరల్డ్ ప్రీమియర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన మా విశ్వాసాన్ని మరింత పెంచింది. కావున దీనిని త్వరలో తీసువస్తున్నట్లు తెలిపారు.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

వోక్స్‌వ్యాగన్ వర్టస్ భారతీయ కస్టమర్ల కోసం తీసుకువస్తున్న కొత్త మోడల్. ఇది భారతీయ మార్కెట్లో తప్పకుండా మంచి విజయాన్ని పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి ఫీచర్స్ కలిగి వాహన విఐయోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) యొక్క ఫ్రంట్ ఫెండర్‌లపై 'GT' బ్యాడ్జ్ ఇవ్వబడ్డాయి. ఇక దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,482 మిమీ, వెడల్పు 1751 మిమీ మరియు ఎత్తు 1472 మిమీ ఉంటుంది. ఈ కొత్త మోడల్ దాని వెంటో మోడల్ కంటే కూడా 92 మిమీ పొడవు, 52 మిమీ వెడల్పు మరియు 5 మిమీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇక దీని వీల్‌బేస్ అనేది 2651 మిమీ వరకు ఉంటుంది. ఈ వీల్‌బేస్ కూడా వెంటో కంటే 98 మిమీ ఎక్కువ. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అనేది వెంటో కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో దాదాపు 40 సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేక్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

'Virtus' ఉత్పత్తి ప్రారంభించిన Volkswagen: పూర్తి వివరాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 110 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందించే 1.5 లీటర్ ఇంజన్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ వంటి వాటిని పొందుతుంది. కావున మంచి పనితీరుని అందించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త Volkswagen Virtus ధరలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఇవి లాంచ్ సమయంలో వెలువడే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2022, 19:34 [IST]
English summary
New volkswagen virtus production starts expected launch in india soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+