Volvo XC40 Recharge ఫస్ట్ యూనిట్ వచ్చేసింది.. ఇక త్వరలో మరిన్ని
ప్రముఖ స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) ఇప్పటికే భారతీయ మార్కెట్లో తన కొత్త 'ఎక్స్‌సి40 రీచార్జ్' (Volvo XC40 Recharge) SUV విడుదల చేసింది. అయితే ఇప్పుడు 'వోల్వో కార్ ఇండియా' భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేయబడిన ఈ వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV యొక్క మొదటి యూనిట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వోల్వో కార్ ఇండియా తన కొత్త SUV ఎక్స్‌సి40 రీచార్జ్ ను బెంగుళూరు రూరల్ సమీపంలోని హోస్కోట్ వోల్వో కార్ ఇండియా యొక్క తయారీ కేంద్రం నుండి విడుదల చేసింది. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా ఇందులో మీరు గమనించవచ్చు.

నిజానికి ఈ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది, కావున దీని ధర రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ఇప్పటికే తెలిపింది.

ఎక్స్‌సి40 రీచార్జ్ అనేది భారతదేశంలో విడుదలైన వోల్వో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం జరిగింది.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది చూడటానికి దాదాపుగా పెట్రోల్/డీజిల్ మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇది ఎలక్ట్రిక్ SUV కావున కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో పెద్ద వోల్వో బ్యాడ్జ్, వైట్-ఫినిష్డ్ గ్రిల్, ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, బ్లాక్ స్టోన్ రూఫ్ మరియు డోర్ మిర్రర్స్, రూఫ్ రైల్స్, కలర్ కో-ఆర్డినేటెడ్ ఫ్రంట్ గ్రిల్ కవర్ మరియు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ టెయిల్‌గేట్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, వోల్వో కార్స్ సర్వీసెస్ యాప్, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, 13-స్పీకర్ హార్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీని పొడవును 4,425 మిమీ, వెడల్పు 1,863 మిమీ, ఎత్తు 1,652 మిమీ మరియు 1,652 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. ఏ సమయంలో ఈ SUV యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిమీ వరకు ఉంటుంది. బూట్ స్పేస్ 419 లీటర్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా హుడ్ క్రింద అదనంగా 31 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను పొందుతుంది. ఇందులో ఒక్కొక్క యాక్సిల్ పై ఒక్కొక ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇందులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. అదే సమయంలో ఈ SUV యొక్క గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఒక పూర్తి ఛార్జ్‌పై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో పరిధి కొంత తగ్గే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ 350 కిమీ రేంజ్ తప్పకుండా పొందవచ్చు.

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ 150 కిలోవాట్ ఫాస్ట్ డిసి ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది, కావున ఈ 150 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ బ్యాటరీ ప్యాక్ ను కేవలం 33 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. అయితే 50kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి కనీసం 2.5 గంటల సమయం పడుతుంది.

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, విప్లాష్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐసోఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.


Click it and Unblock the Notifications








