మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors), ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) లో కంపెనీ అధిక రేంజ్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా, ఇప్పుడు కంపెనీ ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ విడుదల తేదీని మరియు దాని కొత్త పేరును అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ను టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) పేరుతో పిలువనున్నారు మరియు దీనిని మే 11, 2022వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త టీజర్ వీడియో..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కోసం కంపెనీ ఓ కొత్త టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. సుమారు పది సెకన్ల నిడివి గల ఈ టీజర్ వీడియోలో కంపెనీ అనేక విషయాలను హైలైట్ చేసింది. ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ ప్రస్తుత మోడల్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎఫీషియెన్సీ (సామర్థ్యం), ఎక్స్‌పీరియెన్స్ (అనుభవం) మరియు ఇన్నోవేషన్ (ఆవిష్కరణ)ల విషయంలో కొత్త నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ 'మ్యాక్స్' (గరిష్టం)గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఎక్కువ పవర్..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతానికి ఖచ్చితమైన వివరాలను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించనప్పటికీ, గతంలో లీకైన ఆర్టీఓ ఫైలింగ్‌ల ప్రకారం, కొత్త Nexon EV Max గరిష్టంగా 134 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుందని వెల్లడైంది. అంటే, ఇది ఇది ప్రస్తుత నెక్సాన్ ఈవీ యొక్క 129 బిహెచ్‌పి పవర్‌తో పోలిస్తే, 5 బిహెచ్‌పిలు పెరిగింది. అలాగే, ప్రస్తుత నెక్సాన్ ఈవీ గరిష్టంగా 245 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క టార్క్ వివరాలు తెలియాల్సి ఉంది.

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

ఎక్కువ రేంజ్..

బ్యాటరీ ప్యాక్ విషయంలో కూడా భారీ అప్‌గ్రేడ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, కొత్త నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ 40kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుందని వెల్లడైంది. కాగా, ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న నెక్సాన్ ఈవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్ 30.1kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, పూర్తి చార్జ్ పై 312 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. కాగా, కొత్త మ్యాక్స్ వేరియంట్ లోని పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిమీ పైగా రేంజ్ ను అందిస్తుందని భావిస్తున్నారు.

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

డిజైన్‌లో నో ఛేంజ్..

కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ సాంకేతికంగా మాత్రమే అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు మరియు ఇందులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అయితే, ఇందులో పెరిగిన పెద్ద బ్యాటరీ ప్యాక్ ను అమర్చడం కోసం కంపెనీ దీని నిర్మాణంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. కాగా, ఇతర వేరియంట్ల నుండి ఈ మ్యాక్స్ వేరియంట్‌ను ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి, కంపెనీ దానిపై MAX బ్యాడ్జ్‌లను జోడించవచ్చు. అదనపు బ్యాటరీ సామర్థ్యం వలన ఈ ఎలక్ట్రిక్ వాహనం లోపల ఖాళీ స్థలం (ప్రత్యేకించి బూట్ స్పేస్) ప్రభావితం అవుతుందని అంచనా.

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

కొత్త గేర్ సెలక్టర్, సరికొత్త ఫీచర్లు..

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్‌లో కొత్త నేపథ్యంతో కూడిన గేర్‌ నాబ్‌ను హైలైట్ చేసింది. ఇది గుండ్రటి స్మార్ట్ వాచ్ తరహాలో డిజిటల్ డిస్‌ప్లేని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ ఈ గేర్ చేంజ్ డయల్‌ను మార్చడం ద్వారా కారు ఏ మోడ్‌లో ఉందనే విషయాన్ని ఇది డిస్‌ప్లే యూనిట్‌పై ప్రదర్శిస్తుంది. ఈ టీజర్‌లో చూపించిన మరొక కొత్త ఫీచర్ దాని వీల్స్ మరియు మరియు టైర్‌లకు సంబంధించినది.ఇది కొత్త చక్రాలు మరియు తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ కలిగిన టైర్లను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే, లోపలి భాగంలో సన్‌రోఫ్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి మరికొన్ని ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుత వేరియంట్లు, ధరలు..

టాటా నెక్సాన్ ఈవీ యొక్క ప్రస్తుత మోడల్‌ను కంపెనీ మూడు వేరియంట్లలో (XM, XZ+, XZ+ Lux) విక్రయిస్తోంది. వీటితో పాటుగా కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త డార్క్ ఎడిషన్ (Tata Nexon EV Dark Edition) ను కూడా పరిచయం చేసింది. ఈ డార్క్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొత్తంగా నెక్సాన్ ఈవీ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరల వివరాలు ఉన్నాయి:

- టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్ : రూ.14.54 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ : రూ.15.95 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.16.95 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ : రూ.16.29 లక్షలు

- టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్+ లగ్జరీ : రూ.17.15 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

మే 11న కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ 'టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్' లాంచ్.. పూర్తి చార్జ్‌పై 400 కిమీ రేంజ్!

కాగా, కొత్తగా రాబోయే టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) ట్రిమ్‌ను కంపెనీ ఎన్ని వేరియంట్లలో ప్రవేశపెడుతుందనే విషయంపై ఇంకా ఖచ్చితమైన క్లారిటీ లేదు. అయితే, ఇందులో చేసిన అప్‌గ్రేడ్స్ మరియు జోడించిన కొత్త ఫీచర్ల కారణంగా దీని ధర, ఇతర నెక్సాన్ ఈవీ వేరియంట్ల ధర కన్నా సుమారు రూ.2 లక్షలకు పైగా అదనంగా ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Nexon ev long range varinat names as tata nexon ev max teaser revealed launch on 11th may 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X