కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

మారుతి సుజుకి ఇండియా గత కొంత కాలంగా తమ ప్రోడక్ట్ లైనప్ లో మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. భారతదేశంలో కార్ల విషయంలో సేఫ్టీ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో, మారుతి సుజుకి తమ చిన్న కార్లను మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మారుతి సుజుకి అనేక అప్‌గ్రేడెడ్ మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే బాలెనో, వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఎక్స్ఎల్6, బ్రెజ్జా మరియు ఎస్-ప్రెస్సో మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను విడుదల చేసింది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

కాగా, ఇప్పుడు మారుతి సుజుకి దేశంలోనే అత్యధికంగా విక్రయించే కారు అయిన ఆల్టో హ్యాచ్‌బ్యాక్ లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో (New Gen 2022 Maruti Suzuki Alto) భారత రోడ్లపై అనేక సార్లు టెస్టింగ్ దశలో ఉండగా గుర్తించబడింది. అయితే, మొదటిసారిగా ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ ఎస్‌యూవీ కెమెరాకు చిక్కింది. కొత్త ఆల్టో కోసం టెలివిజన్ కమర్షియల్ (టివిసి) చిత్రీకరిస్తుండగా ఇది కెమెరా కంటపడింది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

మారుతి సుజుకి తమ కొత్త తరం ఆల్టో కోసం టెలివిజన్ కమర్షియల్ ను షూట్ చేయడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, కొత్త ఆల్టో వచ్చే ఆగస్ట్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ టెలివిజన్ కమర్షియల్ కోసం మారుతి సుజుకి బ్లూ మరియు రెడ్ కలర్ ఆల్టో కార్లను ఉపయోగించడాన్ని ఈ చిత్రాలలో చూడొచ్చు. ఈ చిత్రాలు కొత్త ఆల్టో కారును పూర్తిగా రీడిజైన్ చేయబడినట్లు సూచిస్తున్నాయి.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

ఈ ఫొటోలను గమనిస్తే, కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కారు ముందు మరియు వెనుక వైపు కొత్త బంపర్ డిజైన్, బాడీ-కలర్ పిల్లర్లు మరియు డోర్ హ్యాండిల్స్, సిల్వర్ వీల్ కవర్‌లతో ఉండే స్టీల్ వీల్స్, ట్రెడిషనల్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, కొత్త టైల్‌లైట్లు, వెనుక బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ మరియు రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

లీకైన ఈ చిత్రాలలో కొత్త ఆల్టో కారు బ్లూ మరియు రెడ్ కలర్ ఆప్షన్‌లలో ఉంది. ఇవి కాకుండా, కంపెనీ మరిన్ని కొత్త కలర్ ఆప్షన్లను జోడించే అవకాశం ఉంది. కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ను కూడా కంపెనీ యొక్క హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌ పైనే ఆధారపడి ఉంటుందని సమాచారం. ప్రస్తుత మోడల్ 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగిస్తుండగా, ఈ అప్‌గ్రేడెడ్ మోడల్ లో ఇదే ఇంజన్ ను అప్‌డేట్ చేసి కొత్తగా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

ప్రస్తుత మారుతి సుజుకి ఆల్టో కారులోని ఇదే ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్ ను మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కాకుండా, కంపెనీ కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో యొక్క సిఎన్‌జి (CNG) వేరియంట్‌లను కూడా మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

ప్రస్తుతానికి, కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో గురించి ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు, అయితే రానున్న రోజుల్లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇదిలా కొత్త వెర్షన్ ఆల్టో కారును తీసుకురానున్న నేపథ్యంలో, మారుతి సుజుకి ఇండియా ఇటీవలే తమ ప్రస్తుత తరం మారుతి ఆల్టో యొక్క వేరియంట్ లైనప్‌ను సవరించింది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

ఇందులో ప్రస్తుత తరం మారుతి సుజుకి ఆల్టో యొక్క మూడు వేరియంట్‌లు నిలిపివేయబడ్డాయి. వీటిలో స్టాండర్డ్, LXi మరియు LXi CNG వేరియంట్‌ లను కంపెనీ నిలిపివేసింది. వేరియంట్ల సవరణ తర్వాత, భారత మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో ప్రారంభ ధర రూ. 3.39 లక్షలకు పెరిగింది. అదే, మీరు సిఎన్‌జి వేరియంట్‌ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ. 5.03 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో వస్తోంది.. నమ్మట్లేదా? ఇదిగో ఫస్ట్ ఇమేజ్!

వేరియంట్ల సవరణ అనంతరం మారుతి సుజుకి ఆల్టో ఇప్పుడు మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి ఆల్టో ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కార్లలో ఒకటిగా ఉంది మరియు గత 20 సంవత్సరాలుగా భారతీయ ప్యాసింజర్ కార్ మార్కెట్‌ను శాసిస్తోంది. మొదటిసారిగా కారు కొనేవారు మరియు మధ్యతరగతి కస్టమర్లను బాగా ఆకట్టుకున్న ఈ చిన్నకారుని చివరిగా 2020 సంవత్సరంలో అప్‌డేట్ చేశారు.

మూలం: టీమ్ బిహెచ్‌పి

Article Published On: Tuesday, July 19, 2022, 9:08 [IST]
English summary
Next gen 2022 maruti suzuki alto spotted during tvc shoot details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+