భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ (Nissan) 2013 సంవత్సరంలో భారత మార్కెట్‌పై భారీ ఆశలతో రీలాంచ్ చేసిన చవక కార్ బ్రాండ్ డాట్సన్ (Datsun) ను, ఇక్కడి మార్కెట్లో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో ఆల్టో, శాంత్రో వంటి చిన్న కార్లకు పోటీగా, అతి తక్కువ ధరకే కార్లను అందించాలనే ఉద్దేశ్యంతో, నిస్సాన్ తమ సబ్-బ్రాండ్‌గా డాట్సన్ కార్లను తీసుకువచ్చింది. అయితే, కాలక్రమేనా ఈ బ్రాండ్ కార్లకు ఆదరణ తగ్గడం, కార్ల తయారీ ఖర్చు కూడా పెరగడంతో నిస్సాన్ ఇప్పుడు ఈ డాట్సన్ బ్రాండ్‌ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

డాట్సన్‌ రెడీ-గో మోడల్ ఉత్పత్తి నిలిపివేత

ప్రస్తుతం, డాట్సన్ బ్రాండ్ నుండి మార్కెట్లో లభిస్తున్న ఏకైక మోడల్ డాట్సన్ రెడి-గో (Datsun Redi-GO). చెన్నైలోని రెనో-నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్లాంట్లో ఈ కారును తయారు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ కారు ఉత్పత్తిని కూడా నిలిపివేస్తున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే డాట్సన్ రెడి-గో మోడల్‌ అమ్మకాలు జరుగుతాయని కంపెనీ పేర్కొంది. డాట్సన్ ఇప్పటికే భారత మార్కెట్లో గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో+ ఎమ్‌పివి కార్లఉత్పత్తిని కూడా నిలిపివేసింది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

ఇకపై ఈ బ్రాండ్‌ కార్లను తయారు చేయబోమని డాట్సన్ ప్రకటించింది. రష్యా, ఇండోనేసియాలో ఇప్పటికే ఈ బ్రాండ్‌ను నిలిపివేసిన నిస్సాన్‌, తాజాగా భారతదేశంలో కూడా నిలిపివేసింది. ఈ మేరకు నిస్సాన్‌ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో డాట్సన్‌ రెడీ-గో ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, ఈ బ్రాండ్ కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కొనసాగుతాయని మరియు స్పేర్ పార్ట్స్ మరియు వారంటీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని డాట్సన్ పేర్కొంది. గ్లోబల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ స్ట్రాటజీలో భాగంగా డాట్సన్‌ బ్రాండ్‌ను నిలిపివేస్తున్నట్లు నిస్సాన్‌ తెలిపింది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

డాట్సన్ బ్రాండ్‌ను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు

వాస్తవానికి, డాట్సన్ బ్రాండ్‌ను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. పురాతన కార్ బ్రాండ్ అయిన డాట్సన్ కొన్ని కారణాల వలన 1986 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కార్లను తయారు చేయడం నిలిపివేసింది. అనంతరం దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత నిస్సాన్ తిరిగి డాట్సన్ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిస్సాన్ తమ ఐకానిక్ డాట్సన్ బ్రాండ్ భారతదేశం వేదికగా ప్రపంచ మార్కెట్ల కోసం లాంచ్ చేసింది. అలాంటి, డాట్సన్ ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా తన వ్యాపారాన్ని ముగించనుంది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

వివిధ మార్కెట్లలో డాట్సన్ బ్రాండ్ కొత్త ప్రయాణం

భారతదేశంలో 2013లో డాట్సన్ బ్రాండ్ రీలాంచ్ ప్రకటించబడింది. ఈ బ్రాండ్ నుండి ముందుగా వచ్చిన మొట్టమొదటి కారు డాట్సన్ గో (Datsun Go). ఈ కారు 2014లో లాంచ్ చేయబడింది మరియు ఇది ఈ బ్రాండ్ నుండి వచ్చిన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్. చాలా సరసమైన ధరకే, మారుతి ఆల్టో కారుకి పోటీగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అదే సంవత్సరంలో నిస్సాన్ తమ డాట్సన్ బ్రాండ్ ఇండోనేషియా, రష్యా, ఇండియా, నేపాల్ మరియు దక్షిణాఫ్రికా మార్కెట్లకు పరిచయం చేసింది. ఆ తర్వాత 2016లో కజకిస్తాన్, బెలారస్ మరియు లెబనాన్‌ వంటి దేశాలకు విస్తరించబడింది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

డాట్సన్ గో కారును కేవలం భారతదేశంలోనే కాకుండా ఇండోనేషియాలో ఉన్న రెనో-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్‌లో కూడా తయారు చేశారు. ఇది నిస్సాన్ యొక్క V ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపుదిద్దుకున్న హ్యాచ్‌బ్యాక్. నిస్సాన్‌కు చెందిన ఒకప్పటి మైక్రా (Micra) హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని డాట్సన్ గో కారు రూపొందించారు. గో హ్యాచ్‌బ్యాక్ తర్వాత, కంపెనీ గో ప్లస్ అనే ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసింది. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ ఎమ్‌పివిగా చరిత్ర సృష్టించింది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

డాట్సన్‌కు కలిసిరాని భారత మార్కెట్, దేశీయ బ్రాండ్ల నుండి గట్టి పోటీ

భారత మార్కెట్లో డాట్సన్ బ్రాండ్ ప్రవేశించినప్పుడు, మొదట్లో అంతా బాగానే గడించింది. కానీ, ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. డాట్సన్ భారతదేశానికి పూర్తిగా కొత్త బ్రాండ్ కావడంతో, దాని విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చాయి. మరోవైపు ఇది చవక కారు బ్రాండ్‌గా ప్రవేశపెట్టడంతో ఈ కార్ల సేఫ్టీ విషయంపై కూడా పలు అనుమానాలు తలెత్తాయి. వీటిన్నిటికీ మించి మారుతి ఆల్టో 800 మరియు హ్యుందాయ్ ఇయాన్ వంటి చిన్న కార్ల నుండి పెరిగిన పోటీ నేపథ్యంలో డాట్సన్ కార్ల అమ్మకాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి డాట్సన్ బ్రాండ్ భారతదేశం నుండి వెళ్లిపోయేలా చేశాయి.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

భారత్‌లో చిన్న కార్లకు తగ్గిన డిమాండ్, ఎస్‌యూవీలకు పెరిగిన డిమాండ్

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో గత కొన్నేళ్లుగా, కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ సెగ్మెంట్లలో చిన్న కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే, అదే సమయంలో కాంపాక్ట్/మిడ్-సైజ్ ఎస్‌యూవీల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు టూవీలర్ నుండి కారుకి అప్‌గ్రేడ్ అయ్యే వారు లేదా మొదటిసారిగా కారును కొనుగోలు చేసేవారు తక్కువ ధర కలిగిన చిన్న హ్యాచ్‌బ్యాక్‌లను తమ మొదటి ఎంపికగా చేసుకునేవారు. అయితే, ఇప్పుడు మొదటిసారి కారు కొనేవారు కూడా కాస్తంత ఖరీదైనా ఫర్వాలేదు, సేఫ్టీగా ఉండే పెద్ద కార్లను కొనుగోలు చేద్దామనే అభిప్రాయంతో ఉన్నారు.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

భారత్ నుండి వెళ్లిపోతున్న ఆటోమొబైల్ కంపెనీలు

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం నుండి పలు కార్ కంపెనీలు నిష్క్రమించాయి. గడచిన ఐదేళ్లలో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్, ఇటాలియన్ కార్ బ్రాండ్ ఫియట్ మరియు రీసెంట్‌గా అమెరికాకు చెందిన మరొక కార్ కంపెనీ ఫోర్డ్ వంటి కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో తమ వ్యాపారాన్ని నిలిపివేశాయి. అమ్మకాలు తగ్గుముఖం పట్టడం, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఈ కంపెనీలు భారత్‌కు గుడ్‌బై చెప్పేశాయి. తాజాగా డాట్సన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

భారత్‌లో డాట్సన్ (Datsun) బ్రాండ్‌కి గుడ్‌బై చెప్పిన నిస్సాన్ (Nissan).. రెడిగో ఉత్పత్తి నిలిపివేత!

నిస్సాన్ బ్రాండ్ కూడా భారత్ నుండి వెళ్లిపోతుదా..?

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో ఒకటి ఇటీవలే మార్కెట్లో విడుదల మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, మరొకటి కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. దేశంలో నిస్సాన్ కిక్స్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. కంపెనీ తయారు చేస్తున్న ఈ మోడల్‌కి సప్లయ్‌కి మించిన డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిస్సాన్ ఇప్పట్లో భారత్‌ను విడిచి వెళ్లే అవకాశాలైతే కనిపించడం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, April 21, 2022, 10:51 [IST]
English summary
Nissan ends datsun brand in india redi go production stopped in chennai plant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+