ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ కార్ తయారీ సంస్థ 'నిస్సాన్' (Nissan) దేశీయ విఫణిలోకి మూడు కొత్త కార్లను ఒకే వేదికమీద ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ మూడు కార్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.. రండి.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ ఇండియా దేశ రాజధాని నగరం ఢిల్లీలో మూడు గ్లోబల్ ఎస్‌యువిలను ఆవిష్కరించింది. అవి నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail), నిస్సాన్ కష్కాయ్ (Nissan Qashqai) మరియు నిస్సాన్ జూక్ (Nissan Juke). భవిష్యత్ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఎక్స్-ట్రైల్ మరియు కష్కాయ్ ఎస్‌యువిలను టెస్టింగ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే టెస్టింగ్ పూర్తయిన తరువాత నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కంపెనీ యొక్క మొదటి ఎస్‌యువిగా గ్లోబల్ మార్కెట్లో విక్రయించబడుతుంది. ఆ తరువాత కష్కాయ్ మరియు జూక్ విక్రయించబడతాయి.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail):

నిస్సాన్ కంపెనీ మొదట విడుదల చేయనున్న కొత్త 'ఎక్స్-ట్రైల్' అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలు పొందుతుంది. అయితే ఇది ఒక ప్రీమియం ఎస్‌యువి, కావున ఇది 5 సీటర్ లేదా 7 సీటర్ వేరియంట్స్ గా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది CMF-C ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడి ఉంటుంది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, యాంగ్యులర్ గ్రిల్, ఫ్లేర్డ్ రియర్ వీల్ ఆర్చెస్ మరియు స్లిమ్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail) 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

ఈ SUV యొక్క హైబ్రిడ్ వెర్షన్ 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) తో రానుంది, అయితే నాన్ హైబ్రిడ్ మోడల్ FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌ను పొందుతుంది. ఎక్స్-ట్రైల్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతే కాకూండా ఇందులో మడ్, స్నో మరియు గ్రావెల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉండనున్నాయి.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ కష్కాయ్ (Nissan Qashqai):

నిస్సాన్ కంపెనీ ఆవిష్కరించిన మరో SUV 'కష్కాయ్'. ఇది ఎక్స్-ట్రైల్ కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. అయితే ఇది మంచి డిజైన్ మరియు అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ కష్కాయ్ 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.8 ఇంచెస్ హెడ్-అప్ డిస్ప్లే వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్ మరియు అమెజాన్ అలెక్సా వంటివి కూడా ఉంటాయి.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ కష్కాయ్ ఎస్‌యువి 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో మరియు CVT లేదా 6-స్పీడ్ మాన్యువల్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మార్కెట్లో విడుదలైన తరువాత విడుదలవుతుంది. ఇది జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ జూక్ (Nissan Juke):

నిస్సాన్ కంపెనీ ఆవిష్కరించిన మూడవ మోడల్ జూక్ (Juke). ఇది మిగిలిన రెండు SUV లు లాంచ్ అయిన తరువాత మార్కెట్లో విడుదలవుతుంది. ఇది కంపెనీ యొక్క CMF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించబడి ఉంటుంది. కాగా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఆధునికంగా ఉంటుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

నిస్సాన్ జూక్ 1.0 లీటర్ 3-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. కావున 115 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 10.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ప్యాడిల్ షిఫ్టర్ పొందుతుంది.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకూండా సరికొత్త స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ కోసం లైవ్ ట్రాఫిక్‌ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఒకే వేదికపై మూడు కార్లు ఆవిష్కరించిన నిస్సాన్.. ఇక ప్రత్యర్థుల పరిస్థితి ఏంటో?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిస్సాన్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన మాగ్నైట్ మరియు కిక్స్ వంటి కార్ల అమ్మకాలతో మంచి పురోగతి సాధించింది. ఈ తరుణంలో కంపెనీ మరో మూడు కొత్త కార్లను ఏక కాలంలో ఆవిష్కరించడం వల్ల ప్రత్యర్థులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త కార్లు రాబోయే రోజుల్లో భారతీయ రోడ్లమీద తిరగడానికి సిద్దమవుతాయి. కంపెనీ యొక్క ఈ SUV లను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Article Published On: Tuesday, October 18, 2022, 13:18 [IST]
English summary
Nissan introduced x trail qashqai and juke suvs in india launch scheduled to next year details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+