ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ (Nissan), భారతదేశంలో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Magnite) మరోసారి ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. అక్టోబరు 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు అధికారిక స్పాన్సర్‌గా నిస్సాన్ ఇండియా వరుసగా ఏడవ సంవత్సరం కూడా ICCతో తన అనుబంధాన్ని కొనసాగించింది. ఈ కార్యక్రమానికి Nissan Magnite SUV అధికారిక కారుగా ఉంటుంది.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ ఇండియా ఇప్పుడు తమ అధికారిక ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో 3డి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫిల్టర్ ద్వారా ఐసిసి మెన్స్ టి20 ప్రపంచ కప్ 2022 యొక్క వర్చువల్ ట్రోఫీ టూర్‌ను కూడా ప్రమోట్ చేస్తుంది. ఈ వేదికలపై అభిమానులు సృజనాత్మకతను పొందడానికి మరియు టూర్ కంట్రోల్‌ని తీసుకోవడానికి ఫిల్టర్‌ని ఉపయోగించవచ్చు.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

గత సంవత్సరం, కరోనా మహమ్మారి సంబంధిత పరిమితుల కారణంగా, ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ యూఏఈ మరియు ఒమన్‌లలో జరిగింది. ఆ సమయంలో నిస్సాన్ ఇండియా కూడా భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌తో కలిసి కోవిడ్-19 వైరస్‌కు వ్యతిరేకంగా దేశంలో అవగాహన పెంచడానికి మరియు సాధికారతను కల్పించడానికి అవగాహన మరియు భద్రతా ప్రచారాన్ని నిర్వహించారు.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

ఐసిసితో వరుసగా 7వ సారి స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన ప్రకటనపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడే క్రీడా ఈవెంట్‌లలో ఒకటైన టి20తో మా విజయవంతమైన అనుబంధాన్ని కొనసాగించడం మరియు అధికారిక స్పాన్సర్‌గా కొనసాగడం పట్ల నిస్సాన్ సంతోషిస్తోంది. బిగ్, బోల్డ్ మరియు బ్యూటిఫుల్ నిస్సాన్ మాగ్నైట్ ఈ ఈవెంట్ యొక్క అధికారిక కారుగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలోనే కాకుండా 15 ఎగుమతి మార్కెట్‌లలోని కస్టమర్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందని" అన్నారు.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

భారత మార్కెట్ పై భారీ అంచనాలతో మనదేశంలోకి ప్రవేశించిన జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, ఇక్కడి మార్కెట్లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో చాలానే సమస్యలు ఎదుర్కుంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి కేవలం రెండు మోడళ్లు మాత్రమే మార్కెట్లో విక్రయించబడుతున్నాయి. వాటిలో ఒకటి నిస్సాన్ మాగ్నైట్ మరొకటి నిస్సాన్ కిక్స్. ఈ రెండు మోడళ్లలో ప్రస్తుతం, మాగ్నైట్ దాని సరసమైన ధర, అద్భుతమైన ఫీచర్ల కారణంగా మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే, కిక్స్ అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో సాగడం లేదు.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL)కు చెన్నైలోని అత్యాధునిక తయారీ కర్మాగారం ఉంది. ఇదే ప్లాంట్‌లో నిస్సాన్ అనుబంధ సంస్థ రెనో కూడా తమ వాహనాలను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్‌లో నిస్సాన్ తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. తాజాగా, వచ్చిన నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ కూడా 15 కంటే ఎక్కువ దేశాలలో విక్రయించబడుతోంది.నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాలలో కూడా ఈ కారు విక్రయించబడుతోంది.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

రాబోయే ఐసిసి మెన్స్ టి20 ప్రపంచ కప్ యొక్క అధికారిక కారుగా ఉండటం ద్వారా, నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ క్రికెట్‌ పట్ల ఆసక్తి కలిగిన అనేక దేశాలలో తన పాపులారిటీని పెంచుకునేందుకు మరియు కొత్త మార్కెట్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మాగ్నైట్ దాని అమ్మకాలను పెంచుకోవడానికి అవసరమైన అదనపు రీచ్‌ను కూడా పొందుతుంది. టి20 మెన్స్ వరల్డ్ కప్ అక్టోబరు 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగుతుంది.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మాగ్నైట్ విషయానికి వస్తే, కంపెనీ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిసెంబర్ 2020లో భారతదేశంలో విడుదల చేసింది. స్థానికంగా భారతదేశంలో తయారు చేయబడిన ఈ మేడ్ ఇన్ ఇండియా కారును నిస్సాన్ అనేక ప్రపంచ మార్కెట్లలో విక్రయిస్తోంది. స్పోర్టీ డిజైన్ మరియు సరమైన ధర కారణంగా ఈ చిన్న ఎస్‌యూవీ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. గడచిన 2020లో ఈ కారు ప్రారంభ ధర రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. కాగా, ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ. 5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవలే ఇందులో రెడ్ ఎడిషన్‌ అనే ప్రత్యేకమైన మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ అఫీషియల్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మరోసారి నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి పవర్‌ను మరియు 152 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కాగా, 1.0 లీటర్ న్యాచురల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2022, 9:54 [IST]
English summary
Nissan magnite becomes the official car for the upcoming icc mens t20 world cup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+