గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

ఇటీవల కాలంలో వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం మైలేజ్ మరియు ఫీచర్స్ వంటి వాటిని మాత్రమే కాకుండా దాని సేఫ్టీ రేటింగ్ వంటి వాటిని కూడా దృష్టిలో ఉంచుకుంటారు. ఈ కారణంగా అధిక సేఫ్టీ రేటింగ్ పొందే వాహనాలు మార్కెట్లో బాగా అమ్ముడుపోతాయి. దేశీయ మార్కెట్లో మంచి సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నిస్సాన్ (Nissan) కంపెనీ యొక్క మ్యాగ్నైట్ (Magnite) SUV కూడా చేరిపోయింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

ఇటీవల గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో నిస్సాన్ మ్యాగ్నైట్ 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. నిస్సాన్ మ్యాగ్నైట్ అడల్ట్ సేఫ్టీలో అత్యధిక స్కోర్ చేయగలిగింది. అదే సమయంలో ఇది సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్‌ కూడా 64 కిమీ/గం గరిష్ట వేగంతో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్‌లో కూడా పరీక్షించబడింది. అయితే ఇందులో డ్రైవర్ వైపు డమ్మీ చెస్ట్ ప్రాంతంలో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిసాయి.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

నిస్సాన్ మ్యాగ్నైట్ కిడ్స్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ పొందింది. దీనికి ప్రధాన కారణం ఎంట్రీ లెవల్ మోడల్ వెనుక భాగంలో ISOFIX చైల్డ్ సీట్ కంట్రోల్ లేకపోవడమే. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) కారణంగా నిస్సాన్ మాగ్నైట్‌కి ఒక పాయింట్ తక్కువ ఇవ్వబడింది, వెనుక మధ్య సీటు ప్రయాణీకుల కోసం త్రీ-పాయింట్ సిస్టమ్‌కు బదులుగా ల్యాప్ సీట్‌బెల్ట్ మరియు సైడ్ హెడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటివి కూడా స్టాండర్డ్ గా లేదు. అయినప్పటికీ గ్లోబల్ NCAP టెస్ట్ లో నిస్సాన్ మాగ్నైట్‌ ఉత్తమ ర్యాంకింగ్ పొందింది.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

సాధారణంగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ అనేది భారత దేశంలో 2013 నుంచి ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ భద్రతా నిబంధనలపై భారతదేశంలో పరీక్షలు ప్రారంభించిన తర్వాత భద్రతా ప్రమాణాలు చాలా వరకు పెరిగాయి. అంతకు ముందు కార్లలోని స్టాండర్డ్ వేరియంట్‌లలో ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందుబాటులో ఉండేవి కావు.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

అయితే గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ అనేది ప్రారంభమైన తరువాత ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లకు కూడా రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు అందించబడుతున్నాయి. దీనితో పాటు సీట్‌బెల్ట్ అలర్ట్, స్పీడ్ అలర్ట్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో అందించబడుతున్నాయి. అంతే కాకూండా ఇప్పుడు ఇప్పుడు భారత ప్రభుత్వం కార్లలో తప్పని సరిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని ఆదేశించింది.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో రూ. 5.76 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది. నిస్సాన్ మాగ్నైట్ మొత్తం 7 ట్రిమ్‌లలో రెండు పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మంచి పనితీరుని అందిస్తుంది, కావున ఎక్కువ మంది ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

ఇదిలా ఉండగా నిస్సాన్ ఇండియా (Nissan India) బ్రాండ్ నిస్సాన్ మ్యాగ్నైట్ (Nissan Magnite) ఇప్పుడు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో దాదాపు 15 దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి చేస్తోంది. ఒక్క బ్రాండ్ కారు 15 దేశాలకు ఎగుమతి చేయడం అంటే నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

నిస్సాన్ కంపెనీ యొక్క ఎగుమతులు గత సంవత్సరం దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రారంభించిన తరువాత, ఇప్పుడు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనై, ఉగాండా, కెన్యా, సీషెల్స్, మొజాంబిక్, జాంబియా, మారిషస్, టాంజానియా మరియు మలావి వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

నిస్సాన్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కావున రాబోయే రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను తప్పకుండా భారతీయ మార్కెట్లో విడుదల చేస్తుంది. నిస్సాన్ మోటార్స్ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడు భాగాల సమ్మేళనంలో చేరింది, ఇందులో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ మరియు జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ ఉన్నాయి.

ఈ మూడు కంపెనీల సమ్మేళనంతో 2030 నాటికి సంయుక్తంగా 30 వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ నివేదించింది. ఈ వాహనాలు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లలో ప్రారంభించబడతాయి. నిస్సాన్ మోటార్ యొక్క భారతీయ విభాగం ఎలక్ట్రిక్ కార్లకు తదుపరి అతిపెద్ద మార్కెట్ అని పేర్కొంది.

గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన Nissan Magnite: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రాబోయే కొన్నేళ్లలో మూడు రెట్లు వృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు అన్నీ కూడా దేశీయ విఫణిలోకి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే నిస్సాన్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్ విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం కంపెనీ యొక్క మ్యాగ్నైట్ SUV మంచి సేఫ్టీ రేటింగ్ పొందటం వల్ల అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2022, 9:56 [IST]
English summary
Nissan magnite gncap crash test scores 4 star rating details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+