కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

భారతదేశంలో మోటార్ వాహన చట్టం మరింత పటిష్టం చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే కఠినమైన ట్రాఫిక్ నియమాలను చాలా వరకు అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా ఇటీవల టాటా సన్స్ మాజీ చైర్మన్ 'సైరస్ మిస్త్రీ' రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటినుంచి ఈ రూల్స్ మరింత కఠినతరం అవుతున్నాయి. కావున ఇప్పుడు కారులో ప్రయాణించే సెకండ్ రో ప్యాసింజర్లు కూడా తప్పని సరిగా సీటు బెల్ట్ ధరించాలని ఒక నియమం వచ్చింది. ఈ రూల్ ఇప్పుడు బెంగళూరు నగరాన్ని కూడా తాకింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

నివేదికల ప్రకారం, కర్ణాటక రాజధాని నగరం అయిన బెంగళూరులో ఇప్పుడు వాహన వినియోగదారులు తమ కారు లో తప్పకుండా రెండవ వరుసలో కూడా సీట్ బెల్ట్ కలిగి ఉండాలి. ఈ నియమాన్ని కేంద్ర 2022 సెప్టెంబర్ 19 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఇది ముంబై వంటి మహానగరాల్లో నవంబర్ 01 నుంచి అమలుచేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

తాజాగా ఈ రూల్ ఇప్పుడు బెంగళూరు ప్రజలు కూడా తప్పకుండా పాటించాలి. బెంగళూరు నగరంలో మీరు కారులో ప్రయాణించే సమయంలో రెండవ వరుసలో ఉన్న ప్రయాణికులు కూడా తప్పకుండా సీటు బెల్టుని ధరించాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి రూ. 1,000 జరిమానా విధిస్తారు, కాగా రెండవ సారి ఇదే ఉల్లంఘన జరిగితే వారికి రూ. 2,000 జరిమానా విధించబడుతుంది.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు మాత్రమే సీటు బెల్ట్ ధరించాలని నిబంధన ఉండేది. అయితే రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇది రానున్న రోజుల్లో రోడ్డుప్రమాదంలో జరిగే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

ఈ నియమం అమల్లోకి రాగానే పోలీస్ అధికారులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే మహీంద్రా మరియు ఫోర్స్ కంపెనీ యొక్క ఎస్‌యూవీలలో సైడ్‌ ఫేసింగ్ సీట్లలో కూర్చునే ప్రయాణికులు ఈ నియమాన్ని ఎలా పాటించాలి అనేది కొంత గందరగోళానికి గురి చేస్తోంది.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

రెండవ వరుసలో కూడా సీట్ బెల్ట్ అవసరం అనే రూల్ బెంగళూరులో గత బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఆదేశాలను ఏడీజీ (రోడ్ సేఫ్టీ) 'హితేంద్ర' జారీ చేశారు. ఈ నియమం ఇప్పుడు SUV, ఎంయూవీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ సహా అన్ని రకాల కార్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సెకండ్ రో సీట్ బెల్ట్ మాత్రమే కాకుండా తప్పనిసరిగా కార్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇది కూడా త్వరలోనే అమలులోకి రానుంది.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

2023 అక్టోబర్ నుంచి అన్ని ప్యాసింజర్ కార్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని, దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇప్పటికే వెల్లడించాడు. ఇందులో భాగంగానే వాహనాల్లో ప్రయాణించేవారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా గతంలో తెలియజేసారు.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎక్కువమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల రక్షణకు పెద్ద పీట వేయడానికి కార్లలో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలి అని ఆదేశించింది. ఈ ఆరు ఎయిర్‌బ్యాగుల్లో రెండు ఫ్రంట్, రెండు షోల్డర్ మరియు రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.

కర్ణాటకలో కొత్త రూల్.. రియర్ సీట్ బెల్ట్ తప్పనిసరి: లేకుంటే జరిమానా బాదుడే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సానియాను తగ్గించడానికి కేద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మొదట ఆరు ఎయిర్ బ్యాగుల నిబంధన, ఇప్పుడు వేణుపై వరుస ప్రయాణికుల కోసం సీట్ బెల్ట్ నిబంధన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిబంధనలు తప్పకుండా రోడ్డు ప్రమాదాల్లో జరిగే ప్రాణనష్టాలను తగ్గిస్తాయని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Friday, October 21, 2022, 12:22 [IST]
English summary
Now rear seatbelts mandatory in karnataka for safety details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+