ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ప్రస్తుతం భారతదేశంలో అమెజాన్ తర్వాత అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్‌సైట్. ఒకప్పుడు పుస్తకాలు అమ్ముకోవడం ద్వారా ఇంటర్నెట్ వ్యాపారంలోకి ప్రవేశించిన, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు తమ వెబ్‌సైట్ ద్వారా కార్లు అమ్మేస్థాయికి ఎదిగిపోయింది. అవును, ఇప్పుడు మీ అభిమాన స్కోడా (Skoda) కార్లను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదెలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థల మధ్య ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం ఏర్పడింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, స్కోడా తమ కార్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ ను స్వీకరించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ని కానీ లేదా వెబ్‌సైట్ ని కానీ సందర్శించడం ద్వారా ఆసక్తిగల కస్టమర్లు స్కోడా కార్లను బుక్ చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

భారత మార్కెట్లో స్కోడా ఆటో విక్రయిస్తున్న అన్ని కార్లను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ లో బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంచింది. కస్టమర్లు ఫ్లిప్‌కార్డ్ వెబ్‌సైట్ లో స్కోడా కంపెనీకి చెందిన అన్ని కార్ల గురించి సమాచారాన్ని పొందవచ్చు మరియు ఆ తర్వాత కారును 6 దశల్లో బుక్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్డ్ యాప్ లో స్కోడా ప్రమోషన్ పేజ్ ను సందర్శించిన తర్వాత, కస్టమర్లు తమకు నచ్చిన కారును ఎంచుకోవచ్చు మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

ఇలా కస్టమర్లు తమకు నచ్చిన కారును ఎంచుకున్న తర్వాత, వెబ్‌సైట్ లేదా యాప్ లో వారు తమ సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బుకింగ్ పేజ్ కి వెళ్లి, నిర్దేశిత టోకెన్ అమౌంట్ చెల్లించడం ద్వారా స్కోడా కారును బుక్ చేసుకోవచ్చు. స్కోడా కార్ల బుకింగ్ ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్కోడా కార్లను అందుబాటులో ఉంచడం వలన తమ కార్ల బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని మరియు అధిక సంఖ్యలో కొత్త కస్టమర్లను చేరుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

కోవిడ్-19 వ్యాప్తి తర్వాత దేశంలో వ్యాపార విధానాలు పూర్తిగా మారిపోయాయి. తయారీదారులు మరియు కస్టమర్లు కూడా పూర్తిగా డిజిటలైజేషన్ ప్రక్రియకు అలవాటు పడిపోయారు. గత రెండేళ్లలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. ఈ నేపథ్యంలో, స్కోడా తమ కార్ల కొనుగోలు మరియు బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి దేశంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్ తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో కంపెనీ కొత్త కస్టమర్లను చేరుకోవాలని ఆశిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

స్కోడా బ్రాండ్ అమ్మకాలు ఎలా ఉన్నాయి?

స్కోడా ఆటో ప్రతి నెలా సానుకూల విక్రయాలతో భారత మార్కెట్లో తన పట్టును మరింత పటిష్టం చేసుకుంనేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కంపెనీ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కుషాక్, స్లావియా కార్లు మార్కెట్లో మంచి ఆదరణను పొందుతున్నాయి. ప్రీమియం విభాగంలో కంపెనీ అందిస్తున్న కొత్త కొడియాక్ ఎస్‌యూవీ కూడా మార్కెట్లో మంచి సక్సెస్ సాధించింది. స్కోడా ఆటో గత నెలలో మొత్తం 4,503 యూనిట్లను విక్రయించగా, జనవరి 2022లో 3,009 వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో స్కోడా దాదాపు 50 శాతం నెలవారీగా వృద్ధిని నమోదు చేసింది.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

స్కోడా స్లావియా (Skoda Slavia) కు పెరుగుతున్న డిమాండ్!

స్కోడా ఫిబ్రవరి 2022 నెలలో తమ సరికొత్త 'స్లావియా' (Skoda Slavia) సెడాన్ ను మార్కెట్లో విడుదల చేసింది. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన కొత్త స్లావియా సెడాన్ ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతున్నాయి. స్లావియా సెడాన్ మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) మరియు రెండు ఇంజన్ ఆప్షన్లతో (1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్) అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

స్కోడా స్లావియా 1.0 లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 178 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ టిఎస్ఐ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఫోన్లు, టీవీలే కాదు, స్కోడా (Skoda) కార్లు కూడా అమ్మేస్తాం..!!

స్లావియా సెడాన్ లో ప్రధానంగా లభించే ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన క్యాబిన్ లేఅవుట్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంటెండ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు స్కోడా కనెక్ట్ యాప్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మొదలైనవి చాలానే ఉన్నాయి.

Article Published On: Wednesday, March 16, 2022, 16:39 [IST]
English summary
Now you can buy skoda cars on flipkart lets find out how
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+