భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

భారతదేశంలో ఆటోరిక్షాలు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారబోతున్నాయా? ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, అవునని తెలుస్తోంది. ఇటీవలే, కాలిఫోర్నియాకు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ఇన్‌కార్పోరేషన్ (Biliti Electric) భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు మరొక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (Omega Seiki Mobility) కర్ణాటక రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

ఈ మేరకు కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, "వరల్డ్ ఎర్త్ డే (ఏప్రిల్ 22) సందర్భంగా, ఒమేగా సీకి మొబిలిటీ (OSM) కర్నాటకలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద e-3W (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం గర్వంగా ఉంది" అని పేర్కొంది. అయితే, కర్ణాటక రాష్ట్రంలో కంపెనీ తమ కొత్త ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఏప్రాంతంలో ఏర్పాటు చేయనున్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ప్లాంట్ 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని కంపెనీ తెలిపింది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

ఒమేగా సీకి మొబిలిటీ (OSM) ప్లాంట్ మొత్తం 3 దశల్లో నిర్మించబడుతుంది మరియు ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత ఇది ప్రతి సంవత్సరం 1 మిలియన్ (10 లక్షల) ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒమేగా సీకి మొబిలిటీ కొత్త కర్మాగారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మరియు ఇది దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

కంపెనీ తమ కొత్త మెగాఫ్యాక్టరీకి సమీపంలో అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఉన్న మరియు కొత్త సరఫరాదారులతో కూడా చర్చలు జరుపుతోంది. కొత్త శ్రేణి ఈవీ పవర్‌ట్రెయిన్‌లను తయారు చేయడంలో సహాయపడటానికి దక్షిణ కొరియా సంస్థ జే సంగ్ టెక్‌తో ఒమేగా సీకి మొబిలిటీ (ఓఎస్ఎమ్) ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

ఈ సందర్భంగా, ఒమేగా సీకి మొబిలిటీ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY22లో) 200 శాతానికి పైగా భారీ వృద్ధిని సాధించింది. ఇది ఈవీ 3 వీలర్లను కమాండ్ చేయగల స్థాయికి తీసుకువెళ్లడంలో సహాయపడింది. మొత్తం త్రీ-వీలర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ త్రీవీలర్ల వాటా 46 శాతంగా ఉంది. లాస్ట్-మైల్ డెలివరీ సెక్టార్ మరియు ప్రభుత్వ సంస్థలలో ఈవీలను స్వీకరించడం వలన ప్రపంచంలోనే భారతదేశం మొదటి అతిపెద్ద ఈవీ 3-నీలర్ మార్కెట్‌గా అవతరించగలదని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

కేవలం భారతదేశంలోనే కాకుండా తాము ప్రపంచంలోనే త్రీ-వీలర్ మార్కెట్లో మార్కెట్ లీడర్‌గా ఉండాలని కోరుకుంటున్నామని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మొదటి అడుగుగా తాము ఏటా 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో కూడిన కొత్త ఓఎస్ఎమ్ మెగాఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం, దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‌జి ధరలు ఆల్-టైమ్ హైలో ఉన్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లు దేశంలోని పెద్ద ప్రాంతాలకు సరసమైన రవాణా పరిష్కారాలను అందిస్తాయని, ఇది లాజిస్టిక్స్ ప్లేయర్‌ల దిగువ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

తెలంగాణాలో బిలిటి ఎలక్ట్రిక్ (Biliti Electric) త్రీవీలర్ ప్లాంట్

కాలిఫోర్నియాకు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ఇన్‌కార్పోరేషన్ (Biliti Electric) భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2,40,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఓ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 150 మిలియన్ల డాలర్ల ప్రైవేట్ పెట్టుబడిని పెడుతుందని అంచనా వేయబడింది. బిలిటి తీసుకున్న నిర్ణయం వలన ఈ బ్రాండ్‌కు భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మరియు ఎనర్జీ స్టోరేజ్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మారడంతో పాటుగా, రాష్ట్రంలో కొత్తగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలదని అంచనా.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

500 యూనిట్ల మహీంద్రా ట్రియో (Mahindra Treo) త్రీవీలర్లకు ఆర్డర్

దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ (Mahindra Electric), RAAHI ప్రాజెక్ట్ లో భాగంగా, పంజాబ్ ప్రభుత్వం నుండి 500 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు ఆర్డర్ దక్కించుకుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మహీంద్రా ట్రియో (Mahindra Treo) పేరుతో ఓ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ను విక్రయిస్తోంది. పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన RAAHI ప్రాజెక్ట్ లో భాగంగా పెట్రోల్ మరియు డీజిల్‌తో నడిచే ఆటో-రిక్షాలను ఎలక్ట్రిక్ వాటితో భర్తీ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమృత్‌సర్‌తో సహా 12 నగరాలను కవర్ చేస్తుంది, ఈ నగరాల్లో మహీంద్రా ఎలక్ట్రిక్ రాబోయే కొద్ది నెలల్లో 500 యూనిట్ల ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను పంపిణీ చేస్తుంది.

భారీగా శబ్ధం చేసే ఆటోరిక్షాలకు స్వస్తి.. సైలెంట్‌గా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు స్వాగతం..

ఎలక్ట్రిక్ త్రీవీలర్ రంగంలో కనిపిస్తున్న ఈ వృద్ధిని చూస్తుంటే, భవిష్యత్తులో డుగుడుగు మంటూ వీపరీతంగా శబ్ధం చేసే పెట్రోల్, డీజిల్‌తో నడించే ఆటోరిక్షాలు పోయి పూర్తిగా నిశ్బబ్ధంగా ఉండే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు రోడ్లపై రాజ్యమేలే సూచనలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 23, 2022, 12:19 [IST]
English summary
Omega seiki mobility to setup worlds largest electric three wheeler plant in karnataka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+