EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

2022 అక్టోబర్ నెల ముగిసిపోయింది, అయితే ఈ నెలలో కార్ తయారు సంస్థలు అక్టోబర్ నెలలో ఎన్నివాహనాలను విక్రయించాయి అనే అమ్మకాల నివేదికలను ఇప్పటికే విడుదల చేశాయి. అయితే సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ అయిన 'కియా మోటార్స్' (Kia Motor) భారతీయ మార్కెట్లో గత నెలలో మంచి అమ్మకాలను పొందగలిగింది.

కియా ఇండియా గత నెలలో ఏకంగా 152 యూనిట్ల EV6 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగలిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం డెలివరీలు గత సెప్టెంబర్ నెలలోనే ప్రారంభమై ఉండాలి, అయితే మొత్తానికి అక్టోబర్ నెలలో డెలివరీలను ప్రారంభించింది. కాగా మొదట్లోనే ఏకంగా 152 యూనిట్లను విక్రయించి ఈవి6 డెలివరీలలో మంచి రికార్డ్ సృష్టించగలిగింది.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

భారతీయ మార్కెట్లో కియా ఈవి6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారు ధర రూ. 59.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదలైంది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని దేశీయ విఫణిలో విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మొత్తమ్ అమ్ముడైపోయాయి.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

కొత్త కియా ఈవి6 ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. దీనికోసం కంపెనీ 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చింది. ఒక సింగిల్ ఛార్జ్ తో 528 కిమీ పరిధిని అందిస్తుందని తెలియడం వల్ల ఎక్కువమంది ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఈ కారంగానే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే అన్ని విక్రయించబడ్డాయి.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

కియా ఈవీ6 జిటి-లైన్ (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 229 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అదేవిధంగా జిటి-లైన్ ఏడబ్ల్యూడి (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్ గరిష్టంగా 325 బిహెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో ఇది 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

కొత్త కియా ఈవి6 డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఏ మాత్రం రాజీ పడే అవకాశం లేదు. కావున ఇది మంది డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో వాలుగా ఉండే రూప్ ఉంటుంది, అంతే కాకుండా ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక రియర్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

కియా ఈవి6 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్‌లో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్యానెల్ లో అమర్చబడి ఉన్నాయి. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, డోర్ ప్యానెళ్లపై డ్యూయెల్ టోన్ ఫినిషింగ్స్, 14 స్పీకర్లతో కూడిన మెరీడియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ పవర్ టైల్ గేట్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

ఇదిలా ఉండగా కియా మోటార్స్ మార్కెట్లో గత నెల 9,777 యూనిట్ల సెల్టోస్, 7,614 యూనిట్ల సోనెట్, 5,479 యూనిట్ల కారెన్స్ మరియు 301 యూనిట్ల కార్నివాల్‌ వంటి వాటిని విక్రయించగలిగింది. మొత్తం మీద కియా మోటార్స్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలిగింది.

EV6 డెలివరీలలో Kia Motor రికార్డ్: మొదట్లోనే గొప్ప ఆరంభం..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గత నెలలో విజయదశమి మరియు దీపావళి రెండూ కూడా ఒకేసారి రావడం వాహనం తయారీ సంస్థలకు బాగా కలిసి వచ్చింది. పండుగల నేపథ్యంలో కొత్త వాహనాలను కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కూడా ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ కారణంగానే గత నెలలో కియా ఇండియా మంచి అమ్మకాలను పొందగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2022, 17:31 [IST]
English summary
Over 150 units of kia ev6 delivered in 2022 october deatils
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+