భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto), గతేడాది భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం 'బివైడి ఇ6' (BYD e6) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్పటి నుండి ఇప్పటి వరకూ దేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

Recommended Video

2023 నాటికి స్మాల్ ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ ప్రారంభించనున్న హ్యుందాయ్

భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 29.15 లక్షలుగా ఉంది. చైనాకి చెందిన 'బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో' (BYD Auto), ఇటీవలే భారతదేశంలో తమ రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బివైడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ డీలర్‌షిప్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు కూడా ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయవచ్చు.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు శక్తివంతమైన 71.6kWh 'బ్లేడ్' లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది సాంప్రదాయమైన లిథియం-అయాన్ బ్యాటరీల కన్నా ఎంతో మెరుగైనది మరియు సురక్షితమైనదని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ ను మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ నుండి పవర్ ముందు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

బివైడి ఇ6 WLTP ప్రమాణాల ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 415 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇ6 ఎలక్ట్రిక్ కారు యొక్క 'నగరం మాత్రమే' (సిటీ ఓన్లీ) రేంజ్, పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎందుకంటే, ఇందులో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ ఉంటుంది, అంటే, బ్రేక్ వేసిన ప్రతిసారు సుమారు 2 కిలోమీటర్ల వరకూ సరిపడా రేంజ్ లభిస్తుంది.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

ఈఎలక్ట్రిక్ కారులో అమర్చిన కోబాల్ట్-రహిత LiFePO4 బ్యాటరీ ప్యాక్ 'బ్లేడ్' చాలా సురక్షితమైనది మరియు ఇది ప్రమాదవశాత్తు పంక్చర్ అయినప్పటికీ కాలిపోవడం లేదా పేలిపోవడం జరగదని కంపెనీ తెలిపింది. బివైడి ఇ6 కారులోని బ్యాటరీ ప్యాక్ AC మరియు DC ఛార్జింగ్ ప్రమాణాలకు మద్దతు ఇస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, BYD e6 దాని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు మరియు దీనిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, ఈ కారుతో పాటుగా BYD 7kW AC అనే ఛార్జర్‌ ను కూడా పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారులో 580 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది. కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 125,000 కిమీ వారంటీని అందిస్తుంది. ఇక బ్యాటరీ వారంటీ విషయానికి వస్తే, బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 500,000 కిమీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ వారంటీ విషయానికి వస్తే, దానిపై 8 సంవత్సరాలు లేదా 150,000 కిమీల వారంటీని అందిస్తోంది.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారులో లభించే కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మరియు ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ వంటి అనేక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేక్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మొదలైనవి ఉన్నాయి.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

ప్రస్తుతం, బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, విజయవాడ మరియు కొచ్చి నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే, కంపెనీ ఇటీవలే గురుగ్రామ్, చండీగఢ్, ఇండోర్, జైపూర్, పూణె మరియు కోల్‌కతా నగరాలలో డీలర్ భాగస్వాములను కూడా నియమించుకుంది.

భారతదేశంలో 450 యూనిట్లకు పైగా ఇ6 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన బివైడి

ఇదిలా ఉంటే, బివైడి ఇండియా భారతదేశంలో తమ రెండవ ఎలక్ట్రిక్ కారు బివైడి అట్టో3 (BYD Atto3) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ తమ బివైడి అట్టో3 కి సంబంధించిన లేటెస్ట్ టీజర్‌ను కూడా వెల్లడి చేసింది. ఈ టీజర్ లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ఫ్రంట్‌ ప్రొఫైల్‌ను వెల్లడి చేసింది. ఇందులో ఎస్‌యూవీ యొక్క ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు అస్పష్టంగా ఉన్న ఫ్రంట్ ప్రొఫైల్ తప్ప ఇతర వివరాలేమీ కనిపించడం లేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో విడుదల కానుంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2022, 8:00 [IST]
English summary
Over 450 units byd e6 electric cars delivered in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+