దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

ఇండియన్ పారాలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ మరియు రియో ​​గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, దీపా మాలిక్ కారులో కొన్ని మార్పులు చేయాలని కోరింది. తద్వారా తనలాంటి వ్యక్తులు కూడా సులభంగా అటువంటి కార్లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే దీనిపైన స్పందించిన మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా వారి సిబ్బందిని మహీంద్రా XUV700 ని వారికి అనుకూలంగా కస్టమైజ్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

కస్టమైజ్ చేయబడిన మహీంద్రా XUV700 యొక్క సీటు కారు నుంచి సులభంగా బయటకు వస్తుంది. ఇది వికలాంగులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోని సీటు రూపకల్పన మరియు పనిని దీపా మాలిక్ స్వయంగా పరీక్షించారు. ఆ సమయంలో ఆమె మహీంద్రా & మహీంద్రా యొక్క సాంకేతిక బృందానికి మరియు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

అయితే ఇప్పుడు కస్టమైజ్ చేయబడిన మహీంద్రా XUV700 గురించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా పారాలింపిక్స్ కోసం మోడిఫై చేసిన ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ని దీపా మాలిక్‌కు అప్పగించారు. పారాలింపిక్ క్రీడాకారిణి దీపా మాలిక్ ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

దీపా మాలిక్ చేసిన ఈ ట్వీట్‌లో, ఆనంద్‌ మహీంద్రా ఈ అద్భుతమై అందమైన కారును అందించినందుకు ధన్యవాదాలు, మీరు చేసిన చేసిన వాగ్దానాన్ని మీ బృందం నెరవేర్చింది. ఈ కారు తప్పకుండా చాలా మంది దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది, అని రాసింది.ఈ కారులో ప్రయాణించడానికి తాను ఎదురు చూస్తున్నట్లు కూడా తెలిపింది.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

మహీంద్రా కంపెనీ యొక్క XUV700 అనేది అద్భుతమైన SUV. ఇది డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ల ఎంపికలో అందుబాటులో ఉటుంది. ఒకటి 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ అందించే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్, మరొకటి 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందించే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

మహీంద్రా XUV700 క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. మహీంద్రా XUV700 లో క్రాష్ టెస్ట్ చేయబడిన యూనిట్ ఎంట్రీ లెవల్ వేరియంట్. కావున దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS బ్రేక్‌లు మరియు ISOFIX ఎంకరేజ్‌లు ఉన్నాయి. అయితే ఇందులో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో మూడు పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా XUV700 మరింత అద్భుతమైన సేఫ్టీ అందిస్తుందని టెస్టింగ్ ఏజన్సీ ఇప్పటికే తెలిపింది.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని ప్రస్తుతం రూ. 12.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు. దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 SUV మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

దీపా మాలిక్ Mahindra XUV700.. ఇది చాలా స్పెషల్ గురూ..!!

మహీంద్రా కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో తన XUV700 ధరలను పెంచింది. ఈ SUV ధరలు ఇప్పుడు మునుపటికంటే రూ. 46,000 నుండి రూ. 81,000 వరకు పెరిగింది. XUV700 యొక్క పెట్రోల్ వెర్షన్ ధర రూ. 75,000 పెరిగింది మరియు XUV700 డీజిల్ ధర రూ. 81,000 పెరిగింది. ధరల పెరుగుదల తరువాత ఈ SUV యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 23.80 లక్షల కాగా, ఇప్పుడు మహీంద్రా XUV700 ప్రారంభ ధర రూ.12.95 లక్షలకు చేరుకుంది.

Article Published On: Thursday, March 3, 2022, 12:25 [IST]
English summary
Paralympic deepa malik gets modified mahindra xuv700 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+