జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

భారతదేశంలో రాకీయనాయకులకు ఏర్పాటు చేసే భద్రత అంతా, ఇంతా కాదు. ఉన్నతమైన స్థానంలో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇలాంటి భద్రతను ఏర్పాటు చేసుకుంటారు. భారతదేశ ప్రధాన మంత్రికి పటిష్టమైన భద్రత కల్పించబడుతుంది. ఇది దాదాపు అందరికి తెలుసు. అంతే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా భద్రతలో భాగంగానే కాన్వాయ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది కూడా అందరికి తెలుసు.

అయితే ఇటీవల సినీ నటుడు మరియు జనసేన పార్టీ అధినేత 'పవన్ కళ్యాణ్' కూడా తన కాన్వాయ్ కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగిన వారిలో యితడు ఒకరు. అంతే కాకుండా.. జనసేన పార్టీ స్థాపించి రాకీయాల్లోకి అరంగేట్రం చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల మహీంద్రా (Mahindra) కంపెనీకి చెందిన 8 స్కార్పియో (Scorpio) వాహనాలను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

మహీంద్రా కంపెనీ యొక్క స్కార్పియో విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఇవి చెప్పుకోదగ్గవి. ఈ కారణంగా చాలా మంచి రాజాకీయ నాయకులు మహీంద్రా స్కార్పియోలనే ఉపయోగిస్తున్నారు. మహీంద్రా స్కార్పియో చాల దృఢమైనవి. అంతే కాకుండా మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

ఈ మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) లో 7-స్లాట్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. అదే విధంగా బ్రాండ్ లోగో కూడా ఇక్కడ చూడవచ్చు. ఇందులో అద్భుతమైం బంపర్ ఇరువైపులా హెడ్ ల్యాంప్ మరియు ఫాగ్ లైట్స్ వంటివి కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇంజన్‌కు అత్యంత గాలి ప్రసరణ ఉండేందుకు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ కూడా ఇందులో ఉంది. వీటితో పాటు రూఫ్ రెయిల్స్ ఇందులో ఉన్నాయి.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

మహీంద్రా స్కార్పియో యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యాష్ బోర్డ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. డ్యాష్ బోర్డ్ మధ్యలో జిపిఎస్ న్యావిగేషన్ సపోర్ట్ చేసే 6-ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. మహీంద్రా ఇందులో డైనమిక్ అసిస్ట్ గల రియర్ పార్కింగ్ కెమెరా, సింగల్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, పది విభిన్న భాషల్లో జిపిఎస్ న్యావిగేషన్ మరియు ఇతర ఫీచర్లను అందించింది.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

2017 మహీంద్రా స్కార్పియో 2.2-లీటర్ డీజల్ ఇంజన్ పొందుతుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 136.78 బిహెచ్‌పి పవర్ మరియు 1800 - 2800 ఆర్‌పిఎమ్ వద్ద ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

మహీంద్రా స్కార్పియో మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, నాపొలి బ్లాక్, మొల్టెన్ రెడ్, సిల్వర్ మరియు డైమెండ్ వైట్ కలర్స్. 'మహీంద్రా స్కార్పియో' (Mahindra Scorpio) యొక్క ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 13.18 లక్షలు, అదే సమయంలో డీఐ టాప్ వేరియంట్ ధర రూ. 18.14 లక్షలు.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో పార్టీ ప్రచారానికి ఈ వాహనాలు ఉపయోగించడబడతాయి. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సీనియర్ నాయకులు కూడా ప్రయాణిస్తారు. ఈ కార్లు ధర రూ. 1.5 కోట్లు వరకు ఉంటుంది అని తెలుస్తోంది.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 8 మహీంద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలు చేయడం వల్ల విమర్శలు ఎక్కువ సంఖ్యలో వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఒక వైపు పవన్ తన వద్ద ఇఎమ్ఐ చెల్లించడానికి కూడా డబ్బు లేదని చెబుతున్నాడు. ఈ సమయంలో ఇంత డబ్బు ఎలా ఖర్చు చేస్తాడని అంటున్నారు.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

ఒక నెటిజన్ విమర్శిస్తూ.. ఇలా వ్రాశాడు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని నడపలేడని అతడు బీజేపీ మరియు టిడిపిలో విలీనం అయిపోతాడని అన్నాడు. మరొక వ్యక్తి టిడిపి లేదా బిజెపి ఇచ్చిన పండ్స్ ద్వారా తీసుకుని ఉంటాడని రాసాడు. ఈ విధంగా సోషల్ మీడియావైలో పవన్ కళ్యాణ్ మీద విమర్శల వర్షం కురుస్తోంది.

జనసేనానికి యాత్రకు కొత్త మహీంద్రా స్కార్పియోలు: ధర రూ. 1 కోటికి పైనే..

మొత్తానికి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తన హవా చాటడానికి కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. 2014 లో పార్టీ స్థాపించి ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తరువాత 2019 లో పోటీలో నిలిచాడు కానీ జనసేన కేవలం 1 సీటు మాత్రమే పొందింది. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు. మొత్తానికి ఇక రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాకీయాల్లో నిలదొక్కుకోగలడా.. లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 13, 2022, 12:51 [IST]
English summary
Pawan kalyan buys eight mahindra scorpio vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+