ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా తమ సరికొత్త జిర్ఆర్ కరోలా (Toyota GR Corolla) హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. గరిష్టంగా 300 హార్స్ పవర్ శక్తిని జనరేట్ చేసే ఈ చిన్నకారు 2022 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి రానుంది. జిఆర్ (GR) ఈ జపనీస్ బ్రాండ్ యొక్క రేసింగ్ డివిజన్. కొత్తగా వస్తున్న టొయోటా జిఆర్ కరోలా అనేది గజూ రేసింగ్ (Gazoo Racing) తయారు చేస్తున్న పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ కారు. మరి పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

టొయోటా జిఆర్ కరోలా: స్పెసిఫికేషన్లు, కొలతలు

గతంలో టొయోటా గజూ రేసింగ్ అభివృద్ధి చేసిన కరోలా జిఆర్ యారిస్‌లో ఉపయోగించిన అదే టర్బోచార్జ్డ్ 1.6 లీటర్ ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌ను ఈ కొత్త జిఆర్ కరోలా కారులోనూ ఉపయోగించారు. జిఆర్ కరోలా కారులో, ఇంజన్ బ్యాక్ ప్రెజర్‌ను తగ్గించడానికి దీనిని వాల్వ్-ఫిట్టెడ్ ట్రిపుల్ ఎగ్జాస్ట్ మఫ్లర్‌తో అప్‌డేట్ చేశారు. అంతేకాకుండా, ఇది పెద్ద ఎగ్జాస్ట్ వాల్వ్‌లు, పార్ట్-మెషిన్డ్ ఇన్‌టేక్ మరియు మల్టీ-ఆయిల్ జెట్ పిస్టన్ కూలింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

ఈ మార్పుల కరాణంగా, కొత్త టొయోటా జిఆర్ కరోలా కారులోని టర్బోచార్జ్డ్ 1.6 లీటర్ త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 300 బిహెచ్‌పి శక్తిని మరియు 3,000 - 5,500 ఆర్‌పిఎమ్ మధ్య 370 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ షార్ట్ త్రో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో రెవ్ మ్యాచింగ్ కూడా ఉంటుంది. టొయోటా యొక్క 'GR-4' ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపణీ చేయబడుతుంది.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

టొయోటా GR కరోలాలో ముందువైపు మెక్‌ఫెర్సన్ స్ట్రట్‌లు మరియు వెనుక భాగంలో డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇవి అధిక వేగాలు మరియు కఠినమైన రోడ్లపై కూడా సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. టొయోటా జిఆర్ కరోలా ముందు మరియు వెనుక యాక్సిల్ లో టోర్షన్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్‌లు కూడా ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, నాలుగు చక్రాలపై వెంటిలేటెడ్ అల్యూమినియం డిస్క్‌లు ఉంటాయి. ముందు బ్రేక్‌లు 4 పాట్ కాలిపర్‌లను కలిగి ఉండగా, వెనుక బ్రేకులు ట్విన్ కాలిపర్‌లను కలిగి ఉంటాయి.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

ఈ కారులో కంపెనీ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు 235/40 R18 మిష్లిన్ పైలట్ స్పోర్ట్ 4 టైర్‌లను ఉపయోగించింది. టొయోటా జిఆర్ కరోలా 4,410 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు మరియు 1,455 మిమీ ఎత్తును మరియు 2,640 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. టొయోటా జిఆర్ కరోలా యొక్క ముందు మరియు వెనుక ట్రాక్‌లను సాధారణ కారుతో పోలిస్తే వరుసగా 60 మిమీ మరియు 85 మిమీ వెడల్పుగా ఉంటుంది. జిఆర్ కరోలా యొక్క ఫ్రంట్ ట్రాక్ 1,590 మిమీ వెడల్పు ఉండగా, వెనుక ట్రాక్ 1,620 మిమీ వెడల్పుగా ఉంటుంది.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

టొయోటా జిఆర్ కరోలా: డిజైన్ మరియు ఫీచర్లు

టొయోటా జిఆర్ కరోలా సాధారణ కరోలా యొక్క స్పోర్టీ వెర్షన్ హ్యాచ్‌బ్యాక్ రూపాన్ని తలపిస్తుంది. జిఆర్ కరోలా ముందు వైపున విశాలమైన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంటుంది, ఇందులో ఎక్కువ భాగం గ్రిల్‌తో నిండి ఉంటుంది. సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో జిఆర్ యారిస్ ప్రొఫైల్ నుండి స్పూర్తిపొంది డిజైన్ చేయబడిన ఫ్రండ్ అండ్ రియర్ వీల్ ఆర్చ్‌లు ఉంటాయి. ఇవి కారు బాడీ నుండి ఉబ్బినట్లుగా ఉండి, మంచి రగ్గడ్ లుక్‌ని అందిస్తాయి. వీటి క్రింది భాగంలో గ్లోసీ బ్లాక్ 15-స్పోక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉంటాయి.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

టొయోటా జిఆర్ కరోలా వెనుక భాగంలో పెద్ద బంపర్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ ఎగ్జాస్ట్ సెటప్ హైలైట్ గా నిలుస్తుంది. గజూ రేసింగ్ కరోలా వెనుక భాగంలో కూడా పెద్ద స్పాయిలర్‌ ఉంటుంది. ఇది కారుకి మరింత ఏరోడైనమిక్ లుక్ ని అందిస్తుంది. ఇక ఇంటీరియర్స్ ను గమనిస్తే, ఇందులో చాలా వరకూ సుపరిచితంగానే అనిపిస్తుంది. అయితే, ఈ Gazoo Racing Corolla హాటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకి మరింత స్పోర్టీనెస్‌ ను అందించేందుకు ముందు వైపు స్పోర్ట్ సీట్లు, లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు అల్యూమినియం పెడల్స్‌ వంటి కొన్ని ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

ఈ చిన్న కారు పవర్ 300 గుర్రాలతో సమానం..!! టొయోటా జిఆర్ కరోలా (Toyota GR Corolla) ఆవిష్కరణ!

స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో డ్రైవర్ సమాచారం కోసం 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది డ్రైవర్ కు కావల్సిన డ్రైవింగ్ మోడ్‌లతో సహా అవసరమైన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల వినోదం కోసం ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కూడా ఉంటుంది మరియు క్లౌడ్ ఆధారిత నావిగేషన్‌తో పాటు వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేయబడిన మోడల్. కాబట్టి, ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ.

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2022, 17:08 [IST]
English summary
Performance version toyota gr corolla revealed specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+