50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

ఇటలీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ పియాజియో (Piaggio) భారత దేశంలో వెస్పా మరియు ఆప్రిలియా వంటి బ్రాండ్లకు చెందిన ద్విచక్ర వాహనాలతో పాటుగా ఆపే (Ape) బ్రాండ్ క్రింద త్రిచక్ర వాహనాలు మరియు ప్యాసింజర్ ఆటోరిక్షాలను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ బ్రాండ్ ఇప్పుడు భారత మార్కెట్లో మరో సరికొత్త ఆటోరిక్షాను విడుదల చేసింది. పియాజియో ఆపే నెక్స్ట్ ప్లస్ (Piaggio Ape NXT+) పేరుతో కంపెనీ ఓ కొత్త ప్యాసింజర్ ఆటోను ప్రవేశపెట్టింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (PVPL) త్రీవీలర్ ప్యాసింజర్ సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆపే ఎన్ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) త్రీవీలర్ పెట్రోల్, సిఎన్‌జి మరియు ఎల్‌పిజి వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది ఈ విభాగంలోనే అత్యధిక మైలేజీని అందించే త్రీ-వీలర్ అని కంపెనీ చెబుతోంది. ఆపే నెక్స్ట్ ప్లస్ CNG రూపంలో కేజీ సిఎన్‌జికి 50 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించగలదని కంపెనీ పేర్కొంది.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

ఆపే నెక్స్ట్ ప్లస్ ఆటోరిక్షా ట్యూబ్‌లెస్ టైర్లు, హెడ్‌ల్యాంప్ బెజెల్స్, లేత గోధుమరంగు రంగు డాష్‌బోర్డ్, డ్యూయల్ టోన్ సీట్లు మరియు మెరుగైన పారదర్శకత కోసం పారదర్శక విండోలను కలిగి ఉన్న అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ ‌లతో అందించబడుతుంది. ఈ ఆటోరిక్షా 3-వాల్వ్ ఇంజన్‌ ను ఉపయోగిస్తుంది, ఇది మరింత శక్తిని మరియు టార్క్‌ ను అందిస్తుంది మరియు డ్రైవింగ్‌ లో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

ఈ సందర్భంగా పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ, పియాజియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ సిఎన్‌జి, ఎల్‌పిజి మరియు పెట్రోల్ ఇంధన వేరియంట్‌లతో కంపెనీ నుండి కొత్తగా వస్తున్న మోడల్ అని, దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ మరియు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త మోడల్ ను మూడు రకాల ఇంధన ఆప్షన్లతో పరిచయం చేశామని చెప్పారు.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

దేశంలో పెరుగుతున్న కాలుష్యం మరియు అధిక ఇంధన ధరల నేపథ్యంలో, భారత ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది, ఇది పెద్ద కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వారి ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పియాజియో వంటి OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరర్) లకు సహాయం చేస్తోంది.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

కొత్త పియాజియో ఆపే నెక్స్ట్ ప్లస్ (Piaggio Ape NXT+) భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా భారతదేశంలో రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఈ త్రీవీలర్ ను కేవలం భారత మార్కెట్లో కాకుండా పలు విదేశీ మార్కెట్‌లకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. భారత మార్కెట్లో ఈ కొత్త త్రీవీలర్ ప్రారంభంతో, తాము ప్రత్యామ్నాయ ఇంధన విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ తెలిపింది.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

పియాజియో తన త్రీ వీలర్ కార్గో మరియు ప్యాసింజర్ వాహనాల సముదాయంలో కొత్త Ape NXT+ని జోడించడం గర్వంగా ఉందని డియెగో గ్రాఫీ తెలిపారు. కొతత్ ఆపే నెక్స్ట్ ప్లస్ ను విస్తృతమైన పరిశోధన మరియు విస్తృతమైన కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తర్వాత అభివృద్ధి చేశామని, ఇంధన ధర పెరుగుదలతో తాము తమ కస్టమర్‌ల అధిక మైలేజ్ అవసరాన్ని మరియు ఇంధనంపై ఖర్చు ఆదా చేయాల్సిన పరిస్థితిని అర్థం చేసుకున్నామమని, ఈ అంశాలన్నింటినీ పరిగణిలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త త్రీవీలర్ ను విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు.

50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే పియాజ్జియో ఆపే ఎన్‌ఎక్స్‌టి ప్లస్ (Ape NXT+) ఆటోరిక్షా విడుదల: ధర, ఫీచర్లు

కొత్త ఆపే నెక్స్ట్ ప్లస్ ఆటోరిక్షా సెగ్మెంట్లో కెల్లా అత్యధిక మైలేజ్, సౌకర్యాన్ని మరియు ప్రయాణీకులకు కనీస నిర్వహణ ఖర్చుతో పాటు ఎక్కువ స్థలాన్ని కూడా అందిస్తుంది. ఆపే నెక్స్ట్ ప్లస్ సమకాలీన డిజైన్ అంశాలతో వస్తుంది మరియు ఇది అత్యంత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులోని 3 వాల్వ్ ఇంజన్ శక్తివంతమైన పికప్ మరియు అసాధారణమైన డ్రైవింగ్ అనుభవం కోసం రూపొందించబడింది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2022, 14:44 [IST]
English summary
Piaggio india launches ape nxt plus three wheeler price variants mileage details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+