ఎట్టకేలకు ఉత్పత్తి దశకు చేరుకున్న 1900 హార్స్ పవర్ పినిన్‌ఫరీనా బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్!
హైపర్‌కార్లలో ఇప్పటి వరకూ పెట్రోల్ వాహనాలదే పైచేయి. అయితే, అభిప్రాయాన్ని మారుస్తానంటోంది ప్రముఖ ఇటాలియన్ కార్ కంపెనీ పినిన్‌ఫారినా (Pininfarina). గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే పినిన్‌ఫారినా బాటిస్టా (Pininfarina Battista) ఎలక్ట్రిక్ హైపర్‌కారు ఇప్పుడు కాన్సెప్ట్ దశ నుండి ఉత్పత్తి దశకు చేరుకుంది. ఏకంగా 1900 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేసే ఈ ఎలక్ట్రిక్ హైపర్ కారును ప్రపంచవ్యాప్తంగా 150 యూనిట్లు మాత్రమే విక్రయించనుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ కథనంలో చూద్దాం రండి.

స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు మరియు హైపర్ కార్లను తయారు ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్ పినిన్‌ఫారినా అత్యంత ప్రసిద్ధి చెందిన కంపెనీలలో ఒకటి. పినిన్‌ఫారినా తయారు చేసే కార్లకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఆటోమొబైల్ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళ్లేందుకు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ హైపర్ కారును ఆవిష్కరించింది. దాని పేరే పినిన్‌ఫారినా బాటిస్టా. ఇప్పటి వరకూ కాన్సెప్ట్ గా మాత్రమే ఉన్న ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ స్టేజ్ కు చేరుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఇటలీలోని తమ ప్రత్యేకమైన ఫ్యాక్టరీలో పినిన్‌ఫారినా ఈ ఎలక్ట్రిక్ హైపర్ కారును తయారు చేస్తుంది. పినిన్‌ఫారినా మొత్తం 150 యూనిట్ల బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కార్లను మాత్రమే తయారు చేస్తుంది. ఒక్క కారును తయారు చేయడానికి సుమారు 10 నుండి 18 వారాల సమయం పడుతుంది. ప్రతి యూనిట్ కూడా ప్రత్యేకంగా చేతులతో తయారు చేయబడుతుంది. కాబట్టి, ఇవి చాలా స్పెషల్ గా ఉంటాయి. కంపెనీ ఈ కారును పరిమిత సంఖ్యలో తయారు చేయడం ద్వారా దాని విశిష్టతను కాపాడాలనుకుంటోంది.

పినిన్‌ఫారినా బాటిస్టా యొక్క ప్రతి యూనిట్ చాలా సొగసైన ఆకృతిలో కనిపిస్తుంది. ఈ బ్యాచ్ లో మొదటి యూనిట్ వచ్చే నెలలో కాలిఫోర్నియాలోని మాంటెరీ కార్ వీక్ లో ప్రదర్శించబడుతుందని కంపెనీ ప్రకటించింది. పినిన్‌ఫారినా ప్రకారం, బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కారును తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకే దీన్ని తయారు చేసేందుకు చాలా సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కారును తయారు చేసే ఫ్యాక్టరీని కంపెనీ వివిధ విభాగాలుగా విభజించి, కారును తయారు చేస్తుంది. ఈ కారు అసెంబ్లీ లైన్ ను మొత్తం 14 విభాగాలుగా (జోన్‌లుగా) విభజిస్తారు. ప్రతి జోన్ లో కూడా 10 మంది (అంటే మొత్తం 140 మంది) నిపుణులతో కూడిన బృందం ఈ కారు తయారీపై పనిచేస్తుంది. ఒక్కొక్క బృందం ఈ హైపర్ కారును తయారు చేయడానికి సుమారు 1,250 గంటల సమయం వెచ్చిస్తారని కంపెనీ తెలిపింది.

ఫినిన్‌ఫారినా యొక్క స్టాండర్డ్ బాటిస్టా కారును తయారు చేయడానికి సుమారు 10 వారాల సమయం పడితే, కంపెనీ 2020లో ఆవిష్కరించిన బాటిస్టా లిమిటెడ్ ఎడిషన్ యానివర్సారియో మోడల్ ను తయారు చేయడానికి 18 వారాలకు మించి సమయం పట్టింది. పినిన్‌ఫారినా బాటిస్టా కారు బరువు, కొలతలు మరియు పవర్‌ట్రెయిన్ విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈ కారు గరిష్ట వేగానికి ఏదీ అడ్డురాకుండా చూసేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంది. కారు వేగాన్ని పెంచడానికి అనువైన బరువు, ఏరోడైనమిక్స్ వంటి అన్ని విషయాలు ఇందులో ఉంటాయి.

ముఖ్యంగా, ఈ ఎలక్ట్రిక్ హైపర్ కారును తేలికగా ఉంచేందుకు దీని తయారీలో ఎక్కువగా కార్బన్ ఫైబర్ ప్యానెళ్లను ఉపయోగించారు. ఈ ప్యానెల్ బరువు తక్కువగా ఉన్నప్పటికీ, ఇది చాలా ధృడమైనదిగా ఉంటుంది. పినిన్‌ఫారినా ఇంత శ్రద్ధతో కారును తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంత సుదీర్ఘ ఉత్పత్తి వ్యవధితో 2020లో కంపెనీ ఒక కారును కూడా ఉత్పత్తి చేసింది. ఈ దశలోనే బాటిస్టా కారును అభివృద్ధి చేసే పనిని పినిన్‌ఫరీనా ప్రారంభించింది.

నివేదికల ప్రకారం, ఈ కారు అభివృద్ధిలో పాల్గొనడానికి కంపెనీ తన వినియోగదారులను కూడా ఆహ్వానించింది. కస్టమర్‌లు తమ బాటిస్టా కోసం సీటింగ్ యొక్క కలర్ మరియు స్టైల్ కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించింది. పినిన్‌ఫారినా బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కారు 2.5 మిలియన్ డాలర్లకు విక్రయించాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిసింది. ఈ కారును ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరలోనే డెలివరీ చేయాలని పినిన్‌ఫారినా యోచిస్తోంది.

పినిన్‌ఫారినా బాటిస్టా కారులో పైకి తెరచుకునే గల్‌వింగ్ డోర్స్ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఎలక్ట్రిక్ హైపర్ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. దీని ఓవరాల్ డిజైన్ ఫెరారీ కార్లను తలపించేలా మరియు వాటిని మరపించేలా చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 217 మైళ్లు (అంటే గంటకు 350 కి.మీ) వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా, ఈ కారు కేవలం 1.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పినిన్‌ఫారినా బ్రాండ్ మన భారతదేశంలో ఉండే ప్రముఖ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా (Mahindra) కు చెందినది కావడం విశేషం. పినిన్‌ఫారినా కోచ్‌బిల్డర్ గా వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ గా అవతరించింది. కాగా, కొన్ని నెలల క్రితమే ఈ ఇటాలియన్ కంపెనీని మహీంద్రా కొనుగోలు చేసింది. మరి మహీంద్రా ఒక్క యూనిట్ పినిన్‌ఫారినా బాటిస్టా హైపర్ కారునైనా భారతదేశాకి తీసుకువస్తుందా..?


Click it and Unblock the Notifications








