టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కార్ PMV EaS-E: ధర రూ. 4.79 లక్షలు

భారతీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక కొత్త వెహికల్ విడుదలవుతూనే ఉంది, ఈ రోజు ఒక కొత్త మరియు ప్రత్యేకమైన వెహికల్ విడుదలైంది.

సాధారణంగా కార్ అంటే కనీసం నాలుగు సీట్లు ఉంటాయని అందరికి తెలుసు, అయితే ఈ రోజు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు కేవలం రెండు సీట్లను, నాలుగు డోర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కార్ PMV EaS-E

ముంబైకి చెందిన చెందిన పర్సనల్ మొబిలిటీ వెహికల్స్ (PMV) కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ 'EaS-E' ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది, ఇప్పటికే 6,000 ప్రీ బుకింగ్స్ పొందినట్లు కూడా సమాచారం. కంపెనీ వెల్లడించిన ఈ ధరలు (రూ. 4.79 లక్షలు) మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

PMV కంపెనీ యొక్క EaS-E ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. నిజానికి ఇది కారుగా కంటే క్వాడ్రిసైకిల్‌ గా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇది టాటా నానో కారు కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. టాటా నానో కారు పొడవు 3,099 మిమీ కాగా, EaS-E ఎలక్ట్రిక్ వెహికల్ పొడవు 2,915 మిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం రెండు సీట్లను మాత్రమే పొందుతుంది.

నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కార్ PMV EaS-E

PMV EaS-E ఎలక్ట్రిక్ కారులో ఒక ముందు సీటు, ఒక వెనుక సీటు మాత్రమే ఉంటాయి. అయితే ఇందులో స్టీరింగ్ వీల్ సెంటర్ కన్సోల్ మధ్యలో ఉంది. అయితే ఈ కారులోకి సులభంగా వెళ్ళడానికి మరియు సులభంగా బయటకు రావడానికి నాలుగు డోర్లను అందించింది. ఇది చిన్న కారు అయినప్పటికీ డిజైన్ పరంగా చూడచక్కగా ఉంటుంది.

PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్స్ పొందుతుంది, ముందు భాగంలో PMV లోగో కూడా ఉంటుంది. ఇంటీరియర్ లో ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం LCD స్క్రీన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్-ఎనేబుల్డ్ ఆడియో సిస్టమ్, రిమోట్ పార్క్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, లాక్ & అన్‌లాక్ మరియు ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి.

నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కార్ PMV EaS-E

ఇక ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ మరియు రేంజ్ విషయానికి వస్తే, ఇందులో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. కానీ బ్యాటరీ యొక్క కెపాసిటీని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే PMV మూడు విభిన్న శ్రేణి ఎంపికలతో Ease-Eని అందిస్తుంది. అవి 120km, 160km మరియు 200km. ఇది 13.41 బిహెచ్‌పి పవర్ మరియు 50 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారు కలిగి ఉంటుంది.

550 కేజీల బరువును కలిగి ఉన్న Ease-E ఎలక్ట్రిక్ కారు కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారుని 15A హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆశించినన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో లేనప్పటికీ, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, రెండు సీట్లలో రెండు సీట్‌బెల్ట్‌లు, రియర్ కెమెరా మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతానికి దీనికి ఎటువంటి ప్రత్యర్థి లేదు, కావున ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 16, 2022, 14:47 [IST]
English summary
Pmv eas e microcar launched at rs 4 79 lakh battery range charging features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+