భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ (Porsche) భారతదేశంలో రెండు సరికొత్త స్పోర్ట్స్ కార్లను విడుదల చేసింది. పోర్ష్ 911 జిటి3 (Porsche 911 GT3) మరియు పోర్ష్ 911 జిటి3 టూరింగ్‌ (Porsche 911 GT3 Touring) అనే రెండు స్పోర్ట్స్ కార్లను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు కార్లు కూడా వెనుక వైపు ఇంజన్ కలిగి ఉంటాయి మరియు ఇవి రెండూ కూడా న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ గ్యాసోలీన్ (పెట్రోల్) ఇంజన్లను కలిగి ఉంటాయి. భారత మార్కెట్లో ఈ స్పోర్ట్స్ కార్ల ధరలు రూ. 2.50 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

ఈ రెండు స్పోర్ట్స్ కార్లలో మొదటిగా పోర్ష్ 911 జిటి3 విషయానికి వస్తే, ఇది జర్మన్ స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ అందిస్తున్న 911 స్పోర్ట్స్ కారు యొక్క ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ గా ఉంటుంది. కాగా, రెండవ మోడల్ అయిన 911 జిటి3 టూరింగ్ అనేది ట్రాక్-ఫోకస్డ్ 911 జిటి3 యొక్క రోడ్-ఫోకస్డ్ వెర్షన్ గా ఉంటుంది మరియు ఇది మరింత సూక్ష్మమైన రియర్ వింగ్ ను కలిగి ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త పోర్ష్ 911 జిటి3 స్పోర్ట్స్ కారులో శక్తివంతమైన 4.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్‌ ఉంటుంది.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

ఈ ఇంజన్ గరిష్టంగా 503 bhp శక్తిని మరియు 470 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ పిడికె డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఇదొక రియర్ ఇంజన్ మౌంటెడ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ వెహికల్. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండదు. ఇందులోని పోర్ష్ యొక్క క్లినికల్ లాంచ్ కంట్రోల్ సిస్టమ్‌ కారణంగా 911 జిటి3 స్పోర్ట్స్ కారు కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

అదే, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన మోడల్ విషయానికి వస్తే, ఇది కేవలం 3.9 సెకండ్లలోనే గరిష్టంగా గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అంతేకాకుండా, కొత్త పోర్ష్ 911 జిటి3 కారులో హై స్పీడ్ కార్నరింగ్ సమయంలో అసాధారణమైన నియంత్రణ (కంట్రోల్) కోసం నాలుగు మూలల్లో డబుల్-విష్‌బోన్ సస్పెన్షన్‌ను కూడా ఉపయోగించారు.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring రెండు మోడళ్లు కూడా 2-సీటర్ స్పోర్ట్స్ కార్లు. ఈ కారులోని సీట్లు టాప్-షెల్ఫ్ లెదర్ అప్‌హోలెస్ట్రీతో తయారు చేయబడ్డాయి మరియు వీటిని ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సౌకర్యం ఉంటుంది. ఇంకా ఇందులో 10.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, రెవ్-కౌంటర్‌కు ఇరువైపులా అమర్చిన 7 ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు కూడా ఉంటాయి.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

అంతే కాకుండా, పోర్ష్ తమ కొనుగోలుదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా క్లబ్‌స్పోర్ట్ ప్యాక్‌ను కూడా అందిస్తుంది మరియు ఈ ప్యాకేజీలో రోల్ కేజ్, 6-పాయింట్ రేసింగ్ జీను మరియు మంటలను ఆర్పే యంత్రాన్ని కూడా అందిస్తుంది. ఇది ఈ స్పోర్ట్స్ కారుకు మరింత స్పోర్టియర్ మరియు రేస్ కార్ ను తలపించే అనుభూతిని అందిస్తుంది మరియు రోడ్డుపై 500+ bhp స్పోర్ట్స్ కారును డ్రైవింగ్ చేసే అనుభవాన్ని జోడిస్తుంది.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

ఇదిలా ఉంటే, పోర్ష్ ఇటీవలే భారతదేశంలో 718 కేమాన్ జిటిఎస్ 4.0 (Porsche 718 Cayman GTS 4.0 ) మరియు 718 బాక్స్టర్ జిటిఎస్ 4.0 (Porsche 718 Boxter GTS 4.0) కార్లను కూడా విడుదల చేసింది మరియు మార్కెట్లో వాటి ధరలు వరుసగా రూ. 1.46 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా), రూ. 1.49 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

పోర్ష్ 718 కేమాన్ జిటిఎస్ 4.0 మరియు పోర్ష్ 718 బాక్స్టర్ జిటిఎస్ 4.0 రెండూ కూడా BS6 కంప్లైంట్ 4.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లాట్ సిక్స్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయ్. ఈ ఇంజన్ గరిష్టంగా 395 bhp శక్తిని మరియు 420 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, 718 కేమాన్ జిటిఎస్ 4.0 లేదా 718 బాక్స్టర్ జిటిఎస్ 4.0 7-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడినప్పుడు టార్క్ 430 Nm కి పెరుగుతుంది.

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring స్పోర్ట్స్ కార్లు విడుదల

పోర్షే 911 జిటి3 మరియు పోర్ష్ 911 జిటి3 టూరింగ్ లాగా, ఈ ఇంజన్ కూడా 7-స్పీడ్ PDK ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక కొత్తగా విడుదలైన రెండు 911 స్పోర్ట్స్ కార్ల విషయానికి వస్తే, Porsche 911 GT3 మరియు Porsche 911 GT3 Touring రెండూ డబ్బుతో కొనుగోలు చేయగల అత్యుత్తమ స్పోర్ట్స్ కార్లలో ఒకటిగా ఉంటాయి. ఇవి అత్యధిక ధరను కలిగి ఉన్నప్పటికీ, ఆ ధరకు తగిన పనితనాన్ని కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 8, 2022, 18:02 [IST]
English summary
Porsche launches 911 gt3 and gt3 touring in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+