EV Yatra మొబైల్ యాప్ ప్రారంభించిన భారత రాష్ట్రపతి.. దీని వల్ల ఉపయోగాలేంటో ఇక్కడ చూడండి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న (2022 బుధవారం 14) నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ దినోత్సవాన్ని (జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం) పురస్కరించుకుని EV యాత్రా పోర్టల్ మరియు మొబైల్ యాప్ ప్రారభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కార్యక్రమం భారత రాష్ట్రపతి దీనిని ప్రారంభించింది. భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ యాప్ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ EV యాత్రా మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు సమీపంలో ఉండే EV ఛార్జర్ తెలుసుకోవచ్చు.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఈ మొబైల్ యాప్ అభివృద్ధి చేసింది. దీని సాయంతో సమీపంలో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఇ-మొబిలిటీని ప్రోత్సహించడానికి ఈ యాప్ తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లు తమ ఛార్జింగ్ వివరాలను నేషనల్ ఆన్‌లైన్ డేటాబేస్‌లో సురక్షితంగా నమోదు చేసుకునేందుకు వీలుగా BEE వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.
ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణలో దేశం సాధించిన విజయాలను ప్రదర్శించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న ఎనర్జీ కన్జర్వేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యుత్, కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌తో పాటు విద్యుత్ మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ హాజరైనట్లు తెలిసింది.
కొన్ని నివేదికల ప్రకారం దేశం మొత్తమ్ మీద దాదాపు ఐదు వేలకంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో దేశవ్యాప్తంగా నమోదైన ఎలక్ట్రిక్ వాహనాలు సంఖ్య 18 లక్షలకంటే ఎక్కువ అని తెలుస్తోంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ, మహారాష్ట్ర మొదలైనవి ఉన్నాయి. కాగా ఇతర రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో వేగంగా ముందుకు వెళ్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం ప్రస్తుతం వేగంగా ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు తక్కుగా ఉన్నాయి. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించగడానికి కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. కాగా ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కావున రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో రానున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలను లాంగ్ డ్రైవ్ లో ఉయోగించాలంటే ఇప్పుడు కొంత మంది సంకోచిస్తున్నారు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అవసరమైనన్ని అందుబాటులో లేదు. ఈ కారణంగా ఎక్కడైనా ఛార్జింగ్ వేసుకోవాల్సి వస్తే చాలా కష్టమవుతుంది. అయితే ప్రస్తుతం విడుదలైన EV యాత్ర మొబైల్ యాప్ మీకు సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ గురించి సమాచారం అందిస్తుంది. కావున ఎలక్ట్రిక్ వాహనాలతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారు జాలీగా ప్లాన్ చేసుకోవచ్చు.
EV Yatra మొబైల్ యాప్ ప్రారభంపై మా అభిప్రాయం:
EV Yatra మొబైల్ యాప్ అనేది ప్రస్తుత కాలంలో చాలా అవసరమైన మొబైల్ అప్లికేషన్. ఇది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే వాహన వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ కనుగొనవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








