మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారాను కంపెనీ నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఎస్‌యూవీని టొయోటా ఇటీవల విడుదల అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేశారు. చూడటానికి ఈ రెండు మోడళ్లు వేర్వేరుగా కనిపించినప్పటికీ, ఈ రెండింటిలో అనేక విషయాలు మాత్రం ఒకేలా ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

ఇప్పటి వరకూ మారుతి సుజుకి కార్లను టొయోటా రీబ్యాడ్జ్ చేస్తూ వచ్చింది. వీటిలో మనం ఇప్పటికే బాలెనో ఆధారిత గ్లాంజా, బ్రెజ్జా ఆధారిత అర్బన్ క్రూయిజర్ మోడళ్లను చూశాం. అయితే, ఈసారి ఇందుకు భిన్నంగా టొయోటా వాహనాన్ని మారుతి సుజుకి రీబ్యాడ్జ్ చేసింది. టొయోటా తయారు చేసిన హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని గ్రాండ్ విటారా పేరుతో మారుతి సుజుకి అందుబాటులోకి తెచ్చింది. టొయోటా ఇప్పటికే తమ హైరైడర్ అమ్మకాలను ప్రారంభించంగా, మారుతి ఇప్పుడే కొత్తగా గ్రాండ్ విటారా అమ్మకాలను ప్రారంభించింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

గ్రాండ్ విటారా vs హైరైడర్: మైల్డ్-హైబ్రిడ్ ధరలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ధరలు రూ.10.45 లక్షల (సిగ్మా, మ్యాన్యువల్ వేరియంట్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్‌ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ.16.89 లక్షలు (ఆల్ఫా వేరియంట్, సింగిల్ టోన్) మరియు రూ.17.05 లక్షలు (ఆల్ఫా వేరియంట్, డ్యూయెల్ టోన్) గా ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

కాగా, టొయోటా ఈ స్మార్ట్ (మైల్డ్) హైబ్రిడ్ వేరియంట్ల ధరల విషయంలో వేచి చూడాలనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే, కంపెనీ ఇంకా తమ హైరైడర్ యొక్క మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌ల ధరల గురించి పెదవి విప్పలేదు. అయితే, ఇందులో మొత్తం 8 వేరియంట్‌లు అందుబాటులో ఉంటాయని మరియు టాప్-స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, V AT 2WD NEODRIVE) గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి, ధరల పరంగా ఈ రెండు మోడళ్లు కూడా దాదాపు సమానంగా ఉన్నాయి. అయితే, టొయోటా కార్లు ఎప్పటిలానే మారుతి కార్ల కంటే కొన్ని వేల రూపాయల ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

గ్రాండ్ విటారా vs హైరైడర్: స్ట్రాంగ్-హైబ్రిడ్ ధరలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా జెటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో మాత్రమే కంపెనీ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను అందిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, సింగిల్ టోన్) మరియు రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, సింగిల్ టోన్) గా ఉన్నాయి. కాగా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల ధరలు రూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్, S e-Drive 2WD HYBRID) నుండి ప్రారంభమై రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, V e-Drive 2WD HYBRID) వరకు ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

టొయోటా హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ మొత్తం 3 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ధరలను గమనిస్తే, మారుతి సుజుకి కన్నా టొయోటా యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లే తక్కువ ధరలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లను టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్లుగా ఉంచేందుకు వాటిని అనేక ఫీచర్లతో పరిమిత వేరియంట్లలో మాత్రమే విక్రయిస్తోంది. టొయోటా మాస్ సేల్స్‌ని లక్ష్యంగా చేసుకొని తమ హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లను తక్కువ ఫీచర్లతో సరసమైన ధరకే విక్రయిస్తోంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ మరియు మైలేజ్

ఈ రెండు ఎస్‌యూవీలలోని లో-ఎండ్ వేరియంట్లలో ఉపయోగించిన మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 101 బిహెచ్‌పి శక్తిని మరియు 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. అయితే, ఈ కారులోని ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?

స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ మరియు మైలేజ్

స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో కూడా ఇదే పవర్‌ట్రైన్ ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. - గ్రాండ్ విటారా‌ వేరియంట్ల వారీ ధరలు మరియు ఇతర వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Price comparison between new maruti suzuki grand bitara and toyota urban cruiser hyryder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X