జర్మన్ లగ్జరీ కారు కొన్న సింగర్ 'ఆస్త గిల్'.. దీని ధర ఎంతంటే?
సాధారణంగా లగ్జరీ కార్లు మరియు బైకులను ఎక్కువగా క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు మరియు సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇలాంటి కథనాలను మనం చాలా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ 'ఆస్త గిల్' ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

'ఆస్త గిల్' ఇండియన్ సింగర్, అంతే కాదు ఈమె సాంగ్ రైటర్ కూడా. ఇటీవల ఈమె 'బిఎండబ్ల్యు ఎక్స్7' (BMW X7) లగ్జరీ SUV కొనుగోలు చేసింది. దీనికి సంబందించిన వీడియో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో ఆస్త గిల్ కొత్త బిఎండబ్ల్యు ఎక్స్7 డెలివరీ తీసుకోవడం చూడవచ్చు.

అంతే కాకూండా ఈ వీడియోలో ఈమె ఆ కొత్త కారు ముందు పోజులివ్వడం కూడా చూడవచ్చు. 'బిఎండబ్ల్యు ఎక్స్7' (BMW X7) అనేది కంపెనీ యొక్క కొత్త SUV. ఇది దాని విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ (Mercedes-Benz GLS) వంటి లగ్జరీ SUV కి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో బిఎండబ్ల్యు యొక్క ఎక్స్7 మొదటిసారిగా 2019లో ప్రారంభించబడింది. అయితే అంతకు ముందు కంపెనీ దీనిని కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారతీయ మార్కెట్ కి తీసుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఇది దేశీయ మార్కెట్లోనే అందుబాటులో ఉంది. ఈ SUV ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కూడా కొనుగోలు చేశారు.

కొత్త బిఎండబ్ల్యు ఎక్స్7 అనేది అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీని గ్రిల్‌కు రెండు వైపులా రెండు సొగసైన హెడ్‌ల్యాంప్ యూనిట్‌లతో పాటు ముందు భాగంలో కిడ్నీ గ్రిల్‌ను పొందుతుంది. అదే విధంగా దాని సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. అదే సమయంలో మీరు దాని టెయిల్‌గేట్‌పైన BMX X7 బ్రాండింగ్ బ్యాడ్జ్ చూడవచ్చు.

బిఎండబ్ల్యు ఎక్స్7 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డాష్‌బోర్డ్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్స్7 లేజర్ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ త్రీ-పీస్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 5 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా అందుబటులో ఉంది.
ఇక్కడ 'ఆస్త గిల్' బిఎండబ్ల్యు ఎక్స్7 యొక్క ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఇది x30d DPE సిగ్నేచర్ వేరియంట్, M50d మరియు xDrive 40i వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఇందులోని x30d DPE సిగ్నేచర్ వేరియంట్ 3.0 లీటర్ ట్విన్‌పవర్ టర్బోచార్జ్డ్ స్ట్రెయిట్ 6 డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 261 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా M50d వేరియంట్ 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 394 బిహెచ్‌పి పవర్ మరియు 760 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఇక చివరగా xDrive 40i వేరియంట్ విషయానికి వస్తే, ఇది 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 335 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవన్నీ కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంటాయి. మార్కెట్లో BMW X7 SUV యొక్క ప్రారంభ ధరల రూ. 1.15 కోట్లు కాగా, టాప్ మోడల్ ధర రూ. 1.73 కోట్లు వరకు ఉంది. (ధరలు ఎక్స్-షోరూమ్).


Click it and Unblock the Notifications








