కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

విజయదశమి మరియు దీపావళి సందర్భంగా ఎక్కువ మంది కొత్త వాహనాలను కొనుగులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో సాధారణ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల షన్ను, శివ జ్యోతి, సత్తి,మరియు వైవా హర్ష కొత్త కార్లు కొనేశారు. అయితే ఇందులో రచ్చ రవి కూడా ఉన్నారు. రచ్చ రవి ఇటీవల కొనుగోలు చేసిన ఆ కొత్త కారు ఏది, దాని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

నివేదికల ప్రకారం, రచ్చ రవి మారుతి సుజుకి యొక్క కొత్త గ్రాండ్ విటారా కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో గ్రాండ్ విటారాను రచ్చ రవి డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మొత్తం 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో రచ్చ రవి ఏ వేరియంట్ కొనుగోలు చేసాడు అనేది తెలియదు. అయితే ఇతడు కొనుగోలు చేసిన కారు ధర రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది, కావున ఇది బహుశా టాప్ ఎండ్ వేరియంట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో 'నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్' అనే ఆరు సింగిల్ టోన్ కలర్స్. ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్' అనే డ్యూయెల్ టోన్ కలర్స్.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

కొత్త మారుతి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

గ్రాండ్ విటారా యొక్క 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

కొత్త మారుతి గ్రాండ్ విటారాలో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

మారుతి గ్రాండ్ విటారా లో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఇక రచ్చ రవి విషయానికి వస్తే, ఇతడు జబర్దస్త్ టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇటీవల తానూ కొన్న కొత్త కారుకి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన చాలామంది కంగ్రాట్స్ చెబుతున్నారు, మరి కొంతమంది పార్టీ అడుగుతున్నారు.

కొత్త కారు కొనుగోలుతో రచ్చరచ్చ చేసిన రచ్చ రవి [వీడియో].. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. ఇప్పటికే కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. కాగా రానున్న రోజుల్లో ఈ SUV మరిన్ని ఎక్కువ బుకింగ్స్ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Article Published On: Saturday, October 8, 2022, 15:25 [IST]
English summary
Racha ravi busy new maruti grand vitara car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+