రానున్న పండుగ వేళ Renault కార్ కొనేద్దామా.. ఇప్పుడు ఆఫర్స్ కూడా
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) 2022 కొత్త సంవత్సరం మరియు రానున్న సంక్రాంతి పురస్కరించుకుని తన కార్లపైన అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్త సంవత్సరంలో కొత్త కారుని కొనాలనుకునేవారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. ఇప్పుడు కంపెనీ తన కార్లపై ఏకంగా రూ. 1.30 లక్షలు డిస్కౌంట్స్ మరియు బెణిఫీట్స్ అందిస్తుంది.
రెనాల్ట్ కంపెనీ యొక్క రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ కైగర్ మరియు రెనాల్ట్ డస్టర్ అనే నాలుగు మోడళ్లపై ఈ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
రెనాల్ట్ కంపేనీ 2022 జనవరి నెలలో కొనుగోలుదారులు పెంచుకోవడానికి మరియు తన అమ్మకాలను వృద్ధి చెందించడం కోసం తన రెనాల్ట్ ట్రైబర్ MPV పైన మొత్తంగా రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ.10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ అందిస్తుంది.

అదే సమయంలో ఈ నెల 2022 మోడల్‌పై మొత్తం రూ.30,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ.10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ అందించబడుతుంది. కావున కొనుగోలుదారులుదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ ఆఫర్స్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
రెనాల్ట్ కంపెనీ యొక్క రెనాల్ట్ క్విడ్ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్. రెనాల్ట్ క్విడ్ 2021 మోడల్‌పై కంపెనీ ఈ నెల మొత్తం రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ.10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇవ్వబడుతోంది.

అయితే అదే సమయంలో, ఈ 2022 కొత్త మోడల్‌పై మొత్తం కూడా రూ. 30,000 తగ్గింపు అందిస్తుంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ.10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇవ్వబడుతోంది. ఇప్పటివరకు కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు చేప్పట్టిన మోడల్ ఈ రెనాల్ట్ క్విడ్ మాత్రమే ఐ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

రెనాల్ట్ డస్టర్ (Renault Duster):
రెనాల్ట్ డస్టర్ హ్యాచ్‌బ్యాక్ యొక్క 2021 మోడల్‌పై కంపెనీ ఈ నెల మొత్తం రూ.1.30 లక్షల తగ్గింపును అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లలో ఇది అత్యధికం. ఇందులో, స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 1,10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇవ్వబడుతోంది.
కంపెనీ యొక్క అన్ని వెర్షన్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బెణిఫీట్స్ మరియు రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఈ మోడల్ పైన రూ. 30,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

రెనాల్ట్ కిగర్ (Renault Kiger):
కంపెనీ ఇప్పుడు తన రెనాల్ట్ కిగర్ పైన 20,000 రూపాయల డిస్కౌంట్ మాత్రమే అందిస్తుంది. ఇందులో 10,000 రూపాయల తగ్గింపుతో పాటు 10,000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ పైన కంపెనీ చాలా తక్కువ డిస్కౌంట్ అందిస్తుంది.

రెనాల్ట్ కిగర్ అనేది కంపెనీ నుండి వచ్చిన లేటెస్ట్ మోడల్ కావున అతి తక్కువ డిస్కౌంట్ అందిస్తుంది. అయినప్పటికీ ఈ మోడల్ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఈ కొంత మొత్తంలో డిస్కౌంట్ అందించడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

ఇదిలా ఉండగా ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న చిన్న కారు రెనో క్విడ్ (Renault Kwid) అరుదైన మైలురాయిని చేరుకుంది. రెనో క్విడ్ భారతదేశంలో 4 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని కంపెనీ ప్రకటించింది. రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ను తొలిసారిగా 2015 లో భారత మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి ఇది ఈ విభాగంలో గేమ్ ఛేంజర్ గా మారింది.

రెనో బ్రాండ్ భారతదేశంలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఇటీవలే రిఫ్రెష్డ్ 2021 మోడల్ రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ను ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో కొత్త 2021 రెనో క్విడ్ ధరలు రూ. 4.11 లక్షల నుండి, రూ. 5.56 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఈ కొత్త మోడల్ మునుపటి మోడల్ కంటే ఆకర్షణీయమైన ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు మరియు మెరుగైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
కంపెనీ ఈ కొత్త 2021 Renault Kwid హ్యాచ్‌బ్యాక్ ని 0.8 లీటర్ మరియు 1.0 లీటర్ అనే రెండు రకాల ఇంజన్ ఆప్సన్లతో అందిస్తోంది. ఈ కారులో కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కూడిన 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్ఈడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








