రెనాల్ట్ 2022 జులై ఆఫర్స్: రూ. 94,000 వరకు తగ్గింపు.. ఇక మీదే ఆలస్యం
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'రెనాల్ట్' (Renault) కంపెనీ తన బ్రాండ్ వాహనాలపైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ కిగర్ మరియు రెనాల్ట్ ట్రైబర్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్స్ పైన ఏకంగా రూ. 94,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ యొక్క ఈ మోడళ్లను ఈ నెలలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అనే చెప్పవచ్చు. ఈ మోడల్స్ పైన అందుబాటులో ఉన్న ఈ ఆఫర్స్ గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
రెనాల్ట్ యొక్క 2021 క్విడ్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 82,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 37,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ పాలసీ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే 2022 క్విడ్ కొనుగోలుపైన 77,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 37,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ పాలసీ బెనిఫిట్స్ ఉన్నాయి.

2021 రెనాల్ట్ క్విడ్ రెండు పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. అవి 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 54 బిహెచ్‌పి పవర్ మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇక 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 68 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

రెనాల్ట్ కిగర్ (Renault Kiger):
2022 జులై నెలలో రెనాల్ట్ కిగర్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 75,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 55,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ ఆఫర్స్ మరియు రూ 10,000 స్క్రాపేజ్ బెనిఫిట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. కావున మొత్తం ఇప్పుడు ఈ రెనాల్ట్ కిగర్ కొనుగోలుపైన రూ. 75,000 వరకు ప్రయాజనాలను పొందవచ్చు.

రెనో కిగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబటులో ఉంటుంది. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి. అదే సమయంలో ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
రెనాల్ట్ కంపెనీ యొక్క ఈ ట్రైబర్ కొనుగోలుపైన కొనుగోలుదారులు ఇప్పుడు గరిష్టంగా రూ. 94000 ఆదా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ట్రైబర్ పైన రూ. 94,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 44,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్ మరియు స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 తగ్గుతుంది. మొత్తం మీద రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన రూ. 94,000 బెనిఫిట్ పొందవచ్చు.

రెనాల్ట్ ట్రైబర్ అనేది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి ప్రజాదరణ పొందిన ఎంపివి. ఇది 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 71 బిహెచ్‌పి పవర్ మరియు 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్ మంచి డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక సేఫ్టీ ఫీహార్స్ కూడా పొందుతుంది. కావున ఇది గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ట్ రేటింగ్ పొందింది. రెనాల్ట్ ట్రైబర్ 7-సీట్ల ఎమ్‌పివి, దీనికి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ అఫర్ తీసుకురావడం వల్ల మరిన్ని మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ తన బ్రాండ్ వాహనాల యొక్క అమ్మకాలను పెంచడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే కస్టమర్లకు కొన్ని ప్రయోజానాలను అందిస్తూ తక్కువ ధరకే విక్రయించడానికి కంపెనీ ఈ ఆఫర్లను తీసుకురావడం జరిగింది. 2022 జూన్ నెలలో కూడా కంపెనీ తమ బ్రాండ్ వాహనాలలో కొన్నింటిపైన డిస్కౌంట్స్ ప్రకటించింది. అయితే ఇప్పుడు పైన చెప్పిన మూడు మోడల్స్ పైన మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








