వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

భారత ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన మోడళ్లలో ఒకటైన ఫ్రెంచ్ ఎస్‌యూవీ "రెనో డస్టర్" (Renault Duster) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా కనుమరుగైంది. రెనో ఇండియా, గడచిన జనవరి 2022 లోనే ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసింది, కాగా ఇందులో మిగిలిన స్టాక్‌ను ఇప్పటి వరకు విక్రయిస్తూ వచ్చింది. తాజాగా, తమ ఇండియన్ వెబ్‌సైట్‌లో రెనో డస్టర్ మోడల్ ను కంపెనీ తొలగించి వేసింది. అయితే, దీని స్థానంలో కొత్త తరం రెనో డస్టర్ వస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

రెనో ఇండియా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించినప్పుడు అందులో డస్టర్ పేజ్ కనిపించదు. ఒకవేళ నేరుగా డస్టర్ పేజీని బ్రౌజ్ చేసినప్పుడు, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అయితే, కంపెనీ ఈ ఎస్‌యూవీ పట్ల ఇప్పటికీ ఆసక్తి ఉన్న వారి కోసం రిజిస్ట్రేషన్లను ఓపెన్ చేసింది. డస్టర్ పట్ల నిజంగా ఆసక్తి ఉంటే, మీరు మీ సమాచారాన్ని ఆ పేజీలో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను చూస్తుంటే, రెనో ఇండియా కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీ కోసం కస్టమర్ల ఆసక్తిని పరీశిలిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

అంటే, రెనో డస్టర్ ఎస్‌యూవీ కోసం వచ్చే రిజిస్ట్రేషన్లను బట్టి కంపెనీ ఇందులో కొత్త తరం మోడల్ ను తీసుకురావాలా లేదా అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. రెనో ఇండియా తమ మూడవ తరం డస్టర్ మోడల్ భారయ మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు, ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌తో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. రెనో గతేడాది అధునాతన మార్పులతో తయారు చేసిన తమ సెకండ్ జనరేషన్ (రెండవ తరం) డస్టర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

అయితే, కంపెనీ దానిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఇష్టపడలేదు. ఇందుకు ప్రధాన కారణం, ప్రస్తుత డస్టర్ ఎస్‌యూవీ ఆదరణ తగ్గిపోవడమే. సెకండ్ జనరేషన్ డస్టర్ కూడా చూడటానికి ఇంచు మించు ఫస్ట్ జనరేషన్ డస్టర్ మాదిరిగానే కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, రెనో డస్టర్ ప్రస్తుతానికి భారత మార్కెట్ కు దూరమైనప్పటికీ, కంపెనీ ఇందులో ఓ థర్డ్-జెన్ (మూడవ తరం) మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

రెనో డస్టర్ విషయానికి వస్తే, ఇది దాదాపు పదేళ్ల క్రితం భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా విడుదలైంది. ఆ సమయంలో ఇది ఈ విభాగంలోనే సరికొత్త ట్రెండ్‌ను మరియు బెంచ్ మార్క్ లను సెట్ చేసింది. రెనో డస్టర్ మార్కెట్-నిర్దిష్ట మార్పులతో కూడిన ఓ గ్లోబల్ ప్రోడక్ట్ మరియు అది దాని బలమైన శక్తిసామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన మోడల్. యూరోపియన్ మార్కెట్లో ఈ మోడల్ కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లలో ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో కూడా లభిస్తుంది. మనదేశంలో కూడా తొలుత ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండేది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

ఇంతటి పాపులర్ ఎస్‌యూవీ ఇప్పుడు భారత మార్కెట్ నుండి తొలగిపోయింది. భారతదేశంలో రెనాల్ట్ డస్టర్ కోసం కంపెనీ చేసిన ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మొదటిది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 156 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. అయితే, ఇందులో టర్బో పెట్రోల్ వేరియంట్ మాత్రం సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

బిఎస్6 అప్‌డేట్ తర్వాత రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యూవీలో డీజిల్ ఇంజన్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్స్ రెండింటినీ తొలగించి వేసింది. రగ్గడ్ బాడీ, విశాలమైన ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజన్ మరియు ఆకర్షణీయమైన యూరోపియన్ డిజైన్ తో ఇది భారతీయ ఎస్‌యూవీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, రెనో ఇండియా మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ఈ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేయడంలో విఫలమైంది. ఫలితంగా, ఈ విభాగంలో కొత్తగా వచ్చిన ఎస్‌యూవీల ముందు రెనో డస్టర్ నిలబడలేకపోయింది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త తరం రెనో డస్టర్ (Renault Duster) ను కంపెనీ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఆధునిక డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో మాదిరిగా కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల వలె కాకుండా, పూర్తిగా స్క్రాచ్ నుంచి ఈ కొత్త ఎస్‌యూవీ తయారు చేస్తున్నారు. కొత్త డస్టర్ ను సిఎమ్‌ఎఫ్-బి ఎల్ఎస్ (CMF-B LS) ప్లాట్‌ఫామ్ పై తయారు చేయనున్నారు. ఇది విభిన్న రకాల పవర్‌ట్రైన్ (పెట్రోల్, ఎలక్ట్రిక్) ఆప్షన్లకు అనుకూలంగా ఉంటుంది.

వెబ్‌సైట్‌లో కూడా కనిపించని రెనో డస్టర్ (Renault Duster), కొత్త మోడల్ వస్తుందా లేదా..?

కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్లు, క్రూయిజ్ కంట్రోల్, 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అవసరమైన ఫీచర్లతో పాటుగా మరికొన్ని ఇతర లేటెస్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2022, 15:36 [IST]
English summary
Renault india removes duster suv from its official website but opened registrasions
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+