కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault), దేశీయ విపణిలో విక్రయిస్తున్న కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. భారతదేశంలో ప్రస్తుత పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని, స్టాండర్డ్ మోడళ్ల కన్నా కాస్తంత భిన్నంగా ఉండేలా ఈ పరిమిత కాలపు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

రెనో కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్‌ల బుకింగ్‌లు నేటి నుండి (సెప్టెంబర్ 2, 2022వ తేదీ నుండి) దేశవ్యాప్తంగా ఉన్న రెనో ఇండియా డీలర్‌షిప్‌లలో ప్రారంభమవుతాయి.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

కైగర్ మరియు ట్రైబర్ యొక్క ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను వాటి యొక్క RXZ వేరియంట్‌లను ఆధారంగా చేసుకొని తయారు చేయగా, క్విడ్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ను దాని యొక్క క్లైంబర్ వెర్షన్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త లిమిటెడ్ ఎడిషన్ కార్లు వాటి సాధారణ వేరియంట్‌ల ధరలోనే అందించబడుతున్నాయి. అంటే కొత్త రెనో క్విడ్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ యొక్క మాన్యువల్ వెర్షన్ ధర రూ. 5.54 లక్షలు కాగా ఆటోమేటిక్ ధర రూ. 5.99 లక్షలు. మాన్యువల్ ట్రైబర్ ఫెస్టివ్ ఎడిషన్ ధర రూ. 7.78 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర రూ. 8.30 లక్షలు. చివరగా, కైగర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ ధరలు రూ. 8.39 లక్షల నుండి రూ. 10.39 లక్షల మధ్యలో ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో ఇండియా అందిస్తున్న ఈ అన్ని ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ బ్లాక్ రూఫ్‌తో వైట్ బాడీ కలర్‌లో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటాయి. ఈ మూడు లిమిటెడ్ ఫెస్టివ్ ఎడిషన్ కార్లు కూడా ఫ్రంట్ గ్రిల్‌పై, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్‌లైట్ల చుట్టూ మరియు సైడ్ డోర్ డెకాల్స్‌ను స్టాండర్డ్ గా కలిగి ఉంటాయి.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో క్విడ్ క్లైంబర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ దాని ముందు మరియు వెనుక బంపర్లలో ఉన్న ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లపై రెడ్ హైలైట్‌లను పొందుతుంది. ఇందులో రూఫ్ రెయిల్స్ కూడా రెడ్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. సైడ్ లో C-పిల్లర్‌పై ఉన్న క్లైంబర్ డెకాల్ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ క్విడ్ యొక్క వీల్ కవర్లు మరియు సైడ్ మిర్రర్లు ఇప్పుు పియానో ​​బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో ట్రైబర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది కూడా పియానో ​​బ్లాక్ వీల్ కవర్‌లను పొందుతుంది మరియు డోర్ హ్యాండిల్స్ పియానో బ్లాక్ కలర్ స్కీమ్‌లోనే ఫినిష్ చేయబడి ఉంటాయి. కైగర్ ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ సిల్వర్‌స్టోన్ వీల్స్ మరియు వాటి రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్‌లను కలిగి ఉంటుంది.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

భారత మార్కెట్లో రెనో లైనప్ యొక్క కొత్త ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసిన సందర్భంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో.. ఈ పండుగ సీజన్ కోసం అదనంగా ముస్తాబైన కొత్త మోడళ్లు వాటి స్టాండర్డ్ మోడళ్ల ధరల వద్దనే వినియోగదారులకు అధిక విలువను అందిస్తాయని తెలిపింది.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త 2022 రెనో క్విడ్ (New 2022 Model Renault Kwid) హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కారులో కంపెనీ దాని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్లలో పలు మార్పులు చేర్పులు చేసింది. అలాగే, రెనో కైగర్ లో కూడా కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2022 రెనో కైగర్ ప్రారంభ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో కైగర్ (Renault Kiger) ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ గా ఉంది. స్టైలిష్ ఎక్స్టీరియర్స్ మరియు ప్రీమియం ఇంటీరియర్స్ తో లభించే ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రెనో కైగర్ లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో మల్టీ-ఫంక్షనల్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ స్టీరింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లలో ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్లను విడుదల చేసిన రెనో

రెనో కైగర్ అదే 999 సిసి 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 బిహెచ్‌పి పవర్ ను మరియు 2,200 - 4,400 ఆర్‌పిఎమ్ మధ్యలో 152 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault india reveals festive limited edition models in kiger kwid and triber details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X