రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

భారత ఎస్‌యూవీ కార్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన ఫ్రెంచ్ కార్ రెనో డస్టర్ (Renault Duster) ఇకపై కనుమరుగు కానుంది. తాజా సమాచారం ప్రకారం, రెనో ఇండియా తమ ఫ్యాక్టరీలో డస్టర్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం రెనో డస్టర్ భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా విడుదలైనప్పుడు, ఇది ఈ విభాగంలోనే సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. అలాంటిది, ఇప్పుడు ఈ కారు భారత మార్కెట్ నుండి తొలగిపోనుంది. రెనో డస్టర్ మార్కెట్-నిర్దిష్ట మార్పులతో కూడిన ఓ గ్లోబల్ ప్రోడక్ట్ మరియు అది దాని బలమైన శక్తిసామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన మోడల్.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

రగ్గడ్ బాడీ, విశాలమైన ఇంటీరియర్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (గతంలోని మోడళ్లలో), శక్తివంతమైన ఇంజన్ మరియు ఆకర్షణీయమైన యూరోపియన్ డిజైన్ తో ఇది భారతీయ ఎస్‌యూవీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. రెనో ఇండియా ఇప్పటి వరకూ భారత మార్కెట్లో విక్రయిస్తున్నది తమ పాత (మొదటి) తరం డస్టర్ ఎస్‌యూవీనే. కాలానుగుణంగా, కంపెనీ ఈ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేయడంలో విఫలమైంది. ఫలితంగా, ఈ విభాగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో, రెనో డస్టర్ కొత్త మోడళ్ల సరసన పరుగులు తీయలేకపోయింది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గతేడాది అధునాతన మార్పులతో తయారు చేసిన తమ సెకండ్ జనరేషన్ (రెండవ తరం) డస్టర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసినప్పటికీ, దానిని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి కంపెనీ సిద్ధపడినట్లుగా కనిపించడం లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతానికి రెనో డస్టర్ భారత మార్కెట్ కు దూరమైనప్పటికీ, ఇందులో ఓ థర్డ్-జెన్ (మూడవ తరం) మోడల్‌ను రెనో ఇండియా నేరుగా భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త తరం రెనో డస్టర్ ఎస్‌యూవీ కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతోనే కాకుండా, విద్యుదీకరణకు (ఎలక్ట్రిఫికేషన్) కూడా అనుకూలంగా ఉంటుందని సమాచారం. అంటే, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కు అనుగుణంగా రెనో డస్టర్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ తో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

రెనో డస్టర్ కోసం కంపెనీ ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా, ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండేది. అయితే, ఇవి రెండూ కూడా పెట్రోల్ ఇంజన్లే కావటం గమనార్హం. వీటిలో మొదటిది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 156 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. అయితే, ఇందులో టర్బో పెట్రోల్ వేరియంట్ మాత్రం సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

రెనో డస్టర్ BS6 అవతార్ లో విడుదలైనప్పుడు, కంపెనీ ఈ మోడల్ అప్‌డేట్‌లో భాగంగా, ఇందులో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్‌ను తొలగించింది. అదే, ఇందులోని ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్. ప్రస్తుతం రెనో ఇండియా డస్టర్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, ఈ మోడల్ ఇంకా డీలర్ స్టాక్‌ యార్డులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో రెనో డస్టర్ ధరలు రూ. 9.86 లక్షల నుండి రూ. 14.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో అందుబాటులో ఉంది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

రెనో డస్టర్ భారతదేశంలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పాపులర్ మోడళ్లయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు మారుతి ఎస్-క్రాస్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఇదిలా ఉంటే, ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో 8 లక్షల విక్రయాల మార్కును అధిగమించింది. భారత మార్కెట్లో కంపెనీ ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం పట్టింది. కంపెనీ అందించిన డస్టర్ ఎస్‌యూవీకి గొప్ప స్పందన లభించింది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

ఆ తర్వాత ఇప్పుడు రెనో క్విడ్ మరియు రెనో ట్రైబర్ మోడళ్లకు గొప్ప స్పందన లభిస్తోంది. రెనో బ్రాండ్ నుండి తాజాగా వచ్చిన కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. రెనో ఇండియా, భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు గత దశాబ్దంలో 530 కొత్త సేల్స్ మరియు సర్వీస్ పాయింట్లను ప్రారంభించింది. కంపెనీ తమ డస్టర్ ఎస్‌యూవీని మొదటిసారిగా 2012లో భారతీయ వినియోగదారులకు పరిచయం చేసింది.

రెనో డస్టర్ (Renault Duster) ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేత..! కారణం ఏంటో తెలుసా..?

రెనో డస్టర్ తర్వాత ఆ బ్రాండ్ నుండి అంత గొప్ప స్పందన క్విడ్ కారుకి లభించింది. ఇది రెనో బ్రాండ్ నుండి రెండవ సక్సెస్‌ఫుల్ మోడల్ గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మూడవ విజయవంతమైన మోడల్ రెనో ట్రైబర్ కొనసాగుతోంది, ప్రస్తుతం ఇది దేశంలో కెల్లా అత్యంత సరసమైన 7-సీటర్ కారుగా ఉంది. రెనో క్విడ్ కారును కంపెనీ తొలిసారిగా 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టింది మరియు గతేడాది నవంబర్‌ నెలలో ఈ మోడల్ 4 లక్షల విక్రయాల మార్కును చేరుకుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2022, 17:31 [IST]
English summary
Renault india stops duster suv production here is all the details you wanted to know
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+