కేవలం రూ. 5.84 లక్షలకే '2022 Renault Kiger': ఇక ఆలస్యం ఎందుకు.. త్వరపడండి

దేశీయ మార్కెట్లో 'రెనాల్ట్' (Renault) కంపెనీ అమ్మకాల పరంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా కంపెనీ మరింత ప్రజాదరణ పొందటానికి ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్డేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కంపెనీ భారతీయ విఫణిలో తన '2022 రెనాల్ట్ కిగర్' అప్డేటెడ్ మోడల్ విడుదల చేసింది. ఈ కొత్త కాంపాక్ట్ SUV ప్రారంభ ధర రూ. 5.84 లక్షల (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 రెనాల్ట్ కిగర్ కొత్త డిజైన్ పొందటమే కాకుండా అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కంపెనీ దీని బుకింగ్స్ 2022 మార్చ్ 31 నుంచి స్వీకరించనుంది. కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

2022 రెనాల్ట్ కిగర్ ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ పొందింది. ఇందులో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, టెయిల్ గేట్‌పై క్రోమ్, టర్బో డోర్ డెకాల్ మరియు రెడ్ కలర్ వీల్ క్యాప్స్ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకూండా ఇవి కారుని చాలా స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందించింది. వీటితో పాటు కంపెనీ ఇందులో ఆటోమేటిక్ ఏసీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ మరియు పుష్-బటన్ స్టాప్/స్టార్ట్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్న టాప్ వేరియంట్స్ లో లభ్యమవుతున్నాయి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

2022 రెనాల్ట్ కిగర్ ఇప్పుడు మిస్టరీ బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్‌తో కొత్త డ్యూయల్-టోన్ మెటల్ మస్టర్డ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ SUV యొక్క డ్యాష్‌బోర్డ్‌కు రెడ్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. ఇందులోని సీట్లు కొత్తగా డిజైన్ చేయబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

కొత్త కిగర్, పైన చెప్పుకున్న అప్డేటెడ్ కాకుండా, కిగర్ ఆర్ఎక్స్‌టి (ఓ) వేరియంట్ యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా 71 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి వాటిని పొందుతుంది. అయితే పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ సేఫ్టీ రేటింగ్స్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున కొత్త రెనాల్ట్ కిగర్ పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ పొంది సురక్షితమైన కారుగా నిలిచింది. ఇది రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌, 60/40 స్ప్లిట్ రియర్ సీటు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి ఉన్నాయి.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ SUV విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందటమే కాకుండా, అనేక అవార్డులను కూడా అందుకుంది. ఈ కారణంగా ఇది భారత మార్కెట్లో అత్యంత విజయాన్ని పొందగలిగింది. రెనాల్ట్ కిగర్ 2021 లో భారతదేశంలో ప్రారంభించిన తరువాత మంచి ఆదరణ పొందింది. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే నేపాల్, దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వియజయవంతంగా ప్రారంభించబడింది.

కేవలం రూ. 5.84 లక్షలకే 2022 Renault Kiger: ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 జనవరి నెలలో రెనాల్ట్ కిగర్ అమ్మకాలు 3,053 యూనిట్లుగా ఉన్నాయి. అయితే 2021 డిసెంబర్ నెలలో ఈ అమ్మకాలు 2,117 యూనిట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క కిగర్ అమ్మకాలు పెరుగుదల దిశవైపు సాగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ రెనాల్ట్ కిగర్ యొక్క అప్డేటెడ్ మోడల్ విడుదలతో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాము. కావున ఏప్రిల్ నెల అమ్మకాల్లో మరింత వృద్ధికి నమోదు చేసుకోగలుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2022, 17:09 [IST]
English summary
Renault kiger launched at rs 5 84 lakh specs features details
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+